కాంగ్రెస్ పథకం బీజేపీ రూ. 15 లక్షల హామీ కావొద్దు... అఖిలేష్ కామెంట్

బీజేపీ గతంలో ఇచ్చిన ప్రతి పేదవాడి బ్యాంక్ అకౌంట్‌లో రూ. 15 లక్షల హామీ తరహాలో ఇది ఉండకూడదని తాను భావిస్తున్న ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: March 26, 2019, 4:30 PM IST
కాంగ్రెస్ పథకం బీజేపీ రూ. 15 లక్షల హామీ కావొద్దు... అఖిలేష్ కామెంట్
రాహుల్, అఖిలేష్ యాదవ్ (ఫైల్ ఫొటో)
news18-telugu
Updated: March 26, 2019, 4:30 PM IST
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ కనీస ఆదాయం పథకం హామీపై తనదైన శైలిలో స్పందించారు. బీజేపీ గతంలో ఇచ్చిన ప్రతి పేదవాడి బ్యాంక్ అకౌంట్‌లో రూ. 15 లక్షల హామీ తరహాలో ఇది ఉండకూడదని భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. దేశంలోని 20 శాతం ప్రజలకు ఉపయోగపడేదిగా కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటున్న సరికొత్త హామీపై అఖిలేష్ యాదవ్ సందేహాలు వ్యక్తం చేశారు. గతంలో ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్ వాదీ ప్రభుత్వం ఇలాంటి పథకాలను అమలు చేసిందని ఆయన గుర్తు చేశారు. బుందేల్‌ఖండ్‌లోని పేద ప్రజలకు ఆహారధాన్యాలు, పాలు, నూనె సహా ఇతర పదార్థాలు ఇచ్చామని అఖిలేష్ అన్నారు.

రూ. 3.5 లక్షల విలువైన లోహియా ఆవాస్‌తో పాటు కుటుంబ పెద్దలకు పెన్షన్లు కూడా ఇచ్చామని అన్నారు. కాంగ్రెస్ పథకంపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన తరువాతే దీనిపై తమ వైఖరి చెబుతామని అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో తాము గెలిస్తే ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి రూ. 72,000 ఇచ్చేలా కనీస ఆదాయ పథకం అమలు చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఈ పథకం ద్వారా 25 కోట్ల మందికి లబ్ది కలుగుతుందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. చారు.


First published: March 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...