• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • HOW NASA CAMERAS SHOOT A MURDER IN DELHI HOW POLICE CRACK THIS CURIOUS CASE NK

NASA: హంతకుల్ని పట్టించిన నాసా కెమెరాలు?... అంతరిక్షం నుంచి కనిపెట్టేశాయా?

NASA: హంతకుల్ని పట్టించిన నాసా కెమెరాలు?... అంతరిక్షం నుంచి కనిపెట్టేశాయా?

హంతకుల్ని పట్టించిన నాసా కెమెరాలు? (image credit - twitter)

NASA: నాసా కెమెరాలు ఎంత పవర్‌ఫుల్లో చెప్పే ఘటన ఇది. క్రైమ్ కేసుల్ని కూడా డీల్ చేయడంలో నాసా కెమెరాలు అద్భుతంగా పనిచేశాయని పోలీసులు తెలిపారు. ఈ ఇంట్రస్టింగ్ టాపిక్ ఏంటో తెలుసుకుందాం.

  • Share this:
    NASA: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ - నాసా (NASA) దగ్గర ఉన్నంత పవర్‌ఫుల్ కెమెరాలు ఈ ప్రపంచంలో మరెవ్వరి దగ్గరా లేవు. అంతరిక్షంలో లక్షల కోట్ల కిలోమీటర్ల అవతల ఉన్న ఎన్నో దృశ్యాల్ని ఆ కెమెరాలు కాప్చర్ చేస్తాయి. నక్షత్రాలు, పాలపుంతలు, గ్రహ శకలాలు, నక్షత్ర మండలాలు, నెబ్యులాలు, సూపర్ నోవాలు ఇలా ఎన్నో విశ్వ రహస్యాల్ని ఛేదించాయి. అలాంటి కెమెరాలు భూమిపై జరుగుతున్న దృశ్యాల్ని ఈజీగా కాప్చర్ చెయ్యగలవు. తాజాగా ఓ మర్డర్ కేసులో ఆసక్తికర విషయాల్ని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ కేసు ఛేదనలో నాసా కెమెరాలు సాయపడినట్లు వివరించారు. ఈ కేసులో హంతకులు తాము హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. దాంతో నాసా కెమెరాలపై ఢిల్లీలో చర్చ మొదలైంది.

    నిజానికి ఈ కేసులో నాసా కెమెరాలు సాయపడలేదు. పోలీసులు తెలివిగా వేసిన ట్రిక్ ఫలించింది. అసలేం జరిగిందంటే... ఏప్రిల్ 5న ఢిల్లీ... మంగోల్పురీ ఏరియాలోని పార్కులో ఓ వ్యక్తిని ఎవరో చంపేశారు. పోలీసులు అక్కడికి వెళ్లినప్పుడు ఓ వ్యక్తి రక్తపు మడుగులో చనిపోయి కనిపించాడు. చనిపోయింది ఎవరో తెలియలేదు. ఎందుకంటే హంతకులు అతని ముఖాన్ని బండరాయితో పచ్చడి చేశారు. గుర్తించడానికి వీలు లేకుండా చేశారు. ఐతే పోలీసులకు ఎలాంటి ప్రత్యక్ష సాక్షీ అక్కడ కనిపించలేదు. హత్య కేసు రాసి దర్యాప్తు ప్రారంభించారు.

    మంగోల్పురిలో ఓ మిస్సింగ్ కేసు రావడంతో... ఆ మిస్సైన వ్యక్తీ... ఈ చనిపోయిన వ్యక్తీ ఒకరేనా అని చెక్ చేస్తే... ఒకరే అని తేలింది. అతని పేరు చంద్రభాన్, వయసు 35 ఏళ్లు అని తెలిసింది. చనిపోయే ముందు ఓ సీసీ కెమెరా ఫుటేజ్‌లో అతను ఇద్దరు వ్యక్తులతో కనిపించాడు. ఆ ఇద్దరూ ఎవరో తెలియలేదు. పోలీసులు ఓ ఇద్దరు అనుమానితులను (ప్రదీప్, రాజు) పిలిపించి... కొన్ని రకాల ప్రశ్నలు వేశారు. వాళ్లు పొంతనలేని సమాధానాలు చెప్పారు.

    రెండ్రోజుల తర్వాత పోలీసులు మళ్లీ ఆ ఇద్దర్నీ పిలిపించారు. ఈసారి తెలివిగా ప్రశ్నించారు. హత్య ఎందుకు చేశారు... మీరు చేసిన హత్యను ఆ ఏరియాలో ఏర్పాటు చేసిన నాసా కెమెరాలు షూట్ చేశాయి. మీరు ఎలా చంపిందీ... ఎలా బండరాయితో చితకబాదిందీ అంతా షూట్ చేశాయి. ఇక నాటకాలు ఆడి లాభం లేదు... ఎందుకు హత్య చేశారో చెప్పండి... అని అనడంతో... ఆ ఇద్దరూ నిజమే అనుకొని హత్య చేసినట్లు ఒప్పుకున్నారు.



    ఇది కూడా చదవండి:YouTube Shorts: యూత్‌ని ఎట్రాక్ట్ చేస్తున్న యూట్యూబ్... టిక్‌టాక్‌కి పోటీగా షార్ట్స్

    అసలీ హత్యకు దారి తీసిన కారణం మాత్రం చాలా సిల్లీగా ఉంది. ప్రదీప్, రాజును తాగుబోతులు అంటూ... చంద్రభాన్... ప్రజలందరి ముందూ అవమానపరిచడట. దాంతో ఆగ్రహించిన ఇద్దరూ అతన్ని చంపేయాలని అనుకున్నారట. అలా హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. ఈ మొత్తం కేసులో నాసా కెమెరాలకు ఏ సంబంధమూ లేకపోయినా... ఈ చిన్న అబద్దంతో నిందితుల నుంచి నిజాన్ని చెప్పించారు పోలీసులు.
    Published by:Krishna Kumar N
    First published: