మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులు గాల్లోకి ఎగరనున్నాయి. ఈ నేపథ్యంలో విమాన టికెట్ ధరలను కేంద్రం సవరించింది. విమాన ప్రయాణ సమయం ఆధారంగా 7 కేటగిరీలుగా చార్జీలు ఉంటాయి. ఢిల్లీ-ముంబై రూట్లో టికెట్ ధర గరిష్టంగా రూ.10వేలుగా ఉంటుంది. విమానాల్లో 40 శాతం సీట్లు బ్రాండ్ మిడ్ పాయింట్ కంటే తక్కువ ధరకు అమ్ముతారు. ఢిల్లీ-ముంబై మార్గాన్ని ఉదాహరణగా తీసుకుంటే.. కనిష్ట ధర రూ. 3500, గరిష్ట ధర రూ.10,000కు మిడ్ పాయింట్ ధర 6700. అంటే ఈ మార్గంలో రూ.6700 కంటే తక్కువ ధరకే 40శాతం టికెట్లను అమ్ముతారు. ధరలను నియంత్రించేందుకు ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు DGCA తెలిపింది. మే 25 నుంచి ఆగస్టు 24 వరకు టికెట్ ధరల విషయంలో ఇదే విధానం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.
టికెట్ ధరల వివరాలు: (కనిష్ట- గరిష్ట ధరలు)
1) 40 నిమిషాల లోపు ప్రయాణం - Rs. 2000 to 6000
2) 40-60 నిమిషాల ప్రయాణం - Rs. 2500 to 7500
3) 60-90 నిమిషాల ప్రయాణం - Rs. 3000 to 9000
4) 90-120 నిమిషాల ప్రయాణం - Rs. 3500 to 10,000
5) 120-150 నిమిషాల ప్రయాణం - Rs. 4500 to 13,000
6) 150-180 నిమిషాల ప్రయాణం - Rs. 5500 to 15,700
7) 180-210 నిమిషాల ప్రయాణం - Rs. 6500 to 18,600
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Flight, Flight Offers, Flight tickets, Lockdown