తాజ్ మహల్ చుట్టూ ఎటు చూసినా కొండ చిలువలే..

తాజ్ మహల్‌ చుట్టుపక్కల ప్రాంతాలు మొదటి నుంచీ కొండ చిలువలకు నెలవుగా ఉన్నాయి. తాజ్ మహల్‌కు 25 కి.మీ. పరిధిలో పెద్ద ఎత్తున కొండ చిలువలు బయటపడుతున్నాయి.

news18-telugu
Updated: October 23, 2019, 4:53 PM IST
తాజ్ మహల్ చుట్టూ ఎటు చూసినా కొండ చిలువలే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రపంచంలోనే అత్యద్భుతమైన కట్టడాల్లో మన తాజ్‌మహల్ ఒకటి. మొఘల్ రాజు షాజహాన్.. తన భార్య ముంతాజ్ గుర్తుగా ఈ చారిత్రక సమాధిని నిర్మించారు. అందమైన ఈ పాలరాతి కట్టడాన్ని వీక్షించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ఐతే ప్రేమ చిహ్నమైన ఈ తాజ్ మహల్ గురించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. తాజ్ మహల్ చుట్టుపక్కల ఎక్కడ చూసినా కొండ చిలువలే కనిపిస్తున్నాయి. గత నెల రోజుల్లో ఏకంగా వందకు పైగా పైతాన్‌లు దొరకవడంతో తాజ్ మహల్ పర్యాటకుల్లో భయం నెలకొంది.

తాజ్ మహల్‌ చుట్టుపక్కల ప్రాంతాలు మొదటి నుంచీ కొండ చిలువలకు నెలవుగా ఉన్నాయి. తాజ్ మహల్‌కు 25 కి.మీ. పరిధిలో పెద్ద ఎత్తున కొండ చిలువలు బయటపడుతున్నాయి. వర్షాకాలంలో జులై నుంచి అక్టోబరు వరకు వీటి సంచారం ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. వర్షాల సమయంలో యమున తీరంలోని అడవుల నుంచి ఇవి జనావాసాల్లోకి వస్తున్నాయని వెల్లడించారు. ఐతే ఆగ్రా ప్రజలు వీటిని చంపరని.. పాములను పట్టే స్వచ్ఛంద సంస్ధలు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందిస్తారు. వాటిని పట్టుకొని తిరిగి అడవుల్లోకి వదలిపెడతారు.

సెప్టెంబరు 11న తాజ్‌ మహల్‌కు 15 కి.మీ. దూరంలో ఉన్న సికింద్రాలో ఓ ఫ్యాక్టరీలో కొండచిలువను పట్టుకున్నారు.

సెప్టెంబరు 20న తాజ్ మహల్‌కు కొద్ది కి.మీ. దూరంలో ఉన్న గ్వాలియర్ హైవేపై 6 ఫీట్ల కొండచిలువను స్థానికులు కాపాడారు.అక్టోబరు 7న జోగ్ సోహాన్ గ్రామంలో ఐదు ఫీట్ల పొడవైన పైతాన్‌ను స్థానికులు పట్టుకున్నారు. కొండచిలువతో పాటు మరో నాలుగు పాములను కాపాడి అడవుల్లో వదలిపెట్టారు.

అక్టోబరు 10న పన్వాడీలో మరో కొండచిలువను స్థానికులు కాపాడారు. ఆ భారీ కొండ చిలువను చూసి స్థానికులు భయంతో వణికిపోయారు.

అక్టోబరు 19న కిరావలీ ప్రాంతంలో మరో కొండచిలువను ఫారెస్ట్ అధికారులు పట్టుకొని అడవిలో వదిలిపెట్టారు.యమునా తీరంలో పలు స్మారక కేంద్రాలు ఉన్నాయి. తాజ్ మహల్‌తో  పాటు మహతా బాగ్, ఆగ్రా కోట వంటి కట్టడాలు యమునా నది పక్కనే ఉంటాయి. ఇక సికిందరాలోని అక్బర్ సమాధి నదీ తీరానికి కొంత దూరంలో ఉంటాయి.  యుమునా నది చుట్టుపక్కన ఉన్న అడవుల్లో పెద్ద ఎత్తున కొండచిలువలు ఉన్నాయని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. వర్షాకాలంలో అవన్నీ జనవాసాల్లోకి వస్తున్నాయని.. ఐతే ఆగ్రా ప్రజలకు వాటి గురించి అవగాహన ఉందని చెప్పారు. కొండచిలువలను చంపకుండా.. వాటిని పట్టుకొని అడవుల్లో వదలి పెడతారని తెలిపారు. అందుకే ఈ అడవుల్లో కొండ చిలువల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని చెప్పారు.
First published: October 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు