HRD MINISTRY NAME AND NEW EDUCATION POLICY UNION CABINET TOOK KEY DECISIONS AK
కొత్త విద్యా విధానం.. ఆ శాఖ పేరు మార్పు.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
ప్రధాని నరేంద్రమోదీ(ఫైల్ ఫోటో)
దేశవ్యాప్తంగా చదువును అందరికీ అందుబాటులోకి తెచ్చే విధంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. నాలుగు దశల్లో నూతన జాతీయ విద్యా విధానం ఉండనున్నట్టు తెలుస్తోంది.
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్రం మానవ వనరుల శాఖ పేరును విద్యా మంత్రిత్వశాఖగా మారుస్తూ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు నూతన జాతీయ విద్యా విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా చదువును అందరికీ అందుబాటులోకి తెచ్చే విధంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. నాలుగు దశల్లో నూతన జాతీయ విద్యా విధానం ఉండనున్నట్టు తెలుస్తోంది. 5+3+3+4 విధానంలో విద్యా విధానం అమలులోకి రానున్నట్టు సమాచారం.
Ministry of Human Resource and Development (MHRD) renamed as Ministry of Education. The announcement to be made later today. pic.twitter.com/shM4QrDg6m
3 నుంచి 18 ఏళ్ల వయసున్న వారికి ఉచిత, నిర్భంద విద్యను అందించడమే లక్ష్యంగా కేంద్రం ఈ విధానాన్ని తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. కొత్త విద్యా విధానంలో సిలబస్ వంటి అంశాలు కూడా పూర్తిగా మారిపోనున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. వృత్తి, ఉపాధి లభించే విధంగా విద్యా వ్యవస్థను మార్చనున్నట్టు తెలుస్తోంది. ఈ విధానంలో మొదటి ఐదేళ్లలో ఫౌండేషన్ కోర్సుగా పరిగణిస్తారని సమాచారం. ఆ తరువాత మూడేళ్లను ప్రీ ప్రైమరీ స్కూల్ మరియు గ్రేడ్ 1, గ్రేడ్ 2గా పరిగణించనున్నారు. ప్రతి రాష్ట్రంలోనూ రాష్ట్రస్థాయి స్కూల్ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. దీనిపై కేంద్రం మరికాసేపట్లోనే పూర్తి స్పష్టత ఇవ్వనుంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.