మిషన్ శక్తితో శాటిలైట్‌ ఎలా కూలింది... వీడియో రిలీజ్ చేసిన DRDO...

Mission Shakti : యాంటీ శాటిలైట్ (A-SAT) వెపన్‌ను విజయవంతంగా పరీక్షించిన DRDO... అందుకు సంబంధించిన వీడియోను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.

Krishna Kumar N | news18-telugu
Updated: April 8, 2019, 10:39 AM IST
మిషన్ శక్తితో శాటిలైట్‌ ఎలా కూలింది... వీడియో రిలీజ్ చేసిన DRDO...
దూసుకెళ్తున్న రాకెట్ (Image : Facebook)
  • Share this:
Mission Shakti : భూ ఉపరితలానికి 300 కిలోమీటర్ల దూరంలో అంతరిక్షంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించిన మిషన్ శక్తి ఆపరేషన్ ఎలా జరిగింది? ఈ ఆపరేషన్‌లో ఎన్ని దశలు ఉంటాయి? అన్నవాటికి సంబంధించి ఓ వీడియోని రిలీజ్ చేసింది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO). యాంటీ శాటిలైట్(A-SAT) వెపన్‌... అంతరిక్షంలో 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న టెస్ట్ శాటిలైట్‌ను మార్చి 27, 2019న విజయవంతంగా కూల్చేసింది. ఒడిశాలోని కలాం దీవిలో ఈ పరీక్ష జరిగింది. యాంటీ శాటిలైట్(A-SAT) వెపన్‌‌ను స్వయంగా రూపొందించిన DRDO... ఈ ఆపరేషన్‌ను కేవలం 3 నిమిషాల్లో పూర్తి చేయడం విశేషం. అమెరికా, రష్యా, చైనా తర్వాత యాంటీ శాటిలైట్ వెపన్ సిస్టమ్ ఉన్న నాలుగో దేశంగా ఇండియా రికార్డు సాధించింది. వ్యూహాత్మక సైనిక చర్యల్లో భాగంగా శాటిలైట్లను కూల్చేందుకు A-SAT వెపన్స్‌ను తయారు చేశారు. బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్(BMD) ప్రోగ్రామ్‌ను ఈ ప్రయోగంలో ఉపయోగించారు.

ఈ మిషన్‌కి సంబంధించిన గ్రాఫిక్స్, పిక్చర్లతో కూడిన వీడియోను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారు. అది మీరూ చూడండి.మొదట్లో ఈ ఆపరేషన్‌ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. కానీ... దేశవ్యాప్తంగా 150 మంది సైంటిస్టులు దీన్ని విజయవంతం చేయడానికి నిరంతరం శ్రమించారు. ఈ ప్రయోగం ద్వారా ఏర్పడిన స్పేస్ వ్యర్థాలు (రోదశీ శకలాలు)... 45 రోజుల్లో భూ ఉపరితలంలోకి వచ్చి... కాలిబూడిదవుతాయని DRDO చీఫ్ జి.సతీష్ రెడ్డి తెలిపారు. 

ఇవి కూడా చదవండి :

నేడు బీజేపీ మేనిఫెస్టో విడుదల... ఎలా ఉంటుంది... కాంగ్రెస్‌కి షాక్ ఇస్తుందా...పసుపు కుంకుమ ముసుగులో ఓటర్లకు డబ్బులు... పావులుగా డ్వాక్రా మహిళలు

ఖర్చు తక్కువ... విదేశీ ట్రిప్పులు ఎక్కువ... ప్రధాని మోదీకి ఇదెలా సాధ్యమైంది...


రూ.69,49,75,000 విత్‌ డ్రా చేసి... మళ్లీ బ్యాంకులో వేసేశాడు... ఎందుకో తెలుసుకుంటే ఆశ్చర్యమే...
First published: April 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు