• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • HOW SASIKALA BOUGHT PROPERTIES WITH DEMONETISED CURRENCY NOTES WORTH OVER 1600 CRORE MK

శశికళ పాత నోట్ల దందా...డీమానిటైజేషన్ సమయంలో రూ.1674 కోట్ల మార్పిడి

శశికళ పాత నోట్ల దందా...డీమానిటైజేషన్ సమయంలో రూ.1674 కోట్ల మార్పిడి

శశికళ (File)

డీమానిటైజేషన్ అనంతరం రద్దు అయిపోయిన నోట్లతో ఆమె దాదాపు రూ.1674.50 కోట్ల విలువైన ఆస్తిపాస్తులను సమకూర్చుకున్నట్టు ఆదాయపన్ను శాఖ తన నోటీసులో ఆరోపించింది.

  • Share this:
    తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు పలు కేసుల్లో నిందితురాలు అయిన శశికళ కొత్త వివాదానికి కేంద్ర బిందువు అయ్యింది. డీమానిటైజేషన్ అనంతరం రద్దు అయిపోయిన నోట్లతో ఆమె దాదాపు రూ.1674.50 కోట్ల విలువైన ఆస్తిపాస్తులను సమకూర్చుకున్నట్టు ఆదాయపన్ను శాఖ తన నోటీసులో ఆరోపించింది. శశికళకు ఆస్తులు అమ్మిన వ్యక్తులు ఆ పాత నోట్లను 2016 నవంబర్ 8 నుంచి డిసెంబర్ 30 మధ్య వివిధ బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ చేసినట్టు తన నోటీసులో పేర్కొంది. డీమానిటైజేషన్ ప్రకటించగానే శశికళ చెన్నై పెరంబూరు, మదురై, కేకే నగర్‌లలో షాపింగ్‌ మాల్స్‌ పుదుచ్చేరిలో ఒక రిసార్ట్, కోయంబత్తూరులో పేపర్‌ మిల్, చెన్నై ఒరగడంలో చక్కెర మిల్లు, పాత మహాబలిపురం రోడ్డులో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ, కోయంబత్తూరులో 50 పవన విద్యుత్‌ ప్లాంట్‌లు కొనుగోలు చేసినట్టు ఐటీ తరఫు న్యాయవాది ఆధారాలను కోర్టు దృష్టికి తెచ్చారు.

    ఈ ఆస్తులన్నీ నగదు ద్వారానే జరిగినట్టు చెప్పారు. మద్రాసు హైకోర్టులో ఆదాయ వ్యవహారాలకు సంబంధించిన ఓ పిటిషన్‌పై స్టే విధించాలని శశికళ రిట్‌ దాఖలు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఐటీ శాఖను కోర్టు ఆదేశించింది. శనివారం న్యాయమూర్తి అనితా సుధాకర్‌ ముందు ఈ పిటిషన్‌ విచారణకు వచ్చింది. దీనిని పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి త్వరితగతిన అన్ని ప్రక్రియలు ముగించాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను వాయిదా వేశారు.
    Published by:Krishna Adithya
    First published: