• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • HURLING SHOES AT SPEAKER PODIUM THREE BJP MLAS SUSPENDED FROM ASSEMBLY BUDGET SESSION IN ODISHA HSN

Odisha Assembly: స్పీకర్ పైకి చెప్పులు, మైక్రోఫోన్లు.. ఒడిశా అసెంబ్లీలో రచ్చరచ్చ.. ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్..

Odisha Assembly: స్పీకర్ పైకి చెప్పులు, మైక్రోఫోన్లు.. ఒడిశా అసెంబ్లీలో రచ్చరచ్చ.. ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్..

అసెంబ్లీ ఎదుట గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపడుతున్న బీజేపీ నేతలు

ఒడిశా బడ్జెట్ సమావేశాలు తీవ్ర గందరగోళ పరిస్థితులకు కారణమయ్యాయి. అసెంబ్లీలో రచ్చరచ్చ జరిగింది. స్పీకర్ పైకి చెప్పులను విసిరివేశారు. ఫలితంగా ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్ కు గురి అయ్యారు.

  • Share this:
    ఒడిశా అసెంబ్లీలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాలు తీవ్ర రసాభాసగా మారాయి. లోకాయుక్త బిల్లుపై మాట్లాడేందుకు ఛాన్స్ కోసం బీజేపీ నేతలు, అధికార బీజేడీ నేతల మైనింగ్ అవినీతి అక్రమాలపై చర్చను జరపాల్సిందేనంటూ కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టడంతో అసెంబ్లీ సమావేశాలు రణరంగంగా మారాయి. బీజేపీ ఎమ్మెల్యేలకు తోడుగా కాంగ్రెస్ సభ్యులు కూడా స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. స్పీకర్ పైకి చెప్పులు, కాగితపు ఉండలు, మైక్రోఫోన్లను విసిరి వేశారు. దీంతో సభను స్పీకర్ అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది. అంతేకాకుండా ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేశారు. సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందనీ, వారిని అసెంబ్లీలోకి అడుగుపెట్టకుండా మార్షల్స్ పర్యవేక్షించాలని స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. ఇంతకీ శనివారం ఒడిశా అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో అసలేం జరిగిందంటే..

    ఒడిశాలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో భాగంగానే లోకాయుక్త సవరణ బిల్లును బీజేడీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. దాన్ని ఆమోదిస్తున్నట్టు స్పీకర్ కూడా ప్రకటించారు. అయితే ఆ సవరణలపై చర్చ జరగకుండానే బిల్లును సభ ఆమోదించడం ఏంటంటూ బీజేపీ సభ్యులు మండిపడ్డారు. ఆ బిల్లుపై తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దీనికి స్పీకర్ పాత్రో అభ్యంతరం చెప్పారు. దీంతో పాత్రోపై బీజేపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెప్పులు, కాగితం ఉండలు, మైక్రోఫోన్లను విసిరివేశారు. అదే సమయంలో మైనింగ్ కార్యకలాపాల్లోని అక్రమాలపై చర్చను చేపట్టాలంటూ కాంగ్రెస్ సభ్యులు కూడా డిమాండ్ చేశారు. స్పీకర్ వారి డిమాండ్ ను కూడా తోసిపుచ్చారు. దీంతో బీజేపీ సభ్యులకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తోడయ్యారు.

    నినాదాలతో సభ దద్దరిల్లిపోయింది. సభలో ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. కాగితాల ఉండలు, మైక్రోఫోన్లు గాల్లో ఎగిరెగిరి పడ్డాయి. స్పీకర్ పైకి కూడా వాటిని విసిరివేశారు. దీంతో స్పీకర్ సభను అర్ధాంతరంగా వాయిదా వేశారు. ఈ ఘటనకు కారణమయిన ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేశారు. అసెంబ్లీలో బీజేపీ డిప్యూటీ లీడర్ బీసీ సేథీ, పార్టీ విప్ మోహన్ మాఝీ, ఎమ్మెల్యే జేఎన్ మిశ్రాలను అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగినంత కాలం సభ నుంచి సస్పెండ్ చేస్తునట్టు స్పీకర్ కార్యాలయం ప్రకటించింది. దీంతో సస్పెన్షన్ కు గురి అయిన ఎమ్మెల్యేలు గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ఇదిలా ఉండగా, ఆర్థిక మంత్రి నిరంజన్ పూజారి కాగ్ నివేదికను సభలో ప్రశేపెట్టిన అనంతరం సభను స్పీకర్ నిరవధికంగా వాయిదా వేశారు.
    Published by:Hasaan Kandula
    First published:

    అగ్ర కథనాలు