హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Karnataka Blast: కర్ణాటకలో భారీ పేలుడు.. 8 మంది మృతి.. 50 కిలోమీటర్ల వరకు భూ ప్రకంపనలు

Karnataka Blast: కర్ణాటకలో భారీ పేలుడు.. 8 మంది మృతి.. 50 కిలోమీటర్ల వరకు భూ ప్రకంపనలు

కర్ణాటకలోని శివమొగ్గలో ఓ భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 10 మంది వరకు చనిపోయారు. మరింత మంది గాయపడ్డారు. ఆ పేలుడు స్థాయి ఏ రేంజ్‌లో ఉందంటే, ఏకంగా 50కిలోమీటర్ల వరకు భూ ప్రకంపనలు వచ్చాయని చెబుతున్నారు.

  కర్ణాటకలోని శివమొగ్గలో ఓ భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 8 మంది వరకు చనిపోయారు. మరింత మంది గాయపడ్డారు. ఆ పేలుడు స్థాయి ఏ రేంజ్‌లో ఉందంటే, ఏకంగా 50కిలోమీటర్ల వరకు భూ ప్రకంపనలు వచ్చాయని చెబుతున్నారు. రాత్రి పూట భూకంపం వచ్చినట్టు శబ్దాలు రావడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. శివమొగ్గ, చిక్‌మగళూరు సహా పలు ప్రాంతాల్లో రాత్రి పూట భూ ప్రకంపనలు వచ్చాయంటూ ప్రజలు రాత్రిపూట ఇళ్లలో నుంచి బయటకు వచ్చేశారు. అందరూ రాత్రి నుంచి ఇళ్ల బయట, రోడ్ల మీద జాగారం చేస్తున్నారు. పెద్దలు, పిల్లలు, వృద్ధులు రాత్రి పూట కంటిమీద కునుకు లేకుండా బతుకుతున్నారు. శివమొగ్గ నుంచి చిక్‌మగళూరు వరకు రాత్రంతా జాగారం చేస్తున్నారు జనం. దేవనగరి జిల్లాలో కూడా భూ ప్రకంపనలు వచ్చాయని చెబుతున్నారు.

  శివమొగ్గ పట్టణానికి శివారులో ఉన్న అబ్బళగెరె గ్రామంలో క్వారీ మైనింగ్ కోసం బ్లాస్టింగ్ చేస్తుండగా ఈ పేలుడు సంభవించింది. క్వారీలో బ్లాస్టింగ్ కోసం జిలెటిన్ స్టిక్స్ వినియోగిస్తూ ఉంటారు. ఆ జిలెటిన్ స్టిక్స్ తరలిస్తుండగా ట్రక్కులో పేలుడు జరిగింది. శివమొగ్గ రూరల్ ఎమ్మెల్యే అశోక్ నాయక్ చెప్పిన వివరాల ప్రకారం క్వారీలో బ్లాస్టింగ్ కోసం వినియోగించే జిలెటిన్ స్టిక్స్ తరలిస్తుండగా ట్రక్కులో పేలుడు జరిగింది. ‘పేలుడుకు పూర్తి కారణం తెలియలేదు. సీనియర్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దీనిపై సమగ్ర సమాచారం తెలియాలంటే మరికొంత సమయం ఆగాలి.’ అని అశోక్ నాయక్ అన్నారు.

  శివమొగ్గ పేలుడులో ప్రాణనష్టంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. మృతుల కుటుంబాలకు మోదీ సంతాపం  ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు ఆయన ట్వీట్ చేశారు. ఈ ఘటనలో బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం సాయం అందిస్తుందని చెప్పారు.

  ‘శివమొగ్గలో రాత్రి 10.30 గంటల సమయంలో పేలుడు జరిగింది. ఆ ప్రకంపనల ప్రభావం శివమొగ్గలోనే కాదు. చిక్‌మగళూరు, దేవనగెరె జిల్లాల్లో కూడా కనిపించింది.’ అని పీటీఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. ఆ పేలుడు ఎంత బలంగా ఉందంటే.. మా ఇంటి అద్దాలు ధ్వంసం అయ్యాయి. రోడ్లకు కూడా బీటలు వచ్చాయని ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పారు. అయితే, ఆ పేలుడు శబ్దం రావడం, భూ ప్రకంపనలు రావడం, భూమి కూడా బీటలు వారడంతో ప్రజలు అందరూ భూ కంపం వచ్చిందని భయపడ్డారు. ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. రాత్రి నిద్రపోయే సమయం కావడంతో అందరూ ఉలిక్కిపడి లేశారు. కట్టు బట్టలతో పిల్లలు, పెద్దలు అందరూ బయటకు పరుగులు తీశారు. రాత్రంతా రోడ్ల మీదే పడిగాపులు కాశారు. మళ్లీ ఇళ్లలోకి వెళితే ఎక్కడ భూకంపం వస్తుందేమోననే భయంతో వారంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు.

  First published:

  Tags: BLAST, Karnataka

  ఉత్తమ కథలు