• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • HUGE AMOUNT OF GELATIN STICKS DETONATORS SEIZED AT RAILWAY STATION IN KERALAS KOZHIKODE SK

Kozhikode: రైల్వే స్టేషన్‌లో తీవ్ర కలకలం.. భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

Kozhikode: రైల్వే స్టేషన్‌లో తీవ్ర కలకలం.. భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

ప్రతీకాత్మక చిత్రం

అరెస్టైన మహిళ తమిళనాడుకు చెందిన వారని రైల్వే పోలీసులు తెలిపారు. బావులను తవ్వేందుకు ఈ జిలెటిన్ స్టిక్స్ తీసుకెళ్తున్నట్లు విచారణలో వెల్లడించింది. ఐనప్పటికీ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

  • Share this:
    ముంబైలో పేలుడు పదార్థాల ఘటన మరవక ముందే.. కేరళలోనూ తీవ్ర కలకలం రేగింది. కోజికోడ్ రైల్వే స్టేషన్‌లో భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. చెన్నై-మంగళూరు ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి 117 జిలెటిన్ స్టిక్స్, 350 డిటోనేటర్లను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. వాటిని తరలిస్తున్న మహిళను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రైలులో పేలుడు పదార్థాలను తరలిస్తున్నారన్న పక్కా సమాచారంలో ఆర్పీఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. వెంటనే అప్రమత్తమై కోజికోడ్ స్టేషన్‌లో చెన్నై-మంగళూరు ఎక్స్‌ప్రెస్ రైలులో తనిఖీలు చేసి.. వాటిని స్వాధీనం చేసుకున్నారు.

    అరెస్టైన మహిళ తమిళనాడుకు చెందిన వారని రైల్వే పోలీసులు తెలిపారు. బావులను తవ్వేందుకు ఈ జిలెటిన్ స్టిక్స్ తీసుకెళ్తున్నట్లు విచారణలో వెల్లడించింది. ఐనప్పటికీ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే కేరళలో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ లేదా మేలో ఎన్నికలు జరిగే అవకాశముంది. ఇలాంటి సమయంలో భారీ మొత్తంలో జిలెటిన్ స్టిక్స్ దొరకడం కలకలం రేపింది.

    గురువారం ముంబైలో కూడా భారీగా పేలుడు పదార్థాలు లభించన విషయం తెలిసిందే. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నివాసం ఉండే ముంబైలోని యాంటీలియా భవనం వద్ద స్కార్పియో కారు కలకలం రేపింది. పచ్చ రంగు ఉన్న ఆ కారులో జిలెటిన్ స్టిక్స్ ఉన్నాయి. అంబానీ ఇంటి వద్ద కారు పార్క్ చేసి ఉండడంతో అనుమానంతో సెక్యూరిటీ గార్డులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులతో పాటు బాంబు స్క్వాడ్ కూడా వెంటనే రంగంలోకి దిగి ఆకారును పరిశీలించింది. ఆ కారులో జిలెటిన్ స్టిక్స్ గుర్తించారు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అక్కడకు వచ్చి.. ఆ కారును మరో చోటకు తరలించారు. ముంబైలో హై సెక్యూరిటీ జోన్లలో ఒకటి అయిన ఈ ప్రాంతంలో, దేశంలో ప్రముఖ వ్యాపారవేత్త అయిన ముఖేష్ అంబానీ ఇంటి వద్ద జిలెటిన్ స్టిక్స్‌ దొరకడం సంచలనంగా మారింది. ఆ మరుసటి రోజే కేరళలోనూ జిలెటిన్ స్టిక్స్ దొరకడం చర్చనీయాంశమయింది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు