ఇదంతా ట్రాఫిక్ జామ్.. అది కూడా ఇండియాలోనే...

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి.

news18-telugu
Updated: December 19, 2019, 3:31 PM IST
ఇదంతా ట్రాఫిక్ జామ్.. అది కూడా ఇండియాలోనే...
గురుగ్రామ్‌లో ట్రాఫిక్ జామ్
  • Share this:
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో రోడ్ల మీద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. న్యూఢిల్లీ - గురుగ్రామ్ రహదారిపై వేలాదిగా వాహనాలు నిలిచిపోయాయి. టోల్ గేట్ల వద్ద కొన్ని వేల వాహనాలు నిలిచిపోయాయి. ఆందోళనకారుల నిరసనల నేపథ్యంలో పోలీసులు పలు మార్గాల్లో వాహనాలను దారి మళ్లించారు. దీంతో చాలా రోడ్లలో ట్రాఫిక్ జామ్ భారీగా ఉంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు పెరుగుతుండడంతో ఢిల్లీలోని ఎర్రకోట, సెంట్రల్ ఢిల్లీలో 144 సెక్షన్‌ను అమలులోకి తెచ్చారు. ర్యాలీలో పాల్గొనడానికి వచ్చిన నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ర్యాలీలో పాల్గొనేందుకు హస్తినకు భారీ ఎత్తున వస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి కారును పోలీసులు తనిఖీ చేస్తున్నారు.

గురుగ్రామ్‌లో ట్రాఫిక్ జామ్


First published: December 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు