క్షణాల్లోనే నీటి గుంతలోకి జారుకున్న కారు.. అసలేం జరిగిందంటే..? Video

(Image-Twitter/Shivangi Thakur)

బయట పార్క్ చేసిన కారు ఒకటి నీటి గుంతలో పడి మునిగిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 • Share this:
  బయట పార్క్ చేసిన కారు ఒకటి నీటి గుంతలో పడి మునిగిపోయింది. అంతా చూస్తుండగానే ఇలా జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకుంది. వివరాలు.. ముంబైలో వర్షాలు తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నాయి. గత రెండు రోజులుగా ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజులు పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలుకు ముంబైలోని పలు ప్రాంతాలు జలదిగ్భంధంలో ఉన్నాయి. అయితే వర్షం కారణంగా ఘాట్కోపర్ ప్రాంతంలో ఏర్పడిన గుంతలోకి ఓ కారు పడిపోయింది. కొన్ని సెకన్లలోనే కారు గుంతలో పడి కనిపించకుండా అదృశ్యమైపోయింది.

  ఇక, ఈ ఘటన ఘాట్కోపర్ ప్రైవేట్ సొసైటీ ప్రాంగణంలో చోటుచేసుకుందని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని బీఎంసీ స్పష్టం చేసింది. ఆ ప్రాంతంలో భద్రత చర్యలు చేపట్టినట్టు బీఎంసీ తెలిపింది. మరోవైపు ఈ ఘటనతో ఘాట్కోపర్ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు.

  ‘ఈ హౌసింగ్‌ సొసైటీ వద్ద ఉన్న బావిని కాంక్రీట్‌తో పూడ్చారు. ఆ స్థలాన్ని స్థానికులు కార్ల పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ముంబయిలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆ కాంక్రీటు భాగం కుంగింది. అక్కడ పార్క్‌చేసిన కారు కొద్ది క్షణాల్లోనే నీటి గుంతలో జారుకుంది. స్థానిక పోలీసులు, ట్రాఫిక్‌ పోలీసులు అక్కడికి చేరుకుని కారును బయటికి తీశారు. ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారి భద్రత కోసం చర్యలు చేపట్టాం’అని అధికారులు తెలిపారు.
  Published by:Sumanth Kanukula
  First published: