Home /News /national /

HUMAN RIGHTS INTERPRETATION WITH EYE ON POLITICS HARMFUL SAYS PM NARENDRA MODI AK GH

Narendra Modi: రాజకీయాల కోసం మానవ హక్కుల అర్థం మార్చొద్దు: ప్రధాని మోదీ 

నరేంద్ర మోదీ (File Image)

నరేంద్ర మోదీ (File Image)

Narendra Modi: కొందరు తమ సొంత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మానవ హక్కులకు సెలెక్టివ్ నిర్వచనాలు ఇస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. మానవ హక్కుల ఉల్లంఘనలను కొన్ని ఘటనల్లో మాత్రమే చూసే కొందరు వ్యక్తులు ఇతర ఘటనల్లో మాత్రం హక్కుల ఉల్లంఘన చూడడం లేదన్నారు.

ఇంకా చదవండి ...
జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) వ్యవస్థాపక వేడుకల్లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. మంగళవారం ఎన్‌హెచ్‌ఆర్‌సీ 28వ వ్యవస్థాపక దినోత్సవంలో పొల్గొన్న ప్రధాని.. కొందరి ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేశారు. మానవ హక్కుల పేరుతో కొందరు వ్యక్తులు భారతదేశ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా వ్యవహరిస్తున్నారని మోదీ వ్యాఖ్యానించారు. రాజకీయ లాభనష్టాలను దృష్టిలో ఉంచుకుని మానవ హక్కులను చూస్తే.. హక్కులతో పాటు ప్రజాస్వామ్యానికి హాని కలుగుతుందన్నారు.

కొందరు తమ సొంత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మానవ హక్కులకు సెలెక్టివ్ నిర్వచనాలు ఇస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. మానవ హక్కుల ఉల్లంఘనలను కొన్ని ఘటనల్లో మాత్రమే చూసే కొందరు వ్యక్తులు ఇతర ఘటనల్లో మాత్రం హక్కుల ఉల్లంఘన చూడడం లేదన్నారు. ఇలా పొలిటికల్ దృష్టితో చూస్తే హ్యూమన్ రైట్స్ ఉల్లంఘన జరుగుతుందని.. అలాగే ఇది ప్రజాస్వామ్యానికి హాని కలిగిస్తుందని మోదీ పేర్కొన్నారు.

ఒకే రకమైన సంఘటనల్లో సెలెక్టివ్ ఇంటర్‌ప్రిటేషన్ ఇవ్వడం సరికాదని మోదీ తెలిపారు. ప్రజలు ఈ కొందరి పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. అయితే ఇలా ప్రవర్తించేవారు ఎవరో మాత్రం మోదీ బయట పెట్టలేదు. తన ప్రసంగంలో ఏ వ్యక్తి, సంస్థ పేరును ప్రస్తావించకపోయినప్పటికీ... బీజేపీ సర్కార్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులతో సహా మానవ హక్కుల సమూహాలలోని ఒక సెక్షన్ పై విమర్శలు చేస్తూ వస్తోంది. కొందరు బీజేపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి మానవ హక్కుల ఉల్లంఘనల కేసులను ప్రత్యేకంగా ఎంచుకొని వాటిని ఏకపక్షంగా హైలైట్ చేసినందుకు బీజేపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మోదీ నుంచి విమర్శలు వచ్చాయి.

విమర్శలతో పాటు మానవ హక్కుల సంరక్షణ కోసం బీజేపీ ప్రభుత్వం ఎంతగా కృషి చేస్తోందో మోదీ తన ప్రసంగంలో వివరించారు. పేదలకు మరుగుదొడ్లు, వంటగ్యాస్, విద్యుత్, గృహాలు వంటి ప్రాథమిక అవసరాలను తీర్చడానికి బీజేపీ ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యల గురించి మోదీ మాట్లాడారు. తమ చర్యలు పేదల్లో కూడా కలలు కనడానికి దోహదం చేస్తాయని.. అలాగే వారి హక్కుల గురించి మరింత అవగాహన కల్పిస్తాయని చెప్పారు. ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా చట్టం తీసుకురావడం ద్వారా తమ ప్రభుత్వం ముస్లిం మహిళలకు కొత్త హక్కులను కల్పించిందని గుర్తు చేశారు. 26 వారాల ప్రసూతి సెలవు, అత్యాచారాలపై మరింత కఠినమైన చట్టం వంటి చర్యల గురించి కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు.

Drinking More Water: నీళ్లు మరీ ఎక్కువగా తాగుతున్నారా ?.. ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం..

Revanth Reddy: హుజురాబాద్‌లో రేవంత్ రెడ్డి ఎదుర్కోబోయే అసలు సిసలు పరీక్ష ఇదే..!

మానవ హక్కుల ప్రచారం & రక్షణ కోసం అక్టోబర్ 12, 1993న మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1993 (Protection of Human Rights Act) కింద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (NHRC) ఏర్పాటు చేశారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీ మానవ హక్కుల ఉల్లంఘనలను గుర్తించి.. ఎంక్వైరీలు చేపడుతుంది. ప్రజా అధికారులు బాధితులకు పరిహారం చెల్లించాలని సిఫార్సు చేస్తుంది. అలాగే తప్పు చేసిన ప్రభుత్వ సేవకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. స్వాతంత్ర్య పోరాటం, భారతదేశ చరిత్ర అనేవి మానవ హక్కులకు స్ఫూర్తి, విలువలు గుర్తుచేసే మూలాలని మోదీ అభివర్ణించారు.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: PM Narendra Modi

తదుపరి వార్తలు