'నోట్లో టపాసులు పేలి ఏనుగు మృతి'పై నెటిజన్ల విచారం.. మనుషులను నమ్మొద్దు..

పేలుడు ధాటికి ఏనుగు తొండం, నీటితో తీవ్ర గాయాలయ్యాయి. ఆ నొప్పితో ఏమీ తినలేక ఆకలితో ఆలమటించింది. నొప్పి నుంచి ఉపశమనం కోసం వెల్లియార్ నదిలోకి వెల్లి నిలబడింది.

news18-telugu
Updated: June 3, 2020, 5:52 PM IST
'నోట్లో టపాసులు పేలి ఏనుగు మృతి'పై నెటిజన్ల విచారం.. మనుషులను నమ్మొద్దు..
కేరళ ఏనుగు మృతి..
  • Share this:
కేరళలో ఏనుగు మృతి ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలన రేపుతోంది. టపాసులు నింపిన పైనాపిల్ తినడంలో పేలుడు సంభవించి ఏనుగు చనిపోయింది. మలప్పురంలో మే 27న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ఆడ ఏనుగు ఊరి మీదుగా వెళ్తుండగా కొందరు వ్యక్తులు పైనాపిల్ పండు ఇచ్చారు. దాని నిండా టపాసులు పెట్టి ఏనుగు అందజేశారు. ఆ విషయం తెలియక ఏనుగు పైనాపిల్‌ను తినడంతో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఏనుగు తొండం, నీటితో తీవ్ర గాయాలయ్యాయి. ఆ నొప్పితో ఏమీ తినలేక ఆకలితో ఆలమటించింది. నొప్పి నుంచి ఉపశమనం కోసం వెల్లియార్ నదిలోకి వెల్లి నిలబడింది.

రోజుల తరబడి అక్కడే నిలబడిన ఏనుగు.. నీటిని మాత్రమే తీసుకొంది. ఆహారం తీసుకోకపోవడంతో బక్కచిక్కి.. నీటిలోనే ప్రాణాలు వదిలింది. వెటర్నరీ డాక్టర్లు చేరుకొని పోస్టుమార్టం చేయగా.. ఏనుగులో కడుపులో గర్భస్థ ఏనుగు ఉంది. అది కూడా చనిపోయిందని డాక్టర్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనపై నెటిజర్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. మనుషులను నమ్మి మోసం పోయిందని.. చివరకు ప్రాణాలను కోల్పోయిందని కన్నీరు కార్చుతున్నారు. ఏనుగును చంపిన వారికి కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు.






First published: June 3, 2020, 5:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading