హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

EPFO: PF ఖాతాకు KYC లింక్ చేయడం తప్పనిసరి.. ఎలా లింక్ చేయాలంటే..

EPFO: PF ఖాతాకు KYC లింక్ చేయడం తప్పనిసరి.. ఎలా లింక్ చేయాలంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

EPFO: KYC (నో యువర్ కస్టమర్).. ఇటీవల కాలంలో ఈ మాట ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ఇటీవల డిజిటల్ లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో అందరూ KYC తప్పనిసరిగా చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

KYC (నో యువర్ కస్టమర్).. ఇటీవల కాలంలో ఈ మాట ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ఇటీవల డిజిటల్ లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో అందరూ KYC తప్పనిసరిగా చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ముఖ్యంగా భవిష్యనిధికి(పీఎఫ్) కేవైసీని వెరిఫై చేయాలి. పీఎఫ్ ఖాతాలను పరిగణనలోకి తీసుకోవడానికి కేవైసీ ఫార్మాలిటీని పూర్తి చేయడం ముఖ్యమైన దశ. ఒక్కసారి కేవైసీ వివరాలను ధృవీకరించిన తర్వాత పీఎఫ్ ఖాతా లావాదేవీలు, పాస్ బుక్ సరిచూసుకోవడం లాంటి సేవలు సులభతరమవుతాయి. కేవైసీ వివరాలు పూర్తయిన తర్వాత మాత్రమే ఈపీఎఫ్ఓ పోర్టల్లో బదిలీలు, విత్ డ్రాలు చేసుకోవడం కుదురుతుంది. కాబట్టి కైవైసీ వివరాలను అప్డేట్ చేసుకోవడం మంచిది.

మూడు రకాల క్లెయిమ్ లు చేయాలి..

ప్రస్తుత పరిస్థితుల్లో యజమాని ధృవీకరణ లేకుండా ఉద్యోగి మూడు రకాల క్లెయిమ్ లను సమర్పించవచ్చు. ఫామ్-19, 10సీ, 31 పత్రాలను సమర్పించాలి. సభ్యులు తమ యూఏఎన్ యాక్టివేట్ అయిందని నిర్ధారించుకోవాలి. బ్యాంక్ ఖాతా, అతని ఖాతాకు సంబంధించి యజమాని ఆమోదించడానికి ఆధార్ కేవైసీకి డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ ఉపయోగించాలి.

సేవలను మెరుగుపరిచేందుకు..

UAN EPFO పోర్టల్‌లో KYC అవసరం. వివరాలను నవీకరించడానికి లేదా మార్చడానికి, ఉద్యోగులకు UAN సంఖ్య అవసరం. ఆ నంబరుతో సభ్యుడు EPFO UAN పోర్టల్ కు లాగిన్ అవ్వవచ్చు. అవసరమైన పత్రాలను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయడం ద్వారా కేవైసీని అప్డేట్ చేసుకోవచ్చు. పేరు, పుట్టిన తేదీ, లింగం, దిద్దుబాట్లు లాంటి ఆన్ లైన్ అభ్యర్థనలను EPFO కుడా ప్రవేశపెట్టింది. కేవైసీ అనేది ఉద్యోగుల కోసం EPFO సేవలను మెరుగుపరచడానికి ఉపయోగించే అప్డేట్. ఈ కేవైసీ వివరాల్లో పాన్, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు ఉన్నాయి. EPFO పోర్టల్లో సభ్యుల వివరాలను ఇంకా అప్డేట్ చేయకపోయినట్లయితే ఉద్యోగులు EPYO యూఏఎన్ పోర్టల్ కేవైసీ వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసుకోవచ్చు.

యాప్ ద్వారా పొందవచ్చు..

ఎంప్లాయిర్ యూఏన్ ను యాక్టివేట్ చేసిన తర్వాత ఉద్యోగులు అధికారికక పోర్టల్ ద్వారా ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా వివరాలను పొందుపరచాలి. ఎంప్లాయిర్ ధ్రువీకరణ లేకుండానే ఆన్ లైన్ ద్వారా క్లెయిమ్ సబ్మిట్ చేసుకోవచ్చు. యూఏఎన్ పోర్టల్లో లాగిన్ అవ్వడం ద్వారా నెలవారీ నెలవారీ స్టేట్మెంట్ ను ఉద్యోగి కూడా వీక్షించుకోవచ్చు. యూఏఎన్ కు ఆధార్ ను లింక్ చేసుకోవాలంటే ఈకేవైసీ పోర్టల్ ను వీక్షించాలి. పాన్, యూఏన్ ను లింక్ చేసిన తర్వాత ఆధార్ తో అనుసంధానించబడిన ఈపీఎఫ్ఓ సేవలను ఉమాంగ్ మొబైల్ యాప్ ద్వారా పొందవచ్చు. పన్ను విషయానికొస్తే పాన్ కార్డు చాలా ముఖ్యమైంది. ఉద్యోగికి అందించినా లేదా పాన్, ఫీఎఫ్ బ్యాలెన్స్ రూ.50000, 5 ఏళ్ల కన్నా తక్కువ సర్వీస్ ఉంటే 10 శాతం పన్ను తగ్గుతుంది.

First published:

Tags: EPFO

ఉత్తమ కథలు