Home /News /national /

సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీ.. ఎన్ని సార్లు ఎస్పీజీ రూల్స్ బ్రేక్ చేశారంటే..

సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీ.. ఎన్ని సార్లు ఎస్పీజీ రూల్స్ బ్రేక్ చేశారంటే..

సోనిియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, రాబర్ట్ వాద్రా

సోనిియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, రాబర్ట్ వాద్రా

గాంధీ కుటుంబం ఎస్పీజీ నిబంధనలు పాటించడం లేదని, రూల్స్‌ను చాలాసార్లు ఉల్లంఘించినట్టు ఓ రిపోర్ట్ బయటకు వచ్చింది.

    కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీలకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారికి ఎస్పీజీ అవసరం లేదని, జెడ్ ప్లస్ భద్రత కల్పించాలని నిర్ణయించింది. దీనిపై విమర్శలు వచ్చాయి. అయితే, వారికి ఎస్పీజీ భద్రత ఉన్నా కూడా దాన్ని పాటించడం లేదని, ఎస్పీజీ నిబంధనలు చాలాసార్లు ఉల్లంఘించినట్టు ఓ రిపోర్ట్ బయటకు వచ్చింది. ఆ నివేదిక ప్రకారం..

    2014 నుంచి 2019 మే వరకు రాహుల్ గాంధీ 1892 సార్లు బుల్లెట్ ప్రూఫ్ వాహనం లేకుండా ఢిల్లీలో ప్రయాణం చేశారు. 2019 జూన్ వరకు 247 సార్లు బుల్లెట్ ప్రూఫ్ వాహనం లేకుండానే ఢిల్లీ దాటి బయటకు వెళ్లారు. అంతకు ముందు 2005 నుంచి 2014 వరకు రాహుల్ గాంధీ దేశంలోని 18 ప్రాంతాల్లో బుల్లెట్ ప్రూఫ్ వాహనం లేకుండా పర్యటించారు. 2017లో ఏకంగా ఏకంగా మోటార్ వెహికల్ చట్టాన్ని ఉల్లంఘించి ఓపెన్ టాప్ జీపులో ప్రయాణించారు. 1991 నుంచి రాహుల్ గాంధీ 156 సార్లు విదేశీ పర్యటనలకు వెళితే అందులో 143 సార్లు ఎస్పీజీ లేకుండానే వెళ్లారు. తన ప్రయాణం గురించి చివరి నిమిషంలో సమాచారం ఇవ్వడంతో అప్పటికప్పుడు ఎస్పీజీని పంపడం సంబంధిత విభాగానికి కష్టంగా మారేది.

    కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా పలుమార్లు ఎస్పీజీ నిబంధనలను ఉల్లంఘించినట్టు నివేదిక పేర్కొంది. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు 24 సార్లు ఎస్పీజీని తీసుకెళ్లకుండానే వెళ్లారు. 2015 నుంచి 2019 మే మధ్య 50 కంటే ఎక్కువసార్లు ఆమె బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు లేకుండా ఢిల్లీలో పర్యటించారు. దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు 13 సార్లు బుల్లెట్ ప్రూఫ్ కార్ వినియోగించలేదు.

    కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ కూడా చాలాసార్లు ఎస్పీజీ రూల్స్ బ్రేక్ చేశారు. 2015 నుంచి 2019 వరకు 339 సార్లు బుల్లెట్ ప్రూఫ్ వాహనం లేకుండా ఢిల్లీలో పర్యటించారు. దేశంలోని 64 ప్రాంతాల్లో ఆమె బుల్లెట్ ప్రూఫ్ వాహనం లేకుండా పర్యటించి రూల్స్ బ్రేక్ చేశారు. 1991 నుంచి 99 సార్లు విదేశాలకు వెళ్లిన ప్రియాంకా గాంధీ కేవలం 21సార్లు మాత్రమే ఎస్పీజీని వెంట తీసుకెళ్లారు. రాహుల్ గాంధీ తరహాలో చివరి నిమిషంలో పర్యటనల వివరాలు చెప్పడం వల్లే ఆమె వెంట ఎస్పీజీని పంపడానికి కుదరలేదు.
    First published:

    Tags: Priyanka Gandhi, Rahul Gandhi, Robert Vadra, Sonia Gandhi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు