ఆధార్‌ను ఎలా డీలింక్ చేసుకోవాలి?

మీరు సర్వీస్ ప్రొవైడర్లకు, ఆథరైజ్డ్ ఏజెన్సీలకు ఇచ్చిన బయోమెట్రిక్ వివరాలను డీలింక్ చేసుకోవచ్చని యూఐఓడీఐ కూడా తన అధికారిక వెబ్‌సైట్‌లో స్పష్టం చేసింది.

news18-telugu
Updated: September 27, 2018, 12:06 PM IST
ఆధార్‌ను ఎలా డీలింక్ చేసుకోవాలి?
image: Getty Images
 • Share this:
ఆధార్... ఆధార్... ఆధార్... సుప్రీం తీర్పు ఇవ్వడానికి ముందు నుంచి తీర్పు ఇచ్చిన తర్వాత కూడా అందరూ ఆధార్ జపం చేస్తున్నారు. ఫోన్ నెంబర్లు, బ్యాంక్ అకౌంట్లు, మొబైల్ వ్యాలెట్లకు ఆధార్ అవసరం లేదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పడంతో... ఇప్పటివరకు తాము ఎక్కడెక్కడ ఆధార్ కార్డు ఇచ్చామా అని అంతా చర్చించుకుంటున్నారు. అంతేకాదు... గతంలోనే ఆధార్ లింక్ చేసినట్టైతే డీలింక్ ఎలా చేయాలన్న సందేహాలు చాలామందిలో ఉన్నాయి. అలాంటివారికోసమే ఈ ప్రత్యేక కథనం.

మీరు ఆధార్ కార్డును ఎక్కడ ఇచ్చినా సరే... డీలింక్ చేసుకోవచ్చు. మీరు సర్వీస్ ప్రొవైడర్లకు, ఆథరైజ్డ్ ఏజెన్సీలకు ఇచ్చిన బయోమెట్రిక్ వివరాలను డీలింక్ చేసుకోవచ్చని యూఐఓడీఐ కూడా తన అధికారిక వెబ్‌సైట్‌లో స్పష్టం చేసింది. ఇదేమీ పెద్ద కష్టమైన విషయం కాదు. కాకపోతే ఓ పద్ధతి ప్రకారం చేయాల్సి ఉంటుంది.


 • బ్యాంకులో ఆధార్ డీలింక్ చేయాలంటే ఓ దరఖాస్తు ఇవ్వాల్సి ఉంటుంది.

 • ముందుగా మీ అకౌంట్ ఉన్న బ్రాంచ్‌కు వెళ్లాలి.

 • అంతకుముందు ఇచ్చిన ఆధార్ వివరాలను ఉపసంహరించాలని కోరుతూ దరఖాస్తు ఇవ్వాలి.

 • మరిన్ని వివరాల కోసం బ్యాంకు కస్టమర్ కేర్‌ నెంబర్లకు కాల్ చేయాల్సి ఉంటుంది.
 • బ్యాంకులో దరఖాస్తు చేసిన 48 గంటల్లో ఆధార్ డీలింక్ అవుతుంది.

 • బ్యాంక్ అకౌంట్‌ నుంచి ఆధార్ డీలింక్ అయిందో లేదో కాల్ చేసి తెలుసుకోవచ్చు.

 • టెలికామ్ ఆపరేటర్లకు కూడా ఆధార్ డీలింక్ చేయమని ఇలాగే దరఖాస్తు ఇవ్వాలి.

 • ఓలా, పేటీఎం లాంటి ప్రైవేట్ వ్యాలెట్ సంస్థలకు కూడా కాల్ చేసి డీలింక్ చేయమని అడగొచ్చు.

 • లేదా కస్టమర్ కేర్ ప్రతినిధి చెప్పినట్టుగా ఆధార్ డీలింక్ కోరుతూ ఇ-మెయిల్ పంపాల్సి ఉంటుంది.

 • మీరు పంపిన రిక్వెస్ట్ ఇ-మెయిల్‌కు కంపెనీ నుంచి రిప్లై వస్తుంది.

 • ఇందుకోసం మీ ఆధార్ సాఫ్ట్ కాపీని ఇ-మెయిల్‌లో అటాచ్ చేయాల్సి ఉంటుంది.

 • ఆ తర్వాత 72 గంటల్లో మీ ఆధార్ డీలింక్ చేసినట్టు కంపెనీ కన్ఫర్మేషన్ ఇ-మెయిల్ పంపిస్తుంది.

 • ఆ తర్వాత మీ పేటీఎం అకౌంట్ ఓపెన్ చేసి ఆధార్ డీలింక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి.

 • ఇకపై పేటీఎం, అమెజాన్ పే లాంటి వ్యాలెట్లు ఆధార్ అడిగితే మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు.

 • టెలికామ్ సంస్థలు కూడా మొబైల్ నెంబర్‌కు ఆధార్ లింక్ చేయమని కోరవు.ఇవి కూడా చదవండి:

Video:ఆ ఐదింటికి ఇక ఆధార్ అవసరం లేదు..

అక్టోబర్ 10 నుంచి ఫ్లిప్‌కార్ట్ సేల్!

అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు శుభవార్త!

ఇండియాలో లాంఛైన 'వివో వీ9 ప్రో'!

#జర భద్రం: మొన్న బ్లూవేల్... నిన్న మోమో... ఇప్పుడు 'ఒలీవియా'!

గూగుల్ నుంచి తుఫాను హెచ్చరికలు!

వాట్సప్‌లో ఎలా ఫిర్యాదు చేయాలో తెలుసా?
Published by: Santhosh Kumar S
First published: September 27, 2018, 10:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading