Home /News /national /

HUGE FIRE AT GUJARATS JAMNAGAR HOTEL UNDER CONTROL 27 RESCUED PAH

Huge Fire: హోటల్ లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసి పడుతున్న మంటలు..

వ్యాపిస్తున్న అగ్నికిలలు

వ్యాపిస్తున్న అగ్నికిలలు

Gujarat: స్థానికంగా ఉన్న హోటల్ లో ఒక్కసారిగా అగ్నికీలలు వ్యాపించాయి. చూస్తుండగానే ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. ఆ ప్రాంతమంతా.. నల్లటి పొగలు అలుముకున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Gujarat, India
గుజరాత్ లో (Gujarat) భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జామ్ నగర్ లో ఉన్న హోటల్ లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వెంటనే అగ్నికీలలు ఇతరప్రాంతాలకు వ్యాపించాయి. అక్కడ అంతా నల్లటి పొగలు అలుముకున్నాయి. హోటల్ లో ఉన్న సిబ్బంది అంతా.. బైటకు పరుగులు తీశారు. వెంటనే స్థానికులు, సిబ్బంది ఫైర్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే చేరుకున్ని మంటలను అదుపులోనికి తీసుకొని వచ్చారు.

ప్రమాదం జరిగినప్పుడు హోటల్ లో సిబ్బందితో సహా 27 మంది ఉన్నారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఎవరికి ఏమికాకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. మోతీ ఖవ్డీ సమీపంలోని హోటల్‌లో చెలరేగిన మంటలు (Fire accident)  అదుపులోకి వచ్చాయి. హోటల్‌లో 27 మంది, హోటల్ సిబ్బంది ఉన్నారు. అందరూ క్షేమంగా ఉన్నారని జామ్‌నగర్ కలెక్టర్ సౌరభ్ పర్ఘి తెలిపారు. ఇద్దరు,ముగ్గురికి మాత్రం.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని, వారిని ఆసుపత్రిలో చేర్చామని జిల్లా ఉన్నతాధికారి తెలిపారు.





ఇదిలా ఉండగా  గతంలో హైదరాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం (Hyderabad Fire Accident) జరిగింది.

సికింద్రాబాద్‌లోని బోయిగూడ ప్రాంతంలో ఉన్న ఓ స్క్రాప్ గౌడౌన్‌ (Bhoiguda Scrap godown fire accident) లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదంలో 10 మంది కార్మికులు సజీవదహనమయ్యారు. రాత్రి 2.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో ఇంకా మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. వాటిని అదుపుచేసేందుకు 8 అగ్నిమాపక యంత్రాలతో ఫైర్ ఫైటర్స్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు 10 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆ మృతదేహాలను గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఇద్దరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాద సమయంలో స్క్రాప్ గోడౌన్‌లో 12 మంది పనిచేస్తున్నట్లు తెలిసింది. ఆ గోడౌన్ రెండతస్తుల్లో ఉంది. పై అంతస్తులో కార్మికులు అర్ధరాత్రి వరకు పనిచేసిన తర్వాత.. అక్కడే నిద్రపోయారు. వారు గాఢ నిద్రలో ఉన్న సమయంలో కింది అంతస్తులో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కింది అంతస్తు నుంచి పై వరకు మంటలు ఎగిసిపడ్డాయి. కిందకు వెళ్లేందుకు.. అక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు.. ఒకే మార్గం ఉండడం.. అక్కడ పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో.. కార్మికులు ఎటూ వెళ్లలేకపోయారు. పై అంతస్తులోనే ఉండిపోయి.. అగ్నికి ఆహుతయ్యారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉండడంతో గుర్తుపట్టడం కూడా కష్టంగా మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Fire Accident, Gujarat

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు