వివాహ విందులో పగిలిన తలలు..ప్లేట్స్ విరగ్గొట్టి..వంటకాలను విసిరేసి..

హోటల్ సిబ్బందిపై వరుడి బంధువులు, మిత్రులు దాడికి పాల్పడ్డారు. ప్లేట్లు, గిన్నెలతో చితక్కొట్టారు. ఈ ఘటనలో క్యాటరింగ్ సిబ్బందికి గాయాలయ్యాయి. కొందరికి తలకు బలంగా దెబ్బలు తగలడంతో రక్తస్రావమైంది.

news18-telugu
Updated: February 12, 2019, 5:45 PM IST
వివాహ విందులో పగిలిన తలలు..ప్లేట్స్ విరగ్గొట్టి..వంటకాలను విసిరేసి..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: February 12, 2019, 5:45 PM IST
వివాహ వేడుకలో విందుకు ప్రత్యేక స్థానముంది. పెళ్లి ఎంత ఘనంగా చేసినా...అతిథులుకు సరైన భోజనం పెట్టకుంటే విమర్శలు తప్పవు. విందు భోజనం కోసం గొడవలు జరిగిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. వధూవరుల కుటుంబాలు కొట్టుకున్న సందర్భాలూ ఉన్నాయి. వడ్డనలో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని..భోజనం రుచికరంగా లేదని..ముక్కలు ఎక్కువగా పడలేదని..ఇలా ఎన్నో కారణాలతో తగాదాలు జరుగుతుంటాయి. తాజాగా ఢిల్లీలోనూ ఇలాంటి ఘటనే జరిగింది.

జనక్‌పురి ప్రాంతంలో ఉన్న పికాడిలీ హోటల్‌లో సోమవారం సాయంత్రం ఓ పెళ్లి విందు జరిగింది. పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడి తరపు నుంచి అతిథులు తరలివచ్చారు. కానుకల ప్రదానం, ఫోటో సెషన్ అనంతరం విందు మొదలుపెట్టారు. ఐతే వంటకాలు చల్లగా ఉన్నాయని.. పెళ్లి కుమారుడి స్నేహితులు హోటల్ సిబ్బందితో గొడవపెట్టుకున్నారు. ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం జరిగి..చివరకు ఘర్షణకు దారితీసింది. హోటల్ సిబ్బందిపై వరుడి బంధువులు, మిత్రులు దాడికి పాల్పడ్డారు. ప్లేట్లు, గిన్నెలతో చితక్కొట్టారు. ఈ ఘటనలో క్యాటరింగ్ సిబ్బందికి గాయాలయ్యాయి. కొందరికి తలకు బలంగా దెబ్బలు తగలడంతో రక్తస్రావమైంది.

మొత్తంగా వివాహ విందు కార్యక్రమం రచ్చ రచ్చయింది. ఫ్లేట్స్ పగులకొట్టారు. వంటకాలను పారబోశారు. హోటల్ ఫర్నిచర్‌ కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇరువర్గాలను పిలిచి ప్రశ్నించారు. ఐతే వంటకాలు చల్లారిపోయాన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు హోటల్ యాజమాన్యం. క్యాటరింగ్ గర్ల్స్‌తో వరుడి స్నేహితులు అసభ్యంగా ప్రవర్తించారని..ఇదేంటని ప్రశ్నించినందుకే దాడికి పాల్పడ్డారని పోలీసులకు తెలిపారు. కాగా, విందులో ఘర్షణకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...