• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • HONEYBEES LAND ON AIRCRAFT BEFORE PASSENGERS BOARD NK

Honeybees land on aircraft: విమానాలపై తేనెటీగల దాడి. ప్రయాణికుల పరిస్థితేంటి

Honeybees land on aircraft: విమానాలపై తేనెటీగల దాడి. ప్రయాణికుల పరిస్థితేంటి

విమానాలపై తేనెటీగల దాడి. ప్రయాణికుల పరిస్థితేంటి (File - credit - twitter - ChalkAndCarrots)

Honeybees land on aircraft: తెనేటీగలకు ఓ రహస్య సంకేతాల భాష ఉంటుంది. దాని ద్వారా అవి మేటర్ తెలుసుకుంటాయి. అందుకే అన్నీ ఒకేలా స్పందిస్తాయి. విమానాల సంగతేంటో తెలుసుకుందాం.

  • Share this:
    Honeybees land on aircraft: తేనెటీగల్ని మీరు ఎప్పుడైనా గమనిస్తే... అవి ఎక్కడైనా వాలితే... అన్నీ ఒకేచోట గుంపుగా చేరతాయి. అంతే గానీ ఇతర ప్రదేశాలకు వెళ్లవు. ఇందుకు ప్రధాన కారణం రాణీ తేనెటీగ. అది ఎక్కడ వాలితే... అవి కూడా అక్కడే వాలతాయి. తాజాగా అలాంటి రాణీ తేనెటీగ... కోల్‌కతా ఎయిర్‌పోర్టులో ఆదివారం మధ్యాహ్నం ఓ విస్తారా విమానంపై సోమవారం ఉదయం మరో విమానంపై వాలింది. అది వాలిన విమానాలపై లక్షల కొద్దీ తేనెటీగలు కూడా వాలాయి. దాంతో... ప్రయాణికులు ఆ విమానాలు ఎక్కేందుకు భయపడ్డారు. ఎప్పుడూ లేనిది ఇలా హనీబీస్ ఎటాక్ చెయ్యడంతో... ఎయిర్‌పోర్ట్ అధికారులకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అవతల ప్యాసింజర్లు... టైమైపోతోంది... త్వరగా ఏదో ఒకటి చెయ్యండి అని అంటుంటే... అధికారులకు ఎక్కడ లేని టెన్షన్ వచ్చింది.

    రెండు విమానాల్లోనూ 150 మంది చొప్పున ప్రయాణికులు ఎక్కక ముందే దాడి చేశాయి తేనెటీగలు. కానీ అవి ఎంతకూ వెళ్లకపోవడం సమస్యైంది. ఓ ఉద్యోగి... ఇచ్చిన సలహా బాగానే ఉందనుకుంటూ... వాటర్ కెనాన్‌లను తెచ్చి తేనెటీగల్ని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఆదివారం మధ్యాహ్నం చేసిన ఈ ప్రయత్నం ఫలించడంతో... సోమవారం ఉదయం కూడా అలాగే చేసి... మొత్తానికి రెండు విమానాలపైనా హనీబీస్ వెళ్లిపోయేలా చేశారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొనేందుకు ఫైర్ ఇంజిన్లు కూడా వచ్చాయి. ఐతే... వాటి అవసరం రాలేదు.


    తేనెటీగలు వెళ్లిపోయాక మరో కొత్త సమస్య వచ్చింది. ఒక్క తేనెటీగ కూడా విమానంలోపలికి వెళ్లలేది. అయినప్పటికీ... ప్రయాణికుల సేఫ్టీ దృష్ట్యా... విమానాల లోపల... ఫ్యూమిగేషన్ చేశారు. దాంతో... రెండు విమానాల్లోనూ ప్రయాణికులకు ఆలస్యమైంది. ఆదివారం గంట లేటుగా, సోమవారం మార్నింగ్ కూడా గంట లేటుగా విమానాలు టేకాఫ్ అయ్యాయి.

    ప్రస్తుతం టెర్మినల్‌లో తేనెటీగలు లేవని అధికారులు తెలిపారు. అవి తిరిగి రాకుండా... ఆ పరిసరాల్లో భారీగా పురుగు మందులు స్ప్రే చేశారు. ఆ తర్వాత వాటికోసం వెతకగా ఎక్కడా అవి కనిపించలేదు.

    ఇది కూడా చదవండి:Rape and Murder: 8 ఏళ్ల బాలికపై రేప్, హత్య... శవాన్ని బావిలో విసిరేసి అమానుషం

    ఎయిర్‌పోర్టులో భారీ చెట్లేవీ లేవు. అంటే... అవి ఇంకెక్కడి నుంచో వచ్చాయని అధికారులు తెలిపారు. కొన్నేళ్ల కిందట న్యూయార్క్‌... పిట్స్‌బర్గ్ ఎయిర్‌పోర్టులో తేనెటీగల దండు డెల్టా ఎయిర్‌లైన్స్ విమాన రెక్కలపై తిష్టవేయడంతో... 47 నిమిషాలు ఆలస్యంగా విమానం బయలుదేరింది. మొత్తానికి ప్రయాణికులకు ఏ ఆపదా రాకపోవడంతో... అంతా ఊపిరిపీల్చుకున్నారు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు