హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Corona school dropouts: కరోనాతో పెరుగుతున్న స్కూల్​ డ్రాపౌట్స్​ను​ ఎలా కట్టడి చేయాలి?.. అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ సీఈవో అనురాగ్ బెహర్​ ఇంటర్వూలో చెప్పిన వివరాలివే..

Corona school dropouts: కరోనాతో పెరుగుతున్న స్కూల్​ డ్రాపౌట్స్​ను​ ఎలా కట్టడి చేయాలి?.. అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ సీఈవో అనురాగ్ బెహర్​ ఇంటర్వూలో చెప్పిన వివరాలివే..

ఒంగోలు మున్సిపల్ హైస్కూల్ లో ప్రధానోపాధ్యాయుడితో సహా నలుగురు ఉపాధ్యాయులు, ఐదుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా బారిన పడుతున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి . విద్యార్థులు స్కూల్స్ కు వెళ్లాలంటేనే భయపడుతున్న పరిస్థితి ఉంది.

ఒంగోలు మున్సిపల్ హైస్కూల్ లో ప్రధానోపాధ్యాయుడితో సహా నలుగురు ఉపాధ్యాయులు, ఐదుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా బారిన పడుతున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి . విద్యార్థులు స్కూల్స్ కు వెళ్లాలంటేనే భయపడుతున్న పరిస్థితి ఉంది.

కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు పాఠశాలలు మూసివేయడంతో స్కూల్ డ్రాపౌట్స్ సంఖ్య బాగా పెరిగిపోయింది.

కరోనా (Corona) వ్యాప్తిని నియంత్రించేందుకు పాఠశాలలు (Schools) మూసివేయడంతో స్కూల్ డ్రాపౌట్స్ (Drop Outs) సంఖ్య బాగా పెరిగిపోయింది. విద్యార్థుల్లో విషయాలు నేర్చుకునే సామర్థ్యం (Learning Levels) కూడా గణనీయంగా క్షీణించింది. ప్రస్తుతం కరోనా కాలంలో ప్రైమరీ స్కూల్స్ రీఓపెన్ చేయాలా వద్దా అనే సందిగ్ధతలో రాష్ట్రాలు ఉన్నాయి. అయితే అర్జంటుగా స్కూల్స్ రీఓపెన్ చేయకపోతే పిల్లలు చదువు మానేయడం అనివార్యంగా మారుతోంది. ఇటీవల అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ 16,000 మంది ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్ పై సర్వే జరిపింది. ఈ సర్వేలో విద్యార్థుల్లో లాంగ్వేజ్, మాథ్స్ స్కిల్స్ ఆందోళనకరమైన స్థాయిలో తగ్గాయని తేలింది. 92 శాతం మంది పిల్లలు కనీసం ఒక భాషా సామర్థ్యాన్ని కోల్పోగా.. 82 శాతం మంది మాథ్స్ స్కిల్స్ కోల్పోయారని తేలింది. ఈ క్రమంలోనే అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ సీఈవో అనురాగ్ బెహర్ CNN న్యూస్18కి ఇంటర్వ్యూ ఇచ్చారు.

ప్రశ్న: పాఠశాలలు మూతపడటంతో చాలా మంది పిల్లలు స్కూళ్లకు వెళ్లడం మానేశారు. వాళ్లని తిరిగి మళ్లీ పాఠశాలలకు వచ్చేలా చేయాలంటే ఏం చేయాలి? డ్రాప్ అవుట్ అవుతున్న వారెవరు?

బెహర్: పాఠశాలలు మానేసే పిల్లలకు ఏం జరుగుతుందనేది మనకెవరికీ తెలియకపోవచ్చని నేను అనుకుంటున్నాను. నిజంగా ఎంత మంది పిల్లలు చదువు మానేయబోతున్నారు? అనే విషయం మనకి ఇప్పుడే తెలియదు. కరోనాతో ప్రజలు ఆర్థికంగా నష్టపోయారు. భారీ సంఖ్యలో పిల్లలు చదువు మానేయడానికి ఇది ఒక కారణం అయి ఉండొచ్చు. అందుకే ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలను గుర్తించి వారి పిల్లలు చదువు మానేయకుండా చర్యలు చేపట్టాలి. ప్రైవేట్ పాఠశాలలో చేరకపోయినా లేదా ఫీజులు చెల్లించకపోయినా వారిని డ్రాప్ అవుట్స్ గా ప్రజలు చెబుతున్నట్లు నేను భావిస్తున్నాను.

ప్రశ్న: కానీ మేము ఈ సంక్షోభంలో డబ్బు సంపాదించేందుకు 14-15 ఏళ్ల పిల్లలను షాపులలో, పొలాల్లో లేదా ఇంట్లో పనులు చేయాలని అడిగిన తల్లిదండ్రులను చూశాం. ఈ పిల్లలంతా కూడా శాశ్వతంగా చదువు మానేసారేమోనని మేము భయపడుతున్నాం. ఈ పిల్లలను తిరిగి పాఠశాలకు పంపించడానికి తల్లిదండ్రులను ఒప్పించడం కూడా ఒక పెద్ద సవాల్ గా కనిపిస్తోంది.

బెహర్: నేను కూడా ఇదే భయం గురించి మాట్లాడుతున్నాను. పాఠశాలలు మళ్లీ ఓపెన్ చేసే సమయానికి.. లక్షల మంది విద్యార్థులు స్కూల్ కు రావడం శాశ్వతంగా మానేస్తారేమోనని అని భయపడుతున్నాను. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఆర్థికంగా నష్టపోయారు. ఇలాంటి పరిస్థితులలో కుటుంబ ఆదాయాన్ని పెంచడానికి లేదా వారి తోబుట్టువుల అలనాపాలనా చూసుకోవడానికి విద్యార్థులు చదువు మానేయాల్సి వస్తోంది. అందుకే ఇలాంటి విద్యార్థుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రశ్న: పాఠశాలలను తిరిగి తెరిచినప్పుడు.. పిల్లలలో నేర్చుకునే స్థాయిలు ఎలా ఉంటాయి?

బెహర్: ఇండియాలో మార్చి 2020 నుంచి పాఠశాలలు మూసివేశారు. ఆన్‌లైన్ క్లాసులు, మొహల్లా క్లాసుల ద్వారా పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. మొహల్లా క్లాసులంటే ఉపాధ్యాయులు గ్రామాలకు వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధించడమే. కానీ ఇది అమలు చేయడం చాలా కష్టం. పాఠశాలకు, మొహల్లా క్లాసులకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇది మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టినప్పటికీ.. విద్యార్థులకు పాఠాల నేర్పించడమనేది అసాధ్యం. స్కూల్ కు వెళ్లే విద్యార్థుల్లో 200 మిలియన్ల మంది ఆన్‌లైన్ క్లాసుకు హాజరు కావడానికి సాధ్యపడటం లేదు. 16-17 నెలల పాటు పాఠశాలలు మూసివేశారు. ఈ సమయంలో ఏదో ఒక సందర్భంలో పిల్లలు తాము నేర్చుకున్నదంతా మర్చిపోయే అవకాశం ఉంది. నాలుగో తరగతి చదివే విద్యార్థి పాఠశాలలో ఓపెన్ చేయగానే ఆరో తరగతిలో చేరతాడు. అప్పుడు ఆ విద్యార్థికి చదువు భారమై పోతుంది. 92% పైగా పిల్లలు భాషలో ప్రాథమిక సామర్థ్యాలను కోల్పోయారని రీసెంట్ స్టడీలో తేలింది. 82 శాతం మంది మాథ్స్ స్కిల్స్ కోల్పోయారని తేలింది. దీన్నిబట్టి పిల్లల లెర్నింగ్ లెవెల్స్ ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

ప్రశ్న: ఎంత త్వరగా పాఠశాలలను రీఓపెన్ చేయాలి? రాష్ట్ర ప్రభుత్వాలు కచ్చితంగా స్కూల్స్ రీఓపెన్ చేయాల్సిందేనా? ఎందుకంటే కొన్ని రాష్ట్రాలు దశలవారీగా పాఠశాలను తెరుస్తామని చెప్పాయి.

బెహర్: పాఠశాలలను వీలైనంత త్వరగా ఓపెన్ చేయాల్సిందేనని నేను భావిస్తున్నాను. కానీ ఒక పక్క ప్లాన్ ప్రకారం పాఠశాలలను ఓపెన్ చేయాలి. ఉపాధ్యాయులు, సిబ్బంది మొత్తం వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతనే స్కూల్స్ ని ఓపెన్ చేయాలి. టీకాల విషయంలో చాలా రాష్ట్రాలు ఉపాధ్యాయులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాయి. పిల్లలకు టీకా వేసే సమయం దాకా వేచి చూడొద్దు. పిల్లల టీకాకు అనుమతి లభించగానే కఠినమైన వ్యాక్సినేషన్ ప్రక్రియ తీసుకురావాలి. పాఠశాలను త్వరగా ఓపెన్ చేసేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రశ్న: కరోనా వైరస్ దృష్ట్యా కొన్ని దేశాలలో రెండు కిలోమీటర్ల పరిధిలోని పాఠశాలకు మాత్రమే వెళ్లాలనే భావన ఉంది. కానీ అది బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో సాధ్యపడుతుందా?

బెహర్: లోకలైజ్డ్ స్కూల్స్ కి స్థానిక పిల్లలందరూ వెళ్లేలా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించవచ్చు. అలాగే పాఠశాల విషయానికొస్తే పిల్లలు అందరూ ఒకటే అనే భావన కల్పించవచ్చు.

Football Players Salaries: క్లబ్ జీతాల్లో 7వ స్థానానికి పడిపోయిన రొనాల్డో.. అతడి కంటే ఎక్కువ సంపాదిస్తున్న జూనియర్లు

Published by:John Kora
First published:

Tags: Corona, Covid-19, Schools reopening, Students

ఉత్తమ కథలు