• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • HOW GOOD SAMARITANS IN DELHI ARE KEEPING COVID 19 PATIENTS FED WITH GHAR KA KHAANA INITIATIVE MK GH

Home food Distribution: కరోనా విజృంభిస్తోన్న వేళ.. ఇంటి భోజనాన్ని ఉచితంగా అందిస్తోన్న సంస్థలు..

Home food Distribution: కరోనా విజృంభిస్తోన్న వేళ.. ఇంటి భోజనాన్ని ఉచితంగా అందిస్తోన్న సంస్థలు..

ప్రతీకాత్మకచిత్రం

దేశ రాజధాని దిల్లీలో మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో యువకులు, మహిళలు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు వారి ఇంటి వద్దే ఆహారాన్ని వండి అవసరమైన కరోనా రోగులకు అందించడానికి ముందుకు వస్తున్నారు.

  • Share this:
కరోనా రెండో వేవ్ విజృంభిస్తోన్న వేళ సర్వత్రా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఆసుపత్రులు రోగులతో నిండుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని దిల్లీలో మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో యువకులు, మహిళలు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు వారి ఇంటి వద్దే ఆహారాన్ని వండి అవసరమైన కరోనా రోగులకు అందించడానికి ముందుకు వస్తున్నారు. లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్న యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థ(YWA)వారు దక్షిణ దిల్లీలో పలు ప్రాంతాల్లో కోవిడ్ రోగులకు ఇంటి ఆహారాన్ని అందిస్తున్నారు. ఈ సంస్థలో 27 మంది వాలంటీర్లు ఉన్నారు. వైడబ్ల్యూఏ దిల్లీ అధ్యక్షుడు రాఘవ్ మండల్ ఈ విషయంపై మాట్లాడుతూ చాలా కుటుంబాలు కోవిడ్ బారిన పడి సాయం చేయడానికి ఎవరూ లేని పరిస్థితిలో ఉన్నాయని, అందుకే వారికి నయమయ్యేంత వరకు వారి గుమ్మాల వద్దకే ఆహారాన్ని అందించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఘర్ కా ఖానా, హమరే ఘర్ సే ఆప్కే ఘర్ తక్(ఇంటి ఆహారం.. మా ఇంటి నుంచి మీ ఇంటి వరకు) అనే నినాదంతో ఉచిత భోజనాన్ని అందిస్తున్నారు.

నిజంగా సాయం అవసరమైన వారు తమ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ను కాంటాక్ట్ చేయాలని కోరుకుంటున్నట్లు రాఘవ్ మండల్ తెలిపారు. "నిన్న మేము 12 మంది కోవిడ్ రోగులకు మా ఇంటి నుంచే ఆహారాన్ని వండి అందించాం. ఇదే మార్గంలో మా సంస్థ సెక్రటరీ, ట్రెజరరీ ఇంటి నుంచే ఆహారం తయారు చేసి 13 మంది రోగులకు వారి ఇంటి వద్దకే డెలివరీ చేశారు. ఇందుకోసం మేము ప్రత్యేకంగా వంటశాలలను ఏర్పాటు చేయలేదు. మా ఇంట్లో మేము వండుకున్న దానికి కొంచెం అదనంగా వండి అందిస్తున్నాం అని మండల్ స్పష్టం చేశారు. గ్రీన్, సఫ్దార్జంగ్ ప్రాంతం, లజపత్ నగర్, గ్రేటర్ కైలాష్, డిఫెన్స్ కాలనీలాంటి ప్రాంతాల్లో ఈ సంస్థ అవసరమైన కరోనా రోగులకు ఆహారాన్ని చేరవేస్తుంది. ఇందుకోసం వీలైనంత మంది తమకు సాయం చేసేందుకు మద్దతుగా రావాలని రాఘవ్ పిలుపునిచ్చారు. అవసరమైన వారికి, నిజంగా సాయం కావాల్సిన వారికి అండగా నిలవాలని కోరారు.

మహిళల ఆరోగ్యం, సాధికారిత కోసం పనిచేస్తున్న మరో సంస్థ 'ఏఏఎస్ ఫౌండేషన్' 200 మంది కోవిడ్ రోగులకు ఆహారాన్ని సరఫరా చేసింది. కరోనా సోకిన వారి నుంచి అభ్యర్థనలను స్వీకరించేందుకు హెల్ప్ లైన్ ను కూడా ప్రారంభించామని, వారికోసం గత 20 రోజులుగా మేము వారికి ఆహారాన్ని అందిస్తున్నామని ఏఏఎస్ ఫౌండేషన్ అధ్యక్షుడు రేఖా గుప్తా తెలిపారు. ప్రతిరోజూ 200 మందికి పైగా రోగులకు ఆహారాన్ని అందించామని స్పష్టం చేశారు. పాత దిల్లీలో ఫుతేపురి నుంచి భాజపా నాయకుడు ప్రవీణ్ శంకర్ కపూర్, ఆయన స్నేహితులు అమర్ నాథ్ గుప్తా, అశ్వని వాట్స్, హరివంశ్ శర్మ వికెండ్ లాక్ డౌన్ సందర్భంగా వలస కార్మికులకు ఆహారం అందించడానికి 'శ్రామిక రసోయి' ను ప్రారంభించారు ఫతేపురి పరిసర ప్రాంతాల్లో చాలా మంది వలస కార్మికులు ఉన్నారని, వారంతపు కర్ప్యూలో వారికి ఆహారం అందిచండానికి ప్రత్యేకంగా ఓ వంటగదిని ఏర్పాటు చేశామని ప్రవీణ్ శంకర్ కపూర్ తెలిపారు.
First published:

అగ్ర కథనాలు