KK Shailaja: కరోనాపై పోరులో "రాక్‌స్టార్ హెల్త్ మినిస్టర్" అనిపించుకున్న కేకే శైలజ

కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ చాలా మంది ఫ్రంట్ లైన్ వారియర్స్, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు.. ప్రాణాలకు తెగించి ప్రజలకు సాయం అందించడానికి ముందుకు వచ్చారు. అలాంటి వారిలో కేరళ ఆరోగ్య, సంక్షేమ శాఖ మంత్రి కేకే శైలజ ప్రత్యేకంగా నిలిచారు.

news18-telugu
Updated: October 11, 2020, 12:44 PM IST
KK Shailaja: కరోనాపై పోరులో
కేకే శైలజ
  • Share this:
కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ చాలా మంది ఫ్రంట్ లైన్ వారియర్స్, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు.. ప్రాణాలకు తెగించి ప్రజలకు సాయం అందించడానికి ముందుకు వచ్చారు. అలాంటి వారిలో కేరళ ఆరోగ్య, సంక్షేమ శాఖ మంత్రి కేకే శైలజ ప్రత్యేకంగా నిలిచారు. కేరళలో కరోనా నియంత్రణలో ఆమె చేసిన కృషి అంతా ఇంతా కాదు. ఏ మాత్రం గర్వం లేకుండా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను సమీక్షిస్తూ కరోనా నియంత్రణకు ముందుకు సాగారు. చాలా ఏళ్ల క్రితమే టీచింగ్ వృత్తిని వదిలేసిన ఆమెను.. ఇప్పటికీ కేరళ ప్రజలు గౌరవంగా టీచరమ్మ అని పిలుస్తుంటారు. ఇది అక్కడి ప్రజలు ఆమెపై చూపించే అప్యాయత.

కేరళలోని సముద్రతీర కన్నూర్ జిల్లాలో ఆమె పుట్టిపెరిగారు. అయితే ఫ్రెండ్లీ పొలిటిషీయన్‌గా పేరు తెచ్చుకున్న ఆమె.. పేరు ఆలస్యంగానే బయటి ప్రపంచానికి తెలిసింది. భారత్‌లో కరోనా నియంత్రణకు విధించిన లాక్‌డౌన్ మూడు నెలల తర్వాత జూన్‌లో ఆమె ఐకరాజ్య సమితి నుంచి ఓ ఆహ్వానం అందింది. కేరళలో కరోనాపై పోరాటంలో ఆమె చేసిన ప్రయత్నాలు వివరించడానిని ప్యానెల్ డిస్కక్షన్‌లో పాల్గొనాల్సిందిగా ఐకరాజ్యసమితి ఆహ్వానించింది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ వార్తపత్రికలు సైతం ఆమెను "రాక్‌స్టార్ హెల్త్ మినిస్టర్" అని, "కరోనా వైరస్ స్లేయర్" అని అభివర్ణించాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు టెలివిజన్ చానళ్లు కూడా కరోనాపై పోరులో ఆమె తీసుకున్న చర్యలను ప్రసారం చేశారు.కరోనాపై ఒక యూకే మ్యాగజైన్ నిర్వహించిన సర్వేలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మంది కరోనాపై టాప్ థింకర్‌గా ఆమెకే ఓటు వేశారు. ఈ పోటీలో న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌ను కూడా ఆమె వెనక్కి నెట్టారు. కరోనా నియంత్రణ అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథోనామ్.. యూఎన్ ఇంటరాజెన్సీ టాస్క్ ఫోర్స్‌ అవార్డును కేరలకు అందజేశారు.

KK Shailaja, global fame For KK Shailaja, Special Story On KK Shailaja, Coronavirus, Kerala, కేరళ, కరోనావైరస్, కేకే శైలజ ప్రత్యేక కథనం, కేకే శైలజ
కేరళ సీఎం పినరాయి విజయన్, కేకే శైలజ


కేరళలోని సాధారణ ప్రజలతో కలిసి జీవనం సాగించడం శైలజకు అలవాటు. సామాన్య ప్రజలలో సైతం శాస్త్రీయ ఆలోచనలు ప్రొత్సహించాలనేది ఆమె సిద్ధాంతం. అయితే ఇన్నేళ్లకు ఆమె చేస్తున్న కృషి గురించి ఇప్పుడిప్పుడే బయటివారికి తెలుస్తుంది. 2018లో కేరళలో నిపా వైరస్ ఎదుర్కొవడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో మలయాళ సినీ నిర్మాత రిమా కల్లింగల్.. నిపా నివారణలో శైలజ పోషించిన రోల్‌పై సినిమా తీసేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే 2019లో వైరస్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో శైలజ పాత్రలో ప్రముఖ నటి రేవతి నటించారు. అయితే ఈ సినిమా దర్శకుడికి ఆమె ఒకటే అభ్యర్థన చేశారు. ఆ చిత్రం సైంటిఫిక్‌గా ఉండాలని.. భవిష్యత్తుల్లో విద్యార్థులు విజ్ఞానం పొందేలా ఉండాలని కోరారు. అయితే ఆ సినిమాలో రేవతిని చూపించిన విధంగా తాను విచారంగా, నిశ్శబ్దంగా ఉండనని ఆ సినిమా విడుదల తర్వాత శైలజ నవ్వుకుంటూ చెప్పారు.

కేరళలోని కన్నూర్‌లో అధిపత్య రాజకీయ శక్తిగా ఉన్న సీపీఎం నుంచి ఆమె తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఒకరకంగా ఆమె రాజకీయ జీవితానికి ఆమె అమ్మమ్మ కల్యాణి పునాది వేశారు. "నా అమ్మమ్మ తండ్రి బ్రిటిష్ టీ ఎస్టేట్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేశారు. బ్రిటీష్ వాళ్లు అతన్ని రామన్ మాస్త్రీ అని పిలిచారు (‘మాస్త్రీ’ అంటే పర్యవేక్షకుడు అని అర్థం). ఆ కుటుంబం జిల్లాలో అత్యంత సంపన్నులలో ఒకటిగా ఉండేది. అప్పట్లో మిగతా అందరూ గుడిసెల్లో నివసించగా.. వారు బంగ్లా అని పిలువబడే రెండు అంతస్థుల ఇంట్లో నివసించారు. అయితే ఇప్పుడు ఆ ప్రాంతంలో అదే చిన్న ఇల్లు అయింది" అని శైలజ గుర్తుచేసుకున్నారు. ఈ సంపన్న జీవితం శైలజ అమ్మమ్మ కల్యాణి తరంలో మాత్రం కొనసాగలేదు. ఇద్దరు కుమార్తెలు పుట్టాక కల్యాణి భర్త చనిపోయాడు. ఆ తర్వాత కల్యాణి స్వాతంత్ర్య పోరాటం, కమ్యూనిజం వైపు ఆకర్షితులయ్యారు. ఆమె నిర్ణయానికి ఐదుగురు సోదరులు కూడా మద్దుతుగా నిలిచారు. ఆ కాలంలో ఉన్న ఏకైక మహిళ కార్యకర్త అయినా కల్యాణి.. భూస్వాముల, కార్మికుల నుంచి గౌరవం పొందగలిగారు. అనధికారిక గ్రామ నాయకురాలిగా మారారు. సమాజంలోని అట్టడుగు వర్గాల హక్కుల కోసం పోరాడారు. వారికి సాయంగా నిలిచి.. స్వాతంత్ర్య ఉద్యమం వైపు వారికి అవగాహన కల్పించారు.
KK Shailaja, global fame For KK Shailaja, Special Story On KK Shailaja, Coronavirus, Kerala, కేరళ, కరోనావైరస్, కేకే శైలజ ప్రత్యేక కథనం, కేకే శైలజ

ఆ సమయంలో పెద్ద పెద్ద సమావేశాల్లో మహిళలకు కూర్చొవడానికి అవకాశం లేకపోయేది.. కానీ మా అమ్మమ్మకు మాత్రం కుర్చీలో కూర్చొనే గౌరవం దక్కిందని శైలజా చెప్పారు. "1957 లో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చిన తరువాత.. వివక్షత లేని సమాజ నిర్మాణం కోసం క‌ృషి చేశారు. భూ యాజమాన్యం, ఆరోగ్య సంరక్షణ, విద్యలో సంస్కరణల ద్వారా ప్రతి వ్యక్తికి ఉచిత విద్య, వైద్యం, గృహనిర్మాణం, ఆహారం లభించేలా చూశారు. ఇవన్నీ కేరళ సమాజంలో గొప్ప పరివర్తనకు దారితీశాయి" అని శైలజ వివరించారు.ఇక, శైలజ తన చిన్నతనంలో అమ్మమ్మతో కలిసి సమాజంలోని మంచి, చెడులను గమనించడం ప్రారంభించింది. 1974 సీపీఎంకు అనుబంధ సంస్థ అయిన ఎస్‌ఎఫ్‌ఐలో చేరారు. ఆ సమయంలో ఆమె మత్తునూరులోని పజస్సీ రాజా ఎన్. ఎస్. ఎస్ కాలేజ్‌లో కెమిస్ట్రీ, ఫిజిక్స్ చదువుతున్నారు. ఇందుకోసం ఆమె ఇంటి నుంచి 20 కి.మీ రాకపోకలు సాగించేవారు.ఇక, 1981లో శైలజ జీవితంలో రెండు పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి. ఆమె తన బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించారు. అంతేకాక, తోటి సీపీఎం నాయకుడు, ఉపాధ్యాయుడైన కే బాస్కరన్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ ఇంజనీర్ అయిన 34 ఏళ్ల శోభిత్.. అబుదాబిలోని కోవిడ్-19 హెల్త్‌కేర్ ఫేసిలిటీ ఆపరేషన్స్ హెడ్‌గా ఉన్నారు. ఇక మరో కుమారుడు.. లసిత్(32) ఎంటెక్ పూర్తి చేసి కన్నూర్‌లోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. 1990లో సీపీఎంలో చేరిన శైలజ.. ఒక ఏడాదిపాటు అక్షరాస్యత ప్రచారంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. కొద్ది మంది మహిళా నాయకురాల్లో ఒకరిగా ఉన్న ఆమె.. మంచి వాఖ్యతగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1996లో కూతుపరంబా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది కేరళ అసెంబ్లీలో అడుగుపెట్టారు. అలా సీపీఎంలో ఆమె పలు బాధ్యతల చేపట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఇద్దరు మహిళ మంత్రుల్లో ఆమె ఒకరిగా ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆమె ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఆస్పత్రులు ఉన్నత సౌకర్యాలు, సాంకేతితను కలిగి ఉన్నాయి.
KK Shailaja, global fame For KK Shailaja, Special Story On KK Shailaja, Coronavirus, Kerala, కేరళ, కరోనావైరస్, కేకే శైలజ ప్రత్యేక కథనం, కేకే శైలజ

అయితే కేరళలో కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయని ఆమె అంటున్నారు. శాస్త్రీయ విధానాలను పాటించే ఇక్కడు ప్రజలు కొంతమంది అతీతశక్తులు లాంటి తప్పుడు నమ్మకాలపై ఆకర్షితలవుతున్నారని అంటున్నారు. చాలా మంది వ్యక్తిగత జీవితాలు కోరుకుంటూ క్లోజ్ కమ్యూనిటీ జీవించాలని అనుకుంటున్నారని.. ఇది ఐకమత్యాన్ని విచ్ఛిన్నం చేస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిపా వైరస్ వ్యాప్తిని విజయవంతంగా అధిగమించిన శైలజ, ఆమె బృందం వుహాన్‌లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నప్పుడే.. ఇక్కడ దానిని ఎదుర్కొవడానికి అవసరమైన చర్యల గురించి ఆలోచన చేపట్టారు.

"విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి 6 లక్షల మంది కేరళకు తిరిగివస్తారని నాకు తెలసు. ఈ క్రమంలోనే అన్ని రకాలుగా కరోనా వ్యాప్తిని ఆరికట్టడం మా కర్తవ్యం. అందుకే విమానాశ్రయాల్లో కఠిన నిబంధనలు అమలు చేసాం. ప్రయాణికుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. మేము తీసుకున్న ఈ కఠిన చర్యల వల్ల కేరళలో కోవిడ్ డెత్ రేటు 0.35గా నమోదైంది. ఇది ఇండియాలో కరోనా డెత్ రేట్ 1.6తో పోలిస్తే తక్కువ. అయితే కేసులు పెరిగిన కూడా వ్యాప్తిని నియంత్రించడానికి మేము సిద్దంగానే ఉన్నాం. ఆగస్టు నెలలో కోజికోడ్ విమానశ్రయంలో జరిగిన ప్రమాదం.. సమీప జిల్లాల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై ప్రభావం చూపాయి"అని చెప్పారు.

ఇక, సెప్టెంబర్ ఆరంభంలో దక్షిణ కేరళలో కరోనా సోకిన యువతిని అంబులెన్స్ తరలిస్తున్న డ్రైవర్‌ ఆమెను రేప్ చేశాడని చెప్పారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు నిద్రలేని రాత్రులు గడిపానని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరకుండా చర్యలు తీసుకుంటున్న సమయంలో.. రాష్ట్ర ప్రతిపక్షాలు తమపై మాటల దాడికి దిగారు. కాంగ్రెస్ నాయకుడు కోవిడ్ రాణి అని పిలిచాడని.. ఇది వారి దుష్ట ఆలోచనలకు ప్రతి రూపంగా ఉందని అభిప్రాయపడ్డారు.

మహిళలకు హక్కలు కల్పించడమనేది సమాజానికి చాలా ముఖ్యమైనది. మహిళలు చదువుకుని, ఉద్యోగం సంపాదించాలి, కుటుంబాన్ని పోషించేవారిగా మారాలని ఆకాంక్షించారు. అయితే చాలా మంది మహిళలు పైళ్లైనా తర్వాత ఇంటికి పరిమితమవుతున్నారని.. వారి చదువు అంతా వృథా అయిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పద్ధతి మారాలి. అలాగే సమాజంలో మహిళలను చూసే విధానంలో మార్పు రావాలి. ఇక, తను మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె ధైర్యంగా ఉండండి.. అలానే ముందుకు సాగండి అనే నినాదాన్ని ఇచ్చారు.
Published by: Sumanth Kanukula
First published: October 11, 2020, 11:13 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading