మాటిమాటికి ఇంటర్నెట్ బంద్‌... హైకోర్టు చరిత్రాత్మక తీర్పు...

హైకోర్టు ఆదేశాలతో తొమ్మిది రోజుల తర్వాత శుక్రవారం ఉదయం నుంచి అసోంలో ఇంటర్నెట్ సేవలు పునఃప్రారంభమయ్యాయి.

news18-telugu
Updated: December 21, 2019, 3:45 PM IST
మాటిమాటికి ఇంటర్నెట్ బంద్‌... హైకోర్టు చరిత్రాత్మక తీర్పు...
న్యూస్‌18 క్రియేటివ్ (Mir Suhail)
  • Share this:
మాటిమాటికి ఇంటర్నెట్ బంద్‌... హైకోర్టు చరిత్రాత్మక తీర్పు... నెటిజన్లు ఖుషీఇంటర్నెట్ నిలిపివేతలకు సంబంధించి పీపుల్స్ డైలీ అనే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సెంట్రల్ కమిటీకి చెందిన అధికార పత్రిక ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. భారత్‌లో ఇంటర్నెట్ నిలిపివేయడం చూస్తే అంతర్జాల సేవలు నిలిపివేయడం సమంజసమే అని అర్థమవుతోందని పేర్కొంది. ‘జాతీయ పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలను నిలిపి వేయాలంటూ భారత్ తాజాగా ఆదేశించింది. దీన్ని బట్టి అత్యవసర సమయాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం అనేది ఇరుగుపొరుగు దేశాలకు ఓ మార్గదర్శనంగా మారింది.’ అని ఆ పత్రిక పేర్కొంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడా లేనంతగా ఇటీవల భారత్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతున్నాయి. ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తోంది. పాకిస్తాన్, ఇరాక్, సిరియా, టర్కీ, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో లాంటి దేశాల కంటే కూడా భారత్‌లో ఇంటర్నెట్ నిలిపివేతలు ఎక్కువగా ఉన్నాయి. తాజాగా గువాహటి హైకోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. అసోంలో ఇంటర్నెట్ సేవలను వెంటనే వెంటనే పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించడం చైనా ప్రభుత్వానికే కాదు, భారత ప్రభుత్వానికి కూడా చేదువార్తే. కానీ, భారత్‌లో ఇంటర్నెట్ వినియోగదారులకు మాత్రం ఈ తీర్పు ఓ చరిత్రాత్మకమైంది.

‘ఇంటర్నెట్ వల్ల శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతుందని నిరూపించగల సాక్ష్యాలు, ఆధారాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ కోర్టు ముందు ఉంచలేకపోయింది.’ అని గువాహటి హైకోర్టు చీఫ్ జస్టిస్ అజయ్ లాంబ, జస్టిస్ అచింత్య మల్లా బుజోర్ బారువా బెంచ్ అభిప్రాయపడింది.

హైకోర్టు ఆదేశాలతో తొమ్మిది రోజుల తర్వాత శుక్రవారం ఉదయం నుంచి అసోంలో ఇంటర్నెట్ సేవలు పునఃప్రారంభమయ్యాయి. ‘ప్రస్తుత సమాజంలో శాస్త్ర సాంకేతికత సాధారణ జీవితంలో కూడా క్రియాశీలకంగా మారింది. అలాంటిది, ఇంటర్నెట్‌ను నిలిపివేయడం అనేది తీవ్ర ప్రభావం చూపిస్తుంది’ అని కోర్టు అభిప్రాయపడింది.

అయితే, దీనిపై ఢిల్లీకి చెందిన ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు, న్యాయవాది గౌతమ్ భాటియా స్పందిస్తూ ‘హింస జరగకుండా ఉండేందుకు కొన్ని సందర్భాల్లో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేయడానికి కోర్టు అంగీకరించింది. తీర్పులో రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. మొదటిది, ఇంటర్నెట్ వల్ల హింస వ్యాప్తి చెందుతుందనే అంశాన్ని నిరూపించడంలో ప్రభుత్వం విఫలమైంది. రెండోది, ఇంటర్నెట్ వల్ల రాష్ట్రంలో ఎంతో హింస జరిగింది. కానీ, ఇంటర్నెట్ నిలిపివేయడం వల్ల రాజ్యాంగపరమైన హక్కులను కొంతవరకు కట్టడి చేయడం కరెక్టేనని సమర్ధించుకోలేకపోయింది.’ అని అన్నారు.

తాజాగా హాంగ్‌కాంగ్‌లో పాస్ అయిన ఓ ఆర్డర్‌ను గౌతమ్ భాటియా గుర్తు చేశారు. హాంగ్‌కాంగ్‌లో నిరసనకారులు ముఖాలకు మాస్క్‌లు ధరించి హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారని, ఇకపై ఎలాంటి ఆందోళనల్లోనూ ఎవరూ మాస్క్‌లు వేసుకోవడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ ఆదేశాలను స్థానిక కోర్టు కొట్టేసింది. ముఖానికి మాస్క్‌లు వేసుకోవడానికి, హింసకు పాల్పడడానికి సంబంధం ఏంటని ప్రశ్నించింది. దీంతోపాటు దానికి సంబంధించిన ఆధారాలను చూపించడంలో ప్రభుత్వం విఫలమైంది. అయితే, భవిష్యత్తులో ఎప్పుడూ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయొద్దని గువాహటి హైకోర్టు చెప్పలేదనే అంశాన్ని ప్రస్తావించారు.
First published: December 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading