Home /News /national /

HORSE IN LEGAL SPOT DID IT GIVE BIRTH OR HAVE MISCARRIAGE GH VB

Horse Abortion: కోర్టుకు చేరిన గుర్రం పంచాయితీ.. అసలు ఏం జరిగింది..? ఎందుకు ఈ వివాదం..? వివరాలిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గుర్రం ఓ బిడ్డకు జన్మనిచ్చిందా? లేదా? అనే అంశంపై న్యాయపరమైన వివాదం తలెత్తింది. 12ఏళ్ల సబినాజ్ అనే గుర్రం విషయంలో చెలరేగిన ఈ వివాదం న్యాయవ్యవస్థ దృష్టికి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

గుర్రం(Horse) ఓ బిడ్డకు జన్మనిచ్చిందా? లేదా? అనే అంశంపై న్యాయపరమైన వివాదం తలెత్తింది. 12ఏళ్ల సబినాజ్ అనే గుర్రం విషయంలో చెలరేగిన ఈ వివాదం న్యాయవ్యవస్థ దృష్టికి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. గాయపడిన గుర్రంపై సవారీ చేయిస్తున్నారని ఊటీకి(OOty) చెందిన కన్నన్​ అనే వ్యక్తిపై గతేడాది ఫిబ్రవరిలో ఆరోపణలు వచ్చాయి. కరియాతంపారా పర్యాటకానికి(Kerala Tourism) వచ్చే టూరిస్టులను అతడు సబినాజ్ అనే గుర్రంపై కూర్చోబెట్టి, దాన్ని హింసిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు అందగా.. గుర్రాన్ని స్వాధీనం చేసుకుని పీపుల్ ఫర్ యానిమల్స్​ (PFA) పర్యవేక్షణకు అప్పగించారు. అప్పటినుంచి వివాదం ప్రారంభమైంది. ఇటీవలే దానిని తిరిగి పొందిన కన్నన్.. గుర్రం ఈనిన తర్వాత దాని బిడ్డను తనకు అప్పగించట్లేదని ఆరోపిస్తున్నారు. అయితే సబినాజ్‌ అసలు ఈనలేదని, దానికి గర్భస్రావం(Horse Abortion) అయిందని పీఎఫ్‌ఏ వాదిస్తోంది.

Explained: వైవాహిక అత్యాచారంపై ఢిల్లీ హైకోర్టులో వాదనలు.. అసలు Marital Rape అంటే ఏంటి..? చట్టం దీనిగురించి ఏం చెబుతోంది..?


పీఎఫ్​ఏ కస్టడీ నుంచి తన గుర్రాన్ని అప్పపగించాల్సిందిగా గత ఏప్రిల్‌లో కన్నన్ కోర్టును(Kerala Court) ఆశ్రయించాడు. “గతేడాది నవంబర్ 11న అతనికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అయినప్పటికీ వివిధ కారణాల వల్ల 2022 జనవరి 14న పోలీసుల సమక్షంలో అతనికి గుర్రాన్ని అప్పగించారు. ఆ సమయంలో గుర్రం పాలివ్వడం గమనించిన కన్నన్.. తనకు గుర్రం పిల్ల కావాలని కోర్టుమెట్లెక్కాడు.

తాను స్వాధీనం చేసుకున్న గుర్రానికి పూకోడ్‌లోని వెటర్నరీ అండ్ యానిమల్ సైన్స్ కాలేజీలో (KVASU) వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే దానికి ప్రసవం జరిగిందా? లేదా గర్భస్రావం జరిగిందా? అని కనుగొనలేకపోయారు. సహజ ప్రక్రియ ద్వారానే గుర్రం పాలిస్తున్నట్లు నిపుణులు చెప్పారని కన్నన్ తరపు న్యాయవాది సుమిన్ నెడుంగదన్ మీడియాకు వెల్లడించారు. గుర్రాన్ని పీఎఫ్‌ఏకు అప్పగించే సమయంలో కాలికి గాయాలు మాత్రమే ఉన్నాయని నెడుంగదన్ స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు దానికి కంటిచూపు సమస్య తలెత్తిందని, ఫలితంగా కాళ్లు నేలపై పెట్టుకోలేకపోతోందని ఆరోపించారు. గుర్రానికి ప్రస్రవం జరిగినట్లు KVASU అధికారులు నివేదిక ఇచ్చారని పేర్కొన్నారు.

గర్భస్రావం అయిందా?
లాక్‌డౌన్ సమయంలో గుర్రం యజమాని కన్నన్ దానిని సరిగా చూసుకోలేదని PFA సంస్థ చెబుతోంది. ‘‘గుర్రాన్ని మాకు అప్పగించిన తర్వాత అది గర్భంతో ఉన్నట్లు తెలిసింది. త్రిసూర్‌కి తరలించడానికి ముందు కోజికోడ్‌లో రెండు నెలల పాటు దాన్ని సంరక్షించాం. అక్కడే దానికి గర్భస్రావం జరిగింది. ప్రభుత్వ వైద్యుడు ఇచ్చిన నివేదికతో పాటు పిండం ఫోటోలు మా వద్ద ఉన్నాయి” అని పీఎఫ్‌ఏ ప్రతినిధి కే. జిన్షా చెప్పారు.

Explained: ఇండోనేషియా రాజధాని మార్చడానికి గల కారణం ఏంటి..? ఆ దేశంలో ప్రస్తుతం ఏ జరుగుతోంది..?


గుర్రాన్ని పరీక్షించిన పశు వైద్యులు మరో వాదన వినిపించారు. "గుర్రం గర్భాశయం సాధారణ పరిమాణంలో ఉంది. ఈ మధ్యకాలంలో బిడ్డకు జన్మనిచ్చిన ఆనవాళ్లేమీ లేవు. హార్మోన్లలో హెచ్చుతగ్గుల కారణంగానే గుర్రం ఈనకపోయినా పాలివ్వడం జరుగుతుంది" అని సబినాజ్‌ను పరీక్షించిన పూకోడ్‌ వెటర్నరీ డాక్టర్, రేడియాలజీ ఇన్‌ఛార్జ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ దినేష్ పీటీ చెప్పారు. ప్రస్తుతం ఈ కేసు పెరంబ్రా జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు విచారణలో ఉంది.
Published by:Veera Babu
First published:

Tags: Horse, Kerala

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు