హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

NPS: ఎన్‌పీఎస్‌ సబ్‌స్క్రైబర్లకు గుడ్‌న్యూస్‌.. నిర్ణీత సమయాల్లో ఆటోమేటిక్‌గా నిధులు విత్‌డ్రా చేసుకొనే అవకాశం

NPS: ఎన్‌పీఎస్‌ సబ్‌స్క్రైబర్లకు గుడ్‌న్యూస్‌.. నిర్ణీత సమయాల్లో ఆటోమేటిక్‌గా నిధులు విత్‌డ్రా చేసుకొనే అవకాశం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

NPS సేవలను మెరుగుపరిచేందుకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) చర్యలు తీసుకుంటోంది. మ్యూచువల్ ఫండ్ సిస్టమాటిక్ విత్‌డ్రా ప్లాన్‌(SWP) తరహాలో ఎన్‌పీఎస్ నిధులను క్రమం తప్పకుండా విత్‌డ్రా చేసుకునే ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో ఉంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

NPS: ఎన్‌పీఎస్‌(NPS) లేదా నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది సబ్‌స్క్రైబర్లకు వృద్ధాప్య భద్రతను అందించడానికి ప్రభుత్వం ప్రారంభించిన పెన్షన్-కమ్-ఇన్వెస్ట్‌మెంట్ పథకం. NPS సేవలను మెరుగుపరిచేందుకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) చర్యలు తీసుకుంటోంది. త్వరలో పదవీ విరమణకు దగ్గరగా ఉన్న నేషనల్ పెన్షన్ సిస్టమ్(NPS) సబ్‌స్క్రైబర్లు 60 ఏళ్లు నిండిన తర్వాత నగదు పొందే విధానాన్ని ఎంచుకొనే అవకాశం కల్పిస్తోంది. తమ నిధులు మొత్తాన్ని ఒకేసారి పొందడం, నిర్ణీత సమయంలో లేదా సిస్టమేటిక్‌గా విత్‌డ్రా చేసుకొనే అవకాశం రానుంది. ఈ మేరకు సబ్‌స్క్రైబర్లు నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక, వార్షిక వాయిదాలలో ఏకమొత్తాన్ని స్వీకరించడానికి అనుమతించే ప్రపోజల్‌ను PFRDA పరిశీలిస్తోంది. మ్యూచువల్ ఫండ్ సిస్టమాటిక్ విత్‌డ్రా ప్లాన్‌(SWP) తరహాలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో ఉంది.

ప్రస్తుత రూల్స్‌ ఏంటి?

ప్రస్తుతం NPS సబ్‌స్క్రైబర్‌కు 60 ఏళ్లు నిండితే ఒకేసారి నిధుల్లోని 60 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. బ్యాలెన్స్ తప్పనిసరిగా యాన్యుటీలుగా మారుతుంది. 75 ఏళ్ల వయస్సులో మొత్తం నిధులు లేదా కొంత తీసుకొనే ఆప్షన్‌ ఎంచుకోవచ్చు. దశలవారీగా ప్రతి ఏడాది విత్‌డ్రా చేసుకోవాలంటే.. ప్రతిసారీ రిక్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది.

సిస్టమాటిక్ లంప్సమ్ విత్‌డ్రా(SLW) ప్లాన్ ఎలా పని చేస్తుంది?

సబ్‌స్క్రైబర్‌ వార్షిక చెల్లింపునకు బదులుగా నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక అవకాశాలను కూడా ఎంచుకోవచ్చు. ఈరకమైన పేమెంట్స్‌ 75 సంవత్సరాల వయస్సు వరకు కొనసాగుతాయి. తర్వాత యూనిట్లు రిడీమ్ అవుతాయి, మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తారు. టైర్-I, టైర్-II అకౌంట్‌లకు ఈ సదుపాయాన్ని యాక్టివేట్‌ చేసుకోవడానికి ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఒకసారి రిక్వెస్ట్‌ పంపాల్సి ఉంటుంది. మొత్తం నిధులు, ప్రారంభ తేదీ, ముగింపు తేదీ పేర్కొనాలి.

SLW రిక్వెస్ట్‌ యాక్టివేట్‌ అయిన తర్వాత టైర్-I అకౌంట్‌కు ఎలాంటి కాంట్రిబ్యూషన్‌ చేయలేరు. కొంత మొత్తాలను విత్‌డ్రా చేసుకొనే అవకాశం కూడా ఉండదు. అయితే టైర్‌-II వాలంటరీ ఇన్వెస్ట్‌మెంట్‌ అకౌంట్‌. ఇందులో 60 ఏళ్లు నిండకముందే SLW కోసం సైన్ అప్ చేయవచ్చు. ప్రధానంగా టైర్-II నుంచి ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకోవచ్చు.

 యాన్యుటీలను కొనుగోలు చేయడానికి బదులుగా కొత్త విధానాన్ని ఎంచుకోవచ్చా?

60 శాతం లంప్సమ్ కాంపోనెంట్‌కు సిస్టమేటిక్‌ విత్‌డ్రా వర్తిస్తుంది. సిస్టమేటిక్‌ విత్‌డ్రా, వార్షిక చెల్లింపుల మధ్య ఎంచుకొనే అవకాశం పరిశీనలో ఉంది. NPS ఫీచర్లు, ఫ్లెక్సిబిలిటీల పరంగా అభివృద్ధిని చూస్తోంది, కాబట్టి చివరికి, సిస్టమేటిక్‌ విత్‌డ్రాను యాన్యుటీ భాగానికి (40 శాతం) కూడా పొడిగించవచ్చు.

Lakshadweep Beaches: లక్షద్వీప్ టూర్ ప్లాన్ చేస్తున్నారా..? బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉన్న ఈ బీచ్‌లు చూడాల్సిందే..

SLW కోసం ఎలా సైన్ అప్ చేయవచ్చు?

ఎగ్జిట్‌ అయ్యే సమయంలో సబ్‌స్క్రైబర్‌లు ఏకమొత్తం, యాన్యుటీ చెల్లింపు కోసం కేటాయించాల్సిన కార్పస్ శాతాన్ని అందించాల్సి ఉంటుంది. లంప్సమ్ పోర్షన్‌ విషయంలో మాత్రమే SLW వర్తిస్తుంది. NPS అకౌంట్‌లో లాగిన్‌ అయి, SLWని ఎంచుకుని, eSign లేదా డ్యూయల్ ఫ్యాక్టర్ OTP అథెంటికేషన్‌తో రిక్వెస్ట్‌ పంపాలి.

 SLW ద్వారా ఎవరు ప్రయోజనం పొందుతారు?

ఈ సదుపాయం సబ్‌స్క్రైబర్లకు పదవీ విరమణ సంవత్సరాలలో సౌలభ్యం, లిక్విడిటీని అందిస్తుంది. విత్‌డ్రా చేయని మొత్తాన్ని ఎంచుకున్న ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం కొనసాగుతుంది. మార్కెట్-లింక్డ్ రిటర్న్‌లను పొందుతుంది. ప్రస్తుతం ఏడాదికోసారి విత్‌డ్రా చేసుకొనే విధానం అనుకూలంగా లేదు. చాలా మంది పదవీ విరమణ పొందిన వారికి వారు పదవీ విరమణ చేసిన వెంటనే భారీ మొత్తం అవసరం కాకపోవచ్చు. ఎక్కువ మొత్తంలో డబ్బు అవసరం లేనప్పుడు క్రమబద్ధమైన ఏకమొత్తాన్ని ఉపసంహరించుకోవడం బెస్ట్‌ ఆప్షన్‌.

First published:

Tags: Pension Scheme