హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

రెండేళ్లలో 8 మందిని పొట్టనబెట్టుకున్న పులి.. తీవ్రంగా గాలిస్తున్న అధికారులు

రెండేళ్లలో 8 మందిని పొట్టనబెట్టుకున్న పులి.. తీవ్రంగా గాలిస్తున్న అధికారులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అటవీ సమీప ప్రాంతాల్లో సంచరిస్తున్న ఓ పులి రెండేళ్ల కాలంలో ఎనిమిది మందిని పొట్టన బెట్టుకుంది. ఈ ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబైకి 410 మైళ్ల దూరంలోకి ఖాంబాడ అనే చిన్న గ్రామంలో చోటుచేసుకుంది

అటవీ సమీప ప్రాంతాల్లో సంచరిస్తున్న ఓ పులి రెండేళ్ల కాలంలో ఎనిమిది మందిని పొట్టన బెట్టుకుంది. ఈ ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబైకి 410 మైళ్ల దూరంలోకి ఖాంబాడ అనే చిన్న గ్రామంలో చోటుచేసుకుంది. సోమవారం కట్టెలు సేకరించేందుకు వెళ్లిన 70 ఏళ్ల వృద్దుడిని ఆ పులి దాడిచేసి చంపేయడంతో.. ఈ విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ దాడులకు పాల్పడుతున్న రాజురా(ఆర్టీ-1) అనే పేరు గల పులిని పట్టుకునేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ దానిని పట్టుకోలేక పొతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము హాని చేయని బాణాలను ఉపయోగించి పులిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని, కానీ విజయం సాధించలేకపోతున్నామని మహారాష్ట్ర అటవీశాఖ అధికారి ఎన్‌ఆర్ ప్రవీణ్ తెలిపారు.

తాజాగా పులి దాడిలో మరణించిన వ్యక్తిని మారోటి పెండమ్‌గా గుర్తించారు. సోమవారం కట్టెలకు వెళ్లిన పెండమ్ తిరిగి రాకపోవడంతో.. కుటుంబసభ్యులు, పలువురు గ్రామస్తులు అతని జాడ కోసం వెతకడం ప్రారంభించారు. అయితే మంగళవారం ఉదయం అతని మృతదేహం కనిపించింది. అతని మృతదేహంలో ఎక్కువ భాగం పులి తినింది. పెండమ్ అడవికి వెళ్లిన సమయంలో పులి అతడిపై దూకి దాడి చేసిందని ఫారెస్ట్ డిప్యూటీ కన్సర్వేటర్ అరవింద్ ముండే తెలిపారు. అక్కడ లభించిన గుర్తుల ఆధారంగా.. గతంలో పలువురిని పొట్టనబెట్టుకున్న పులే ఇప్పుడు పెండమ్‌పై దాడి చేసి ఉంటుందని భావిస్తున్నామని తెలిపారు. అక్కడ దొరికిన నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించామని చెప్పారు.

అయితే ట్రాకింగ్‌ బృందాలు పులి ఆచూకీ కోసం చాలా కష్టపడుతున్నట్టు అధికారులు తెలిపారు. పులిని పట్టుకునేందుకు మరిన్ని బృందాలను పెంచనున్నటుట్ట చెప్పారు. రాజురాను పట్టుకోవడం కష్టతరంగా మారిన నేపథ్యంలో మరోసారి అది ఇలాంటి దాడులు చేయకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చిందేకు అధికారులు అత్యవసర సమావేశం జరపాల్సిన అవసరం ఉందన్నారు.

రాజురా చేతిలో హతమైన ఎనిమిది మంది బాధితులు

1. జనవరి 19, 2009- వర్ష తోడాసే, ఖాంబడా

2. నవంబర్ 25,2019- శ్రీహరి సాల్వే(రైతు), మూర్తి గ్రామం

3. డిసెంబర్ 25, 2019- కట్టెలు సేకరించేందుకు వెళ్లిన మహేష్ కోప్డే, రాజురా

4. జనవరి 4, 2020- గొర్రెల కాపరి సంతోష్ ఖమంకర్, కవిత్‌పేట

5. మార్చి 6,2020- కట్టెలు సేకరించేందుకు వెళ్లిన మారోటి టెకం, చునాలా

6. ఆగస్టు 18,2020- వాసుదేవ్ కొండేకర్(రైతు), నవేగాన్

7. సెప్టెంబర్ 26,2020- గోవింద మాధవి(రైతు), నవేగాన్

8. అక్టోబర్ 5,2020- కట్టెలు సేకరించేందుకు వెళ్లిన మారోటి పెండోర్, ఖాంబడా

ఇక, ప్రభుత్వ గణంకాలు.. 2014 నుంచి 2019 మధ్య కాలంలో పులల దాడిలో దాదాపు 225 మంది మరణించారని చెబుతున్నాయి. 1.3 బిలియన్ల జనాభా గల భారతదేశంలో అటవీ ప్రాంతాల అక్రమణ రోజురోజుకు పెరుగుతోంది.. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం. మరోవైపు 2018లో పులుల సంఖ్య 2,967కి పెరిగిందని భారత ప్రభుత్వం గతేడాది ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఆ సంఖ్య 312గా ఉందని పేర్కొంది. 2019లో పులుల సంఖ్య పెరుగుదలపై మాట్లాడిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. పులలకు అతిపెద్ద, అత్యంత సురక్షితమైన అవాసాలలో ఒకటిగా భారత్ ఉందన్నారు.

First published:

Tags: Tiger

ఉత్తమ కథలు