Home /News /national /

HORN NOT OK DRIVE KICK STARTS FROM TODAY IN HIMACHAL PRADESH CAPITAL SHIMLA BA

Horn Not Ok | అక్కడ అనవసరంగా హార్న్ కొడితే.. ఆ తర్వాత ఫైన్ కట్టాలి...

ట్రాఫిక్ జామ్ (ప్రతీకాత్మక చిత్రం)

ట్రాఫిక్ జామ్ (ప్రతీకాత్మక చిత్రం)

హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఈ రోజు నుంచే ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. ప్రముఖ టూరిస్ట్ ప్రాంతమైన సిమ్లాలో స్థానికులు, పర్యాటకులకు ఈ అంశంపై అవగాహన కల్పించనున్నారు.

    రోడ్డు మీద వాహనం నడిపేవాళ్లు.. చీటికీ మాటికీ హార్న్ కొడుతూ ఉంటారు. కొందరు కొత్తగా నేర్చుకునేవాళ్లు పదే పదే హార్న్ కొడతారు. మరికొందరు అత్యుత్సాహం కొద్దీ హార్న్ కొడతారు. అయితే, హిమాచల్ ప్రదేశ్‌ రాజధాని సిమ్లాలో ఇకపై అలాంటివి నిషేధం. ఈ రోజు నుంచే ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. ప్రముఖ టూరిస్ట్ ప్రాంతమైన సిమ్లాలో స్థానికులు, పర్యాటకులకు ఈ అంశంపై అవగాహన కల్పించనున్నారు. అనవసరంగా వాహనాల హార్న్ కొట్టినట్టు స్థానికులు, పోలీసులు భావిస్తే.. ఆ తర్వాత సదరు వ్యక్తి ఫైన్ కట్టాల్సి ఉంటుంది. గత ఏడాది ఆగస్ట్‌లోనే ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ ప్రారంభించారు. ఈ రోజు నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి తెచ్చారు. శబ్దకాలుష్యం తగ్గించేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. టూరిస్టులు, స్థానికులతో పాటు స్కూళ్లలో కూడా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నట్టు పర్యావరణ, సైన్స్ టెక్నాలజీ డైరెక్టర్ డీసీ రాణా తెలిపారు.

    పోలీసుపై న్యాయవాదుల దాడి

    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Himachal Pradesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు