తుఫాన్ ‘నిసర్గ’ .. ఈ పేరు ఎలా వచ్చిందంటే..

తుఫాన్ ‘నిసర్గ’ .. ఈ పేరు ఎలా వచ్చిందంటే..

Cyclone Nisarga

Nisarga : మహారాష్ట్రను భయపెట్టిన తుఫాను పేరు.. నిసర్గ. అంటే ప్రకృతి అని అర్థం. ఈ పేరును బంగ్లాదేశ్ సూచించింది.

 • Share this:
  మహారాష్ట్రను భయపెట్టిన తుఫాను పేరు.. నిసర్గ. అంటే ప్రకృతి అని అర్థం. ఈ పేరును బంగ్లాదేశ్ సూచించింది. దేశంలో ఏర్పడే తుఫానులకు ఏదో ఒక పేరు కచ్చితంగా పెడతారు. వాతావరణ కేంద్రాల నుంచి వెలువడే సమాచారం ఎలాంటి గందరగోళం లేకుండా ప్రజలకు సవ్యంగా చేరేందుకు తుఫానులకు పేర్లు పెట్టడం అవసరం. ఒకే ప్రాంతంలో ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ తుఫానులు సంభవిస్తే వాటి మధ్య తేడా, ప్రభావాల్ని గుర్తించేందుకు ఈ పేర్లు ఉపయోగపడతాయి. అందులో భాగంగానే బంగ్లాదేశ్ సూచించిన ఈ పేరును భారత వాతావరణ శాఖ ఖరారు చేసింది. అంఫన్ తుఫానుకు ఆ పేరు సూచించింది థాయిలాండ్. అంటే ఆ భాషలో ఆకాశం అని అర్థం.

  కాగా, ఉత్తర హిందూ మహాసముద్రంలో సంభవించే తుఫానులకు పేర్లు పెట్టడం 2004 సెప్టెంబరులో మొదలైంది. హిందూ మహా సముద్ర తీర ప్రాంతంలోని 8 దేశాలైన బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్థాన్, శ్రీలంక, థాయ్‌లాండ్ పేర్లలోని మొదటి ఆంగ్ల అక్షరాల జాబితా ఆధారంగా తుఫాన్లకు పేర్లు పెట్టారు. 2018లో ఈ ప్యానెల్లో ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్ చేరాయి.

  ఇదిలా ఉండగా, అమెరికాలో తుఫాన్లను టోర్నడోలు అని, చైనాలో ఏర్పడే వాటిని టైఫూన్స్, హిందూ మహాసముద్రంలో సంభవించే వాటిని సైక్లోన్స్ అని పిలుస్తారు. అలాగే ఆస్ట్రేలియా పశ్చిమ తీరంలో సంభవించే తుఫాన్లను విల్లీవిల్లీస్, వెస్టిండీస్ దీవుల్లోని తుఫాన్లను హరికేన్స్ అంటారు.
  Published by:Shravan Kumar Bommakanti
  First published:

  అగ్ర కథనాలు