• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • HOSPITAL STAFF NEGLECTS DEATH OF THREE YEAR OLD BOY IN BIHAR BN

ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం.. కొడుకు మృతదేహంతో 48 కిలోమీటర్ల కాలినడక..

ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం.. కొడుకు మృతదేహంతో 48 కిలోమీటర్ల కాలినడక..

ప్రతీకాత్మక చిత్రం

ఆ బాలుడి తల్లిదండ్రులు అంబులెన్సును ఏర్పాటు చేయాలని ఆస్పత్రి సిబ్బందిని కోరారు. అందుకు ఆస్పత్రి సిబ్బంది లాక్‌డౌన్ సమయంలో అంబులెన్సు ఏర్పాటు చేయడం కుదరదని తేల్చిచెప్పారు.

  • Share this:
    ‘వైద్యో నారాయణో హరి:’ అంటుంటారు. కానీ కొంతమంది వైద్యుల అలసత్వం వల్ల ఆ పవిత్రమైన వృత్తికి చెడ్డపేరు వస్తోంది. ఆస్పత్రి సిబ్బంది అంబులెన్సు సౌకర్యం కల్పించకపోవడంతో ఓ పసిప్రాణం బలయ్యింది. దాంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు మూడేండ్ల కొడుకు మృతదేహాన్ని మోసుకుంటూ 48 కిలోమీటర్ల దూరంలోని వారి ఊరికి కాలినడకన బయలుదేరారు. ఇది వింటున్న మనకే అదోలా ఉంటే.. అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ తల్లిదండ్రుల శోకం ఎవరూ తీర్చలేనిది. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని షాహోపర్ గ్రామానికి చెందిన గిరీజ్‌కుమార్ దంపతులకు మూడు సంవత్సరాల కొడుకు ఉన్నాడు.

    సదరు బాలుడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఓ ప్రైవేటు వాహనంలో దగ్గరలోని జహనాబాద్‌లోని సర్దార్ ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. వైద్యులు బాలుడిని పరిశీలించి పట్నా వైద్య కాలేజీ హాస్పిటల్‌కు తీసుకెళ్లమని చెప్పారు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు అంబులెన్సును ఏర్పాటు చేయాలని ఆస్పత్రి సిబ్బందిని కోరారు. అందుకు ఆస్పత్రి సిబ్బంది లాక్‌డౌన్ సమయంలో అంబులెన్సు ఏర్పాటు చేయడం కుదరదని తేల్చిచెప్పారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో చేసేదేమిలేక తల్లిదండ్రులు తమ భుజాలపై తమ కొడుకును వేసుకుని పరిగెత్తారు.

    ఆస్పత్రికి వెళుతుండగానే మార్గమధ్యంలోనే బాలుడు చనిపోయాడు. తమ కళ్లముందే అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు చనిపోవడంతో వారి ఆర్తనాదాలు మిన్నంటాయి. స్థానికుల సాయంతో బాలుడి మృతదేహాన్ని తీసుకుని తమ ఊరికి బయలుదేరారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతోనే మా కొడుకు చనిపోయాడంటూ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న అధికారులు సర్దార్ ఆస్పత్రి మేనేజర్‌ను సస్పెండ్ చేయగా, మరికొంతమంది వైద్యులకు నోటీసులు జారీ చేశారు.
    Published by:Narsimha Badhini
    First published:

    అగ్ర కథనాలు