ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యతిరేక నినాదాలతో ఢిల్లీ మారుమోగుతోంది. కేజ్రీవాల్‌కు లిక్కర్ స్కామ్ సెగ గట్టిగానే తగిలినట్లు కనిపిస్తోంది. ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్ షీట్‌లో కేజ్రీవాల్ పేరు ఉండడం సంచలనం సృష్టించింది. దీంతో కేజ్రీవాల్‌ను కార్నర్ చేయడానికి బీజేపీకి మంచి అస్త్రం దొరికినిట్లైంది. కేజ్రీవాల్ టార్గెట్‌గా బీజేపీ కార్యకర్తలు నిరసన బాట పడుతున్నారు. తాజాగా ఢిల్లీలో ఆప్ ఆఫీస్ ముందు బీజేపీ నిరసనకు దిగడం ఉద్రిక్తతలకు దారి తీసింది.
#WATCH | Delhi: BJP workers protest outside AAP office against CM Arvind Kejriwal over alleged liquor scam. pic.twitter.com/Hm5tkekPon
— ANI (@ANI) February 4, 2023
కేజ్రీవాల్ రాజీనామా చేయాలి:
సీఎంగా కేజ్రీవాల్ రాజీనామా చేయాలంటూ బీజేపీ ఆందోళన బాట పట్టింది. దేశ రాజధానిలో పెద్ద ఎత్తున నిరసనలకు దిగింది. బీజేపీ కార్యకర్తలు సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లిక్కర్ స్కామ్ వ్యవహారంపై ఢిల్లీ బీజేపీ కార్యకర్తలు ఆప్ ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. కేజ్రీవాల్ 'చోర్ చోర్' అంటూ నినాదాలు చేశారు. బీజేపీ కార్యకర్తలను కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కాలేకపోయింది. ఆఫీస్ ముందు ఏర్పాటు చేసిన బారికెడ్లను దూకేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. మరోవైపు ఈ ఆరోపణలను కేజ్రీవాల్ తీవ్రంగా ఖండిస్తున్నారు.ఈ కేసు ఫేక్ అని.. ప్రభుత్వాలను కూలదోయడానికి బీజేపీకి ఈడీ సాయం చేయడమేనని కేజ్రీవాల్ ఆరోపించారు.
లిక్కర్ స్కాం ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ నాయర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో ఫేస్ టైం వీడియోకాల్ ద్వారా సమీర్ మహేంద్రుతో మాట్లాడించినట్లు ఈడీ ఛార్జ్ షీటులో పేర్కొంది. ఈ లావాదేవీల ద్వారా వచ్చిన సొమ్మును ఆమ్ ఆద్మీ పార్టీ గోవాలో ఎన్నికల ప్రచారానికి వాడుకుందని ఆరో పించింది. లిక్కర్ లైసెన్సులు ఇప్పించేందుకుగానూ ఆప్ నాయకుల తరఫున విజయ్ నాయర్ సౌత్ గ్రూప్ నుంచి రూ.100 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నట్లు గుర్తించినట్లు ఈడీ చెబుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Arvind Kejriwal, Delhi liquor Scam