Home /News /national /

HURT ME PLEASE KILL ME SAYS KERALA GOLD SMUGGLING ACCUSED SWAPNA SURESH PVN

Swapna Suresh : ప్లీజ్ నన్ను బాధపెట్టండి,చంపేయండి..ఇలా తట్టుకోలేకపోతున్నా

స్వప్నా సురేష్

స్వప్నా సురేష్

Kerala Gold Smuggling Case: కేరళ(Kerala) రాష్ట్రంలో గతంలో వెలుగుచూసిన బంగారం స్మగ్లింగ్(Gold Smuggling) వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. గతేడాది కేరళ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ విషయం చుట్టూ కేరళ రాజకీయాలు తిరిగాయన్న విషయం కూడా తెలిసిందే.

ఇంకా చదవండి ...
Kerala Gold Smuggling Case: కేరళ(Kerala) రాష్ట్రంలో గతంలో వెలుగుచూసిన బంగారం స్మగ్లింగ్(Gold Smuggling) వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. గతేడాది కేరళ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ విషయం చుట్టూ కేరళ రాజకీయాలు తిరిగాయన్న విషయం కూడా తెలిసిందే. అయితే బంగారం స్మ‌గ్లింగ్ కేసులో నిందితురాలు స్వ‌ప్న సురేశ్(Swapna Suresh) తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. స్వప్న సురేష్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. నన్ను బాధపెట్టండి, దయచేసి నన్ను చంపండి, తద్వారా కథ ముగుస్తుంది అంటూ హాట్ కామెంట్స్ చేశారు. నా ఆరోగ్యం బాగోలేదు..నాకు బతికేందుకు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటూ స్వప్నా సురేష్ ఎమోషనల్ అయ్యారు. కాగా, మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఫేస్‌బుక్ పోస్ట్ చేసినందుకు ఆమె లాయర్‌ కృష్ణరాజ్‌పై పోలీసులు నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన నేపథ్యంలొనే స్వప్నా సురేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. తన లాయర్‌ను అరెస్టు చేయడం ఉద్దేశపూర్వకంగా తనను ఒంటరిని చేసే ప్రయత్నమని ఆమె అన్నారు. నాకు ఇప్పుడు లాయర్ సహాయం అందడం లేదు అని మీడియా ముందు వాపోయింది స్వప్నా సురేష్. ఇటీవల గోల్గ్ స్మగ్లింగ్ కేసుకి సంబంధించి తాను కోర్టులో ఇచ్చిన స్టేట్ మెంట్ వల్ల ఇబ్బందిపడినవారు ఇప్పుడు తనకు మద్దతు ఇచ్చే వ్యక్తులను టార్గెట్ చేస్తున్నారని స్వప్న అన్నారు. “ఇలా చేయకండి, దయచేసి మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి. గౌరవనీయమైన కోర్టు నిర్ణయం తీసుకోనివ్వండి” అని స్వప్న ఎమోషనల్ అయ్యారు.

అయితే మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు స్వప్నా సురేష్. కాగా,గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంలో కేరళ సీఎం విజయన్ ప్రమేయం ఉందని ఇటీవల స్వప్నా సురేష్ ఆరోపించిన విషయం తెలిసిందే. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​ కారణంగానే తాను బంగారం స్మగ్లింగ్​లో ఇరుక్కున్నట్లు స్వప్న సురేశ్​ వెల్లడించారు. ఈ కేసుతో కేర‌ళ సీఎం పిన‌రయి విజ‌య‌న్‌(CM Pinarayi Vijayan), ఆయన భార్య క‌మ‌లా విజ‌య‌న్‌, కూతురు వీణా విజ‌య‌న్‌, రాష్ట్ర ప్ర‌భుత్వ మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి న‌ళిని నెట్టో, సీఎం అద‌న‌పు వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శి సీఎం ర‌వీంద్ర‌న్‌, రాష్ట్ర మాజీ మంత్రి కేటీ జ‌లీల్‌ల‌కు సంబంధం ఉంద‌ని స్వ‌ప్న సురేశ్ ఆరోపించారు. గత మంగళవారం ఎర్నాకుళంలోని కోర్టుకు హాజరైన ఆమె.. ఈ కేసుకు సంబంధించి పలు ఆధారాలను సమర్పించారు. 2016లో కేర‌ళ సీఎంగా పిన‌రాయి విజ‌యన్ తొలిసారి యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి వెళ్లిన‌ప్పుడు బంగారం స్మ‌గ్లింగ్ మొద‌లైంద‌ని స్వ‌ప్న సురేశ్ ఆరోపించారు. యూఏఈలో పిన‌రాయి విజ‌య్ ప‌ర్య‌ట‌న‌కు ఏర్పాట్లు చేయాల‌ని సీఎం విజ‌య‌న్ ముఖ్య మాజీ కార్య‌ద‌ర్శి శివ‌శంక‌ర్ తనను ఆదేశించార‌ని స్వప్న సురేశ్ తెలిపారు. ఆ మ‌రుస‌టిరోజు సీఎం విజయన్ త్రివేండ్రంలో బ్యాగ్​ మర్చిపోయారని దానిని వీలైనంత త్వరగా దుబాయ్​ చేర్చాలని తనకు శివశంకర్ చెప్పారని.. ఈ క్రమంలో దుబాయ్​ కాన్సులేట్​లోని ఓ దౌత్య అధికారికి ఆ బ్యాగ్​ను తాను ఇచ్చానని..కానీ అక్కడ స్కానింగ్​లో బ్యాగ్​ నిండా డబ్బు ఉన్నట్లు తెలిసింది... ఈ ఘటన తర్వాతే నేను ఈ బంగారం స్మగ్లింగ్​లో భాగం కావాల్సి వచ్చింది... అంతేకాదు,దుబాయ్​ కాన్సులేట్​ నుంచి సీఎం నివాసానికి ఓ బిర్యానీ చేసే పాత్రలో విలువైన లోహాలను తరలించారు అని స్వప్న సురేశ్ కోర్టుకి తెలిపారు. ఈ విషయాన్ని వెల్లడించడం వెనుక తనకు మరో ఉద్దేశం లేదని స్వప్న అన్నారు. తన ప్రాణానికి ముప్పు ఉన్న కారణంగా ఈ వివరాలను గోప్యంగా కోర్టుకు వివరించినట్లు తెలిపారు. మీడియా ఈ కేసును దర్యాప్తు చేసి నిజాలను బయటపెట్టాలని విజ్ఞప్తి చేశారు.



Viral Video : తరగతి గదిలో ఉపాధ్యాయురాలు చేసిన పని చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Viral : అంబులెన్స్ లేదు ..మండుటెండలో ఏడ్చుకుంటూ చిన్నారి మృతదేహాన్ని భుజాలపై మోసి..

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు

కాగా,కేరళ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా, తిరువనంతపురం ఎయిర్ పోర్టులో జూలై 6,2020న ఒకేసారి 30 కేజీల బంగారం పట్టుపడింది. యూఏఈ దౌత్యకార్యాలయానికి చెందిన పార్సిల్‌లో 15కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకోవటం రాష్ట్రవ్యాప్తంగా అలజడి రేపింది. యూఏఈ నుంచి డిప్లొమాటిక్ పాస్ పోర్టుపై వచ్చిన సరిత్ కుమార్ అనే వ్యక్తి బ్యాగులో ఇది దొరికింది. తాను యూఏఈ రాయబార కార్యాలయం ఉద్యోగినని దబాయించిన అతను.. చివరికి నిజం కక్కేయడంతో ఈ గోల్ట్ స్మగ్లిండ్ సెన్సేషనల్ క్రైమ్ బయటపడింది. ఈ కేసులో UAE కాన్సులేట్ మాజీ ఉద్యోగి స్వప్న సురేష్ అరెస్టయిన 16 నెలల తర్వాత నవంబర్ 2021లో జైలు నుండి బెయిల్ ప విడుదలైంది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Gold smuggling, Kerala, Pinarayi Vijayan

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు