Home /News /national /

HOW THE MYSTERY BOAT WITH AK 47S BULLETS REACHED MAHARASHTRA COAST HERE ARE EXCLUSIVE DETAILS SK

Maharashtra: ఏకే-47 రైఫిళ్లతో తీరానికి కొట్టుకొచ్చిన పడవ.. మహారాష్ట్రలో హైఅలర్ట్

తీరానికి కొట్టుకొచ్చిన పడవ

తీరానికి కొట్టుకొచ్చిన పడవ

Maharashtra Yacht: అరేబియా తీరానికి కొట్టుకొచ్చిన బోటు పేరు My Lady Han. ఇది ఆస్రేలియాకు చెందిన హానా లాండర్గన్ అనే మహిళది. ఈ ఘటనపై మహారాష్ట్ర పోలీసులతో పాటు యాంటీ టెర్రర్ స్క్వాడ్ దర్యాప్తు చేస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    మహారాష్ట్ర (Maharashtra)లో తీవ్ర కలకలం రేగింది. ఓ అనుమానాస్పద పడవ రాయగఢ జిల్లా హరిహరేశ్వర బీచ్‌ (Harihareshwara Beach) కొట్టుకొచ్చింది. అందులో ఉన్న ఓ సూట్‌కేసులో ఆయుధాలు బయటపడ్డాయి. మూడు ఏకే-47 రైఫిళ్లతో పాటు బుల్లెట్లు లభ్యమవడం సంచలనం రేపింది.  అనుమానాస్పద బోటును ముందుగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెళ్లి తనిఖీ చేయగా.. రైఫిళ్లు బయటపడ్డాయి. ఈ పడవపై రకరకాల ప్రచారం జరగడంతో.. ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.  డిప్యూటీ సీఎం దేవంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడారు.  ఇందులో ఉగ్రవాద కోణం లేదని.. ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే పడవలో రైఫిల్స్, బుల్లెట్స్ ఎందుకు ఉన్నాయో ఇప్పుడే చెప్పలేమని అన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరగుతోందని స్పష్టం చేశారు.




    బోటు లభ్యమైన హరిహరేశ్వర బీచ్ ముంబై మహానగరానికి 200 కి.మీ. దూరంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. హైఅలర్ట్ ప్రకటించి.. గోవా-ముంబై హైవేపై వాహనాలను తనిఖీలు చేశారు.



    ప్రాథమిక సమాచారం మేరకు.. అరేబియా తీరానికి కొట్టుకొచ్చిన బోటు పేరు My Lady Han. ఇది ఆస్రేలియాకు చెందిన హానా లాండర్గన్ అనే మహిళది. తన భర్త జేమ్స్‌ హర్బర్ట్‌తో కలిసి జూన్‌లో మస్కట్‌ మీదుగా యూరప్‌ వెళ్తుండగా పడవ ప్రమాదానికి గురయింది. పడవలో హానా లాండర్గన్, ఆమె భర్త జేమ్స్ హార్బర్ట్, కెప్టెన్.. ఈ ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఐతే వర్షాకాలంలో గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో ప్రతికూల వాతావరణం వల్ల పడవ ముందుకు వెళ్లలేకపోయింది. ఈ క్రమంలోనే జూన్‌ 26న కెప్టెన్ ఎమెర్జెన్సీ కాల్ చేశారు. అనంతరం బోట్‌లో ఉన్న వారిని కొరియా నేవీకి చెందిన ROKS Dae Jo Yeong రక్షించింది. పడవను అక్కడే వదిలిపెట్టి.. వారి వెళ్లిపోయారు. ఐతే పెద్ద పెద్ద అలల ధాటికి పడవ తీవ్రంగా ధ్వంసమైంది. అనంతరం సముద్ర జలాల్లో కలిసిపోయింది. అది అలలతో పాటు తీరానికి కొట్టుకొచ్చి.. హరిహరేశ్వర బీచ్‌కు చేరుకుంది.



    దీని వెనక ఉగ్ర కోణం లేనప్పటికీ.. అధికారులు మాత్రం అప్రమత్తమయ్యారు. ఫెస్టివల్‌ సీజన్‌ కావడంతో ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం స్థానిక పోలీసులు, యాంటీ టెర్రర్‌ స్క్వాడ్‌లు కేసు దర్యాప్తు చేస్తున్నాయి. కృష్ణాష్టమి, వినాయకచవితి పండుగలకు పటిష్ట భద్రత కల్పిస్తామని అధికారులు స్పష్టం చేశారు. పడవలో కొన్ని అనుమానాస్పద పేపర్లు లభ్యమయ్యాయి. వాటిని మహారాష్ట్ర యాంటీ టెర్రర్ స్క్వాడ్ స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తోంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Maharashtra, Mumbai, National

    తదుపరి వార్తలు