హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

6 నెలల చిన్నారికి పూజలు.. అమ్మవారి ప్రతిరూపమట.. తండోపతండాలుగా వచ్చి జాతర చేస్తున్న జనం

6 నెలల చిన్నారికి పూజలు.. అమ్మవారి ప్రతిరూపమట.. తండోపతండాలుగా వచ్చి జాతర చేస్తున్న జనం

చిన్నారిని చూసేందుకు తరలి వచ్చిన జనం

చిన్నారిని చూసేందుకు తరలి వచ్చిన జనం

Viral News: నుదుటిపై పసుపు, కుంకుమ కనిపించడం చిన్న విషయ కాదని.. ఆమె సాక్ష్యాత్తు అమ్మవారని కొందరు పెద్దలు చెప్పారు. అంతే అప్పటి నుంచి.. స్థానిక ప్రజలు ఆ చిన్నారికి పూజలు చేస్తున్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  చంద్రుడిపై రాకెట్లు పంపుతున్నాం. అంతరిక్షంలో అంగారక యాత్రలు చేస్తున్నాం. సాంకేతిక పరిజ్ఞానం ఎంతో పెరిగిన ఈ కంప్యూటర్ యుగంలోనూ అక్కడక్కడా ఇంకా మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. ప్రజలు అంధ విశ్వాసాల్లో మునిగితేలున్నారు. ఆవు ఐదు కాళ్లతో జన్మించినా.. గుళ్లోకి పాము వచ్చినా.. వేప చెట్టుకు పాలు కారినా.. ఇది దైవ మహత్యమని.. పూజలు చేస్తుంటారు. ఇలాంటి  ఘటనలు టీవీలు, పేపర్లలో చాలా సార్లే చూశాం. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి మహారాష్ట్రలో వెలుగుచూసింది. ఓ పసిపాపకు కుంకుమ పూసినట్లుగా నుదురు ఎర్రగా మారడంతో.. ఆమె సాక్షాత్తు అమ్మవారేనని.. అక్కడి ప్రజలు పూజలు చేస్తున్నారు. పాపను చూసేందుకు తండోపతండాలుగా తరలి వస్తున్నారు.

  మహారాష్ట్రలోని హింగోలి జిల్లా సెంగావ్ తాలూకాలోని కపాడ్సింగి తండా గ్రామంలో మూఢనమ్మకాలు హద్దులు దాటాయి. అమ్మవారి ప్రతిరూపమంటూ ఆరు నెలల బాలికకు స్థానికులు పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారు. గ్రామానికి చెందిన సుభాష్ దంపతులకు ఆరు నెలల క్రితం అమ్మాయి పుట్టింది. ఐతే పుట్టుకతోనే పాప నుదుటిపై ఎరుపు, పసుపు రంగు మచ్చలు ఉండేవి. అవి వయసుతో పాటు పెరిగి.. కుంకుమ రంగులోకి మారిపోయాయి. ప్రస్తుతం చిన్నారి నుదురు మొత్తం కుంకుమ రంగు వ్యాపించింది. నుదుటిపై కుంకుమ రాసుకున్నట్లుగానే కనిపిస్తుంది. కానీ అది పుట్టుక నుంచే వచ్చింది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి.. చుట్టుపక్కల అందరికీ తెలిసింది. నుదుటిపై పసుపు, కుంకుమ కనిపించడం చిన్న విషయ కాదని.. ఆమె సాక్ష్యాత్తు అమ్మవారని కొందరు పెద్దలు చెప్పారు. అంతే అప్పటి నుంచి.. స్థానిక ప్రజలు ఆ చిన్నారికి పూజలు చేస్తున్నారు.

  OMG: వీల్ చైర్ లో తీసుకెళ్లి కన్న తల్లికి అంతిమ సంస్కారాలు.. ఎక్కడంటే..

  ఈ అమ్మాయికి ప్రతి మంగళ, శుక్రవారాల్లో నుదుటిపై ఎరుపు, పసుపు రంగు మచ్చలు వస్తున్నాయని పుకార్లు వ్యాపించాయి. అదే సమయంలో ఈ చిన్నారి ఇంట్లో అమ్మవారి రాతి విగ్రహం కూడా దొరికిందన్న ప్రచారం ఆ ప్రాంతంలో వేగంగా వ్యాపించింది. ఈ మూఢనమ్మకం కారణంగా ప్రతి మంగళ, శుక్రవారాల్లో చిన్నారిని కలిసేందుకు స్థానికులతో పాటు సుదూర ప్రాంతాల ప్రజలు కూడా భారీగా తరలివస్తున్నారు. ఆమె ఇంటి వద్ద కొబ్బరి కాయలు కొట్టి ప్రార్థనలు చేస్తున్నారు. ముఖ్యంగా మంగళ, శుక్రవారాల్లో ఆ ప్రాంతమంతా జాతరను తలపిస్తుంది. ఐనప్పటికీ అధికారులు మాత్రం ఈ అంశంపై దృష్టి సారించడం లేదు.

  అసలు ఆ పాప నుదుటిపై ఎరుపు రంగు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. విటమిన్ లోపం వల్ల కూడా ఇలాంటి ఎర్రటి మచ్చలు వస్తాయని కొందరు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చిన్నారికి హెల్త్ చెకప్ చేసి.. దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. మూఢనమ్మకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Maharashtra, Trending, VIRAL NEWS

  ఉత్తమ కథలు