Home /News /national /

HOW FREEBIE CULTURE THREATENS TO HURT INDIA STORY HERE IS POLITICAL ECONOMIST GAUTAM SEN OPINION MKS

Freebies : ఉచిత పథకాలతో ప్రమాదం.. అవి భారత ఆర్థిక గమనాన్ని ఎలా దెబ్బతీస్తాయంటే..

ఆప్ సీఎంలు మాన్, కేజ్రీవాల్ (ఫైల్ ఫొటో)

ఆప్ సీఎంలు మాన్, కేజ్రీవాల్ (ఫైల్ ఫొటో)

ఉచిత పథకాలకు విపరీతంగా ఖర్చులు పెరగడంతో ఆంధ్రప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలు దివాళా అంచున నిలిచాయి. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ లో అనుచితంగా ఉచిత పథకాలను ప్రకటించడం వివాదాస్పదమైంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Delhi Cantonment | Punjab | Gujarat
ఎన్నికల్లో గెలవడం కోసం వివిధ పార్టీలు భారీ ఎత్తున ఉచిత పథకాలను ప్రకటిస్తోన్న వైనం దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరంగా మారింది. ఏళ్లుగా ఉచిత పథకాలు అమలవుతున్నా ఆశించిన స్థాయిలో పేదల సంక్షేమం చోటుచేసుకోకపోవడంపై కోర్టులు సైతం వ్యాఖ్యానాలు చేస్తున్నాయి. ఉచిత పథకాలకు విపరీతంగా ఖర్చులు పెరగడంతో ఆంధ్రప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలు దివాళా అంచున నిలిచాయి. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం అనుచితంగా ఉచిత పథకాలను ప్రకటించడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో ఉచిత పథకాల వల్ల తలెత్తే ఆర్థిక ముప్పు, సదరు ఫ్రీబీస్ వల్ల భారత ఆర్థిక గమనం దెబ్బతింటోన్న వైనాన్ని ప్రముఖ రాజకీయ ఆర్థికవేత్త గౌతమ్ సేన్ ఇలా వివరిస్తారు..

ఉచిత పథకాల సమస్య కొత్తది కానప్పటికీ, గుజరాత్ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఓటర్లకు లంచాలు ఇవ్వజూపుతోన్న వైనం చర్చనీయాంశమైంది. దేశంలో ప్రస్తుతం ఫ్రీబీస్ ఉదంతాలపై న్యాయపరమైన వివాదాలు తలెత్తాయి. వీటిలో కొన్ని న్యాయస్థానాల ముందున్నాయి. పార్లమెంట్ లేదా అసెంబ్లీల ఎన్నికల్లో ఉచిత పథకాల ప్రకటనలపై ఎన్నికల సంఘం (EC) తీరుతో ఈ అంశం న్యాయపరంగా పరిష్కరమయ్యే అవకాశం లేదు. ఆసక్తికరంగా, ఈ విషపూరిత వైఖరిలో ప్రభుత్వాలే చురుగ్గా వ్యవహరిస్తున్నాయి. ఉచిత పథకాలు.. కేవలం ఆర్థిక, బడ్జెటరీ అస్థిరతను సవాలు చేయడమే కాదు, భారతీయ రాజకీయ వ్యవస్థ పనితీరులోని సమస్యలనూ స్పష్టంగా తెలియజేస్తాయి.

ఉచిత పథకాల సమస్య అంతర్జాతీయ, చారిత్రాత్మక రాజకీయ, ఆర్థిక కోణాలతో కూడిన మనోహరమైన సంక్లిష్టమైన మేధో సమస్య. చరిత్రలో అపఖ్యాతి పాలైన మొదటి శతాబ్దపు రోమన్ చక్రవర్తి నీరో.. వినాశకరమైన అగ్నిప్రమాదం తర్వాత రోమన్ ప్రజలకు ఉచిత ధాన్యాన్ని పంపిణీ చేశాడు. అయితే నీరో ఆ పనిని.. రోమన్ సామ్రాజ్యంలోని మిగిలిన ప్రాంతాలను నాశనం చేయడం ద్వారా చేపట్టాడు. దోపిడిలో కొంత భాగాన్ని తన కోసం ఉంచుకొని, మిగతావి పంపిణీ చేశాడు. ఫ్రీబీస్‌ ద్వారా పంపిణీదారులు సైతం ప్రయోజనం పొందుతారనేది ముఖ్యమైన అంశం. మరి ప్రజల కోణానికి వస్తే..

ఉచితాలు లేదా పబ్లిక్ సబ్సిడీలు అనేవి పౌరులు లేదా పేదల సంక్షేమంలో ముఖ్యపాత్ర పోషిస్తాయనేది అవాస్తవ అభివ్యక్తి మాత్రమే. వాస్తవానికి భారీగా నిధులు ఖర్చయ్యే ఉచిత పథకాలు ఆర్థిక సమస్యలను హైటైల్ చేస్తాయి. ఫైనాన్సింగ్ ఖర్చులు పెరిగి, చివరికి ఆ భారం ప్రజల భుజాలపైనే పడుతుంది. ఉచిత సాంఘిక సంక్షేమ కార్యక్రమాలకు ఫైనాన్సింగ్ ఖర్చు అనేక రాష్ట్రాలలో ఇప్పుడొక ప్రధాన సమస్యగా మారింది. పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌లు ఆర్థిక దివాలా దశను ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. తీవ్రమైన బడ్జెట్ సంక్షోభాన్ని కూడా ఇవి సూచిస్తున్నాయి.

పంజాబ్ లో విద్యుత్ రాయితీలు.. రాష్ట్ర ఖజానాపై పెంనుభారంగా మారింది. పంజాబ్ మొత్తం రాబడిలో 16% కంటే ఎక్కువ దీనికి ఖర్చవుతున్నది. ఈ వ్యవహారం దీర్ఘకాలిక వృద్ధికి అవసరమైన మూలధన కేటాయింపులను తగ్గిస్తుంది. పరిశ్రమపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది పంజాబ్‌లో సమస్య అయినప్పటికీ పారిశ్రామిక వినియోగదారుల కోసం యూనిట్ విద్యుత్ టారిఫ్ తమిళనాడు మాదిరిగానే ఉంది. అయితే గుజరాత్‌లో కంటే ఇవి సుమారు 50% ఎక్కువ. పంజాబ్, తమిళనాడు డిస్కమ్‌లు రెండూ గృహ వినియోగదారులకు సబ్సిడీల విధానం కారణంగా గణనీయమైన అప్పులను కలిగి ఉన్నాయి.

ఉచిత పథకాలు, రాయితీలు బడ్జెట్ కేటాయింపులపై ప్రభావం చూపుతాయి. ఇది అత్యంత సమస్యాత్మకమైనది. భవిష్యత్ వృద్ధి కోసం ప్రస్తుత మూలధన పెట్టుబడిగా వినియోగించడం, వ్యక్తికి ప్రయోజనం చేకూరుస్తుందేమోగానీ పోటీ ప్రపంచంలో భారతదేశాన్ని శక్తివంతం చేస్తుందా? అనేది ప్రశ్న. భారత్.. తన పొరుగు ప్రత్యర్థి చైనా స్థాయికి చేరుకోవాలని ఆశిస్తే $10 ట్రిలియన్ బెంచ్‌మార్క్‌ను చేరుకోవాలంటే, అనేక చోట్ల ఉత్పన్నమయ్యే ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందడం అత్యవసరం. విచక్షణా రహితమైన ఉచిత పథకాలు, సంక్షేమ రాయితీల కారణంగా రాష్ట్రాలు దివాలా తీసే పరిస్థితులు నెలకొంది. ఈ విస్ఫోటనం ఇంతింతై తప్పించుకోలేని క్రాస్-సబ్సిడీగా బెయిలౌట్‌లకు దారి తీసేదిగా, కేంద్రం-రాష్ట్రాల మధ్య విభజన ఆగ్రహాన్ని రేకెత్తిస్తాయి.

బ్రిటన్ లో జాతీయ ఆరోగ్య సేవలు నానాటికీ ఖరీదవుతుండటం, అభివృద్ధి చెందిన దేశాలల్లోనూ నిరుద్యోగ, వికలాంగుల సంక్షేమం కోసం ఉచిత పథకాలు సార్వత్రిక దృగ్విషయం. ప్రతి సందర్భంలో, వాటికి నిధులు సమకూర్చడం అనేది సమస్యగా, పరిమిత బడ్జెట్ వనరుల ప్రత్యామ్నాయ ఉపయోగాలు కష్టతరంగా మారాయి. రక్షణ వ్యయం అనివార్యమైనప్పటికీ, అది ఉపయోగించే వనరులలో నిరుత్సాహపరుస్తుంది. ఉదాహరణకు, ఆధునిక జెట్ ఫైటర్‌ను ఎగురవేయడానికి గంటకు $21,000 ఖర్చవుతుంది. కొత్త మోడళ్లకైతే ఈ ఖర్చు ఇంకా ఎక్కువే.

భారతదేశానికి సంబంధించి.. బహుశా ఇతర సాపేక్షంగా పేద దేశాలలో కూడా ఉచితాల విషయంలో కొన్ని ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి. పేదలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందజేయడం నైతికంగా ఖండించదగినది కాదు. ఏది ఏమైనప్పటికీ, సంచితంగా దీని అర్థం సబ్సిడీ బిల్లు ద్వారా వర్తమానం కోసం భవిష్యత్తును త్యాగం చేయడమే అవుతుంది. రాజకీయ నాయకులు ఈ అంశాలను పెద్దగా పట్టించుకోనప్పటికీ, సంబంధిత రాష్ట్రాలు, వివాదాస్పద అంతర్-రాష్ట్ర బదిలీలు ఆర్థిక దివాలా చిక్కులను కలిగున్నాయి. దురదృష్టవశాత్తూ, పేదలు తమ అవసరాలకు అవసరమైన విద్యుత్ శక్తి సరఫరాలకు కూడా మించి ఆహారం, ఆశ్రయానికి నిధులు సమకూర్చలేక, అవసరాలు తీర్చుకోవడానికి కష్టపడుతున్నాయి. తద్వారా ఉచితాలు భవిష్యత్తులోనైనా ప్రయోజనాలు ఇస్తాయనే వాదన తప్పని తేలుతుంది.

అంతిమంగా, రాజకీయ నాయకులు తమ సొంత రాజకీయ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి ఉచితాల పేరుతో వస్తుపరమైన లేమి క్రీడలు తప్పకుండా ఆడతారు. ఎన్నికలలో గెలవడానికి ఆప్ ఇలాంటి ఆటను సమర్థవంతమైన సాధనంగా వాడింది. దేశ విరోధులుగా పేరొందిన ద్రోహపూరిత రాజకీయ నాయకులు రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఉచిత పథకాల సాయం పొందడం తీవ్రమైన ప్రమాదకర అంశం. 2008లో ఇండియన్ కాంగ్రెస్, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీలు సంయుక్తంగా సంతకం చేసిన అవగాహన ఒప్పందం.. భారత ఎన్నికలలో విదేశీ జోక్యాన్ని తీవ్రతరం చేసింది. అలాగే జాతీయ ప్రయోజనాలను వారు తీవ్రంగా దెబ్బతీసే వీలు ఏర్పడింది.

నిజానికి సంక్షేమ వ్యయంలో ఒక రూపంగా మాత్రమే ఉండాల్సిన ఉచిత పథకాలకు వ్యతిరేకంగా చట్టాలు చేయడం రాజకీయంగా, రాజ్యాంగపరంగా అసాధ్యం. ఎందుకంటే ప్రతి మలుపులోనూ అనేక చట్టబద్ధమైన పథకాల ద్వారా నిష్కపటమైన వారికి బదిలీ చెల్లింపులు ఉంటాయి. నిస్సందేహమైన విధాన మార్గదర్శకాలు ఇప్పటికే ఉన్నప్పటికి, ఒక నిర్దిష్ట స్థాయి కంటే ఎక్కువ రుణాలు తీసుకోవడానికి రాష్ట్రాలను మంజూరు చేయడం కూడా సమస్యాత్మక విషయమే.

ఉచిత పథకాలు, సబ్సిడీల పంపిణీలో కొంతైనా హేతుబద్ధతను ప్రవేశపెట్టాలంటే, దేశ రాజకీయ నాయకులు మొదట ఓటర్లలో తమ విశ్వసనీయతను మెరుగుపరచుకోవాలి. ప్రబలమైన అక్రమాలు, అవినీతి కారణంగా భారత రాజకీయాలలో వేళ్లూనుకుపోయిన విశ్వాసరాహిత్యాన్ని నేతలే పరిష్కరించాలి. రాజకీయ నాయకుల భవిష్యత్ హామీల కంటే ఇప్పటికిప్పుడు లభించే ఆఫర్లనే సాధారణ పౌరులను ప్రేరేపిస్తున్నాయి. అయితే గుజరాత్‌లో నరేంద్ర మోదీ చేసి చూపిన విధంగా ఇతరు నేతలూ అనుసరిస్తే.. పౌరులు ఎలా ప్రవర్తిస్తారో మార్చడం సాధ్యమవుతుంది. నిరంతరాయంగా 24 గంటల సరఫరాకు బదులుగా విద్యుత్ చౌర్యాన్నిఅరికట్టి మోదీ ఓటర్ల మనసులను గెలుచుకున్నారు. అదే ఓటర్లు ఇటీవల గుజరాత్‌లో గెలుపుకోసం ఆప్ ఇవ్వజూపిన లంచాల ఆఫర్లను తిరస్కరించారు.

ఏదోఒక రోజుకు, భారత్.. స్కాండినేవియన్ సామాజిక ఒప్పందాన్ని చేరుకుంటుందని ఆకాంక్షించవచ్చు. గొప్ప ప్రయోజనానికి బదులుగా స్వీయ-నియంత్రణను పాటించేలా ప్రజలను ప్రేరేపిస్తుంది. అయితే అలా జరగడానికి ముందు భారత్ ఆర్థికంగా బలోపేతం అవుతూ, $10 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా మారడం, జీడీపీ లక్ష్యాలను సాధించడం అవసరం కావచ్చు.

(వ్యాసకర్త గౌతమ్ సేన్ ప్రముఖ పొలిటికల్ ఎకనమిస్ట్. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్‌లో రెండు దశాబ్దాలకు పైగా అంతర్జాతీయ రాజకీయ ఆర్థిక వ్యవస్థను బోధించారు. ఈ వ్యాసంలో వ్యక్తీకరించబడిన అభిప్రాయాలు రచయిత వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రచురణ సంస్థ ఉద్దేశాలను ఇవి సూచించవు)
Published by:Madhu Kota
First published:

Tags: India, Schemes

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు