#HowdyModi live: న్యూ ఇండియా సాధనే మా లక్ష్యం....హౌడీ మోదీ సభలో ప్రధాని మోదీ

ఈ రోజు భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటోందని, మునుపటి కన్నా వేగం పుంజుకోవాలని ఆశిస్తుందని మోదీ అన్నారు.

news18-telugu
Updated: September 23, 2019, 12:07 AM IST
#HowdyModi live: న్యూ ఇండియా సాధనే మా లక్ష్యం....హౌడీ మోదీ సభలో ప్రధాని మోదీ
ప్రధాని మోదీ
news18-telugu
Updated: September 23, 2019, 12:07 AM IST
అమెరికా హ్యూస్టన్‌ ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో హౌడీ-మోదీ సభకు ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తనకు అపూర్వ స్వాగతం లభించిందంటూ ఆయన హ్యూస్టన్‌ వాసులకు ధన్యవాదాలు తెలిపారు. ట్రంప్‌ పేరు తెలియని వారు ప్రపంచంలో ఎవరూ లేరంటూ ప్రతి 10 మంది సంభాషణలో ట్రంప్‌ ఉంటారని, వ్యాపారం నుంచి రాజకీయాల వరకు అన్నింట్లో ట్రంప్‌ చిరపరిచితులే అని మోదీ చెప్పారు. మరోసారి ట్రంప్‌ అధికారంలోకి రావాలని మోదీ ఆకాంక్షించారు. అంతేకాదు ఈ రోజు భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటోందని, మునుపటి కన్నా వేగం పుంజుకోవాలని ఆశిస్తుందని మోదీ అన్నారు. అంతేకాదు ఇప్పటికే గడిచిన 5 సంవత్సరాల్లో సుమారు 2 లక్షల కిలోమీటర్ల రోడ్లను గ్రామీణ భారతదేశంలో నిర్మించామని, అలాగే 100 శాతం భారతీయులను బ్యాంకింగ్ సెక్టార్ లో భాగస్వామ్యం చేశామన్నారు. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కన్నా ఈజ్ ఆఫ్ లివింగ్ చాలా ముఖ్యమని మోదీ అన్నారు.

హౌడీ-మోదీ కార్యక్రమానికి వచ్చిన ట్రంప్‌‌కు ప్రధాని మోదీ, ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. సభలో భారత్‌, అమెరికా దేశాల జాతీయ గీతాలు ఆలపించారు.

First published: September 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...