Home /News /national /

HOW MANY SEATS BJP WILL GAIN IN OVERALL INDIA AND HOW OTHER PARTIES MAINTAIN KEY ROLE IN FORMING CENTRAL GOVERNMENT NK

యూపీలో బీజేపీకి షాక్ తప్పదా... మారుతున్న పరిస్థితులు... పెరుగుతున్న పార్టీల వ్యతిరేకత...

నరేంద్రమోదీ, అమిత్ షా (File)

నరేంద్రమోదీ, అమిత్ షా (File)

Lok Sabha Election 2019 : 2014 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామని బీజేపీ చెబుతోంది. అసలది సాధ్యమేనా? అప్పుడు ఉన్న మోదీ మేనియా ఇప్పుడు లేనప్పుడు... అప్పటి కంటే ఎక్కువ స్థానాలు ఎలా గెలుస్తారు? ఇలాంటి ప్రకటనలు ఎందుకు చేస్తున్నారు ?

2014లో సంకీర్ణ రాజకీయాలకు చెక్ పెడుతూ... పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చింది బీజేపీ. సరిగ్గా ఐదేళ్లు గడిచేటప్పటికీ... తిరిగి సంకీర్ణాల బాట పట్టేలా కనిపిస్తోంది. సొంతంగా మెజార్టీ సాధించడం సంగతేమోగానీ... అసలు మెజార్టీకి దరిదాపుల్లో స్థానాలైనా గెలుస్తుందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. తాము ఎలాంటి అవినీతికీ పాల్పడలేదనీ, అద్భుతమైన పరిపాలన అందించామనీ, అందుకే తిరిగి తమకే ప్రజలు పట్టం కడతారని కమలనాథులు చెబుతున్నారు సరే... కానీ సంకీర్ణాల శకంలో ప్రజల మద్దతుతోపాటూ... పార్టీల మద్దతూ అవసరమే. వ్యతిరేక పార్టీల సంఖ్య పెరిగేకొద్దీ బీజేపీకి నష్టమే. ప్రస్తుతం అలాంటి వాతావరణమే కనిపిస్తోంది. కత్తులు దూస్తున్న వైరి పక్షాలు... కమలదళాన్ని కలవరపెడుతున్నాయి. శరవేగంగా పావులు కదుపుతున్న ప్రాంతీయ పార్టీలు... జాతీయ పార్టీకి చుక్కలు చూపెడుతున్నాయా...

2014లో బీజేపీ గెలుచుకున్నవి 282 స్థానాలు. బ్రహ్మాండమైన మెజార్టీ. ఈసారి 350 స్థానాలు గెలవాలని టార్గెట్ పెట్టుకొని... 300 వస్తాయన్న ప్రకటనలు చేస్తున్నారు కాషాయం అగ్రనేతలు. వాస్తవం మరోలా ఉంది. బీజేపీకి ప్రతీ రాష్ట్రంలోనూ సీట్లు తగ్గుతాయనీ, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో 2014లో 73 స్థానాలు గెలుచుకుంటే... ఇప్పుడు 30కి మించి రావన్న ప్రచారం జరుగుతోంది. అంతెందుకు సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా కమలానికి కలిసొచ్చేలా లేదు పరిస్థితి. అక్కడ 2014లో మొత్తం 26 స్థానాలనూ గెలుచుకున్న బీజేపీ... ఈసారి ఓ 10 స్థానాలు కోల్పోతుందన్న అంచనాలున్నాయి. అదే జరిగితే బీజేపీకి తీవ్ర నష్టమే.

ప్రధానంగా యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పాలనపై ఆయనకు అంతగా పట్టు లేకపోవడం, అధికారుల ఇష్టారాజ్యం కావడం, అవినీతి పెరగడం, నరేంద్ర మోదీ గ్రాఫ్ పడిపోవడం వంటి అంశాలు బీజేపీకి మైనస్ అవుతున్నాయి. జరిగిన ఉప ఎన్నికల్లో అది స్పష్టమైంది కూడా. అదీకాక ఇప్పుడు ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ చేతులు కలిపి... యాదవులు, దళితుల ఓటు బ్యాంకును తిరిగి తమ సొంతం చేసుకోవాలని చూస్తున్నాయి. పైగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ప్రతిపక్షం సొంతమవ్వబోతోంది. అదే సమయంలో కాంగ్రెస్‌కి కూడా అంతగా కలిసిరాని కాలం ఉంది. ఇవన్నీ ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్డీ కూటమికి కలిసొచ్చే అంశాలు.

ఇక అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను కాంగ్రెస్ ఆ రాష్ట్రాల్లో బీజేపీకి సహజంగానే వ్యతిరేకత ఉంది. జమ్మూకాశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన పెట్టడంతో ప్రజలు బీజేపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటు బీహార్‌లో మిత్రపక్షమైన జేడీయూ... అధికారంలో ఉన్నా బీజేపీ కంటే తమకే ఎక్కువ మార్కులు పడేలా జాగ్రత్త పడుతోంది. బెంగాల్, ఒడిశాలో... బీజేపీకి ఛాన్స్ ఇవ్వకుండా ఉండేందుకు ఏమేం ప్రయత్నాలు చెయ్యాలో అన్నీ చేస్తున్నాయి అక్కడ అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్, బీజేడీ ప్రభుత్వాలు. మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉన్నా... తన గ్రాఫ్ పెంచుకునే అవకాశం కోసం మిత్రపక్షమైన శివసేన కాచుకుని ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎలాగూ బీజేపీ ప్రభావం తక్కువే. సౌత్‌లో చూస్తే... ఒక్క కేరళలో శబరిమల వివాదంతో పెరిగిన మద్దతు తప్పితే మిగతా రాష్ట్రాల్లో బీజేపీకి కలిసొచ్చే అవకాశాలు కనిపించట్లేదు. ఈ లెక్కలే కమలదళాన్ని కలవరపరుస్తున్నాయి.

ఏ పార్టీకి ఎన్ని సీట్లు : ప్రస్తుత లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కి 120కి మించి లోక్ సభ స్థానాలు రావన్న అంచనాలున్నాయి. యూపీఏ పక్షాలన్నీ కలిసినా... 200కి మించి స్థానాలు దక్కవని తెలుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం... ఎప్సీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, టీఆర్ఎస్ లాంటి పార్టీలే. ఇవన్నీ కలిసి... దాదాపు 120 నుంచీ 130 స్థానాలు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటన్నింటికీ కలిపి... 320 నుంచీ 330 స్థానాలు పోతే... బీజేపీ దాని మిత్రపక్షాలకు కలిపి... 215 నుంచీ 225 స్థానాలకు మించి రావంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ పరిస్థితుల మధ్య తటస్థ పార్టీలైన తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, టీఆర్ఎస్... వ్యూహాత్మక ఎత్తుగడలతో చక్రం తిప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పార్టీలు ఎవరికి మద్దతు ఇచ్చినా, ప్రధాని పీఠం తమకే ఇవ్వాలనే మెలిక పెట్టే ప్రమాదం ఉంది. ఇది బీజేపీ, కాంగ్రెస్ కూటములకు మింగుడుపడని అంశమే.

 

ఇవి కూడా చదవండి :

దగ్గరవుతున్న బీజేపీ, వైసీపీ ... ఫలితాల తర్వాత పొత్తు..? ప్రత్యేక హోదా అటకెక్కినట్లేనా.. ?

నేడు పశ్చిమ బెంగాల్‌కి చంద్రబాబు... మమతా బెనర్జీకి మద్దతుగా రెండ్రోజులు ప్రచారం

చంద్రబాబు ప్రధాని అవ్వగలరా...? ఉండవల్లి వ్యాఖ్యల వెనక వ్యూహం ఏంటి ?

సహజీవనం పెళ్లితో సమానం... రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు...
First published:

Tags: Amit Shah, Lok Sabha Election 2019, Narendra modi, Uttar Pradesh Lok Sabha Elections 2019

తదుపరి వార్తలు