పాకిస్థాన్ యువతి ఉచ్చులో భారత జవాన్‌... కొంపముంచిందిగా...

Pulwama Terrorist Attack Update : దేశ చరిత్రలో అత్యంత విషాద ఘటనల్లో ఒకటి పుల్వామా ఉగ్రదాడి. ఓ అమ్మాయితో ఆపరేషన్ జరిపించి, పాకిస్థాన్ ఈ ఉగ్రదాడికి పాల్పడినట్లు తెలిసింది.

Krishna Kumar N | news18-telugu
Updated: May 17, 2019, 9:11 AM IST
పాకిస్థాన్ యువతి ఉచ్చులో భారత జవాన్‌... కొంపముంచిందిగా...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Honey Trap : అందాల వల వేసింది... మాటలతో కవ్వించింది... చూపులతో కైపెక్కించింది... అంతే ఆ CRPF జవాన్ ఆమె ఉచ్చులో చిక్కుకున్నాడు. ఆమెతో చాటింగ్ చెయ్యడం మొదలుపెట్టాడు. నువ్వంటే నాకు ఇష్టం అన్నాడు... పరిస్థితిని అక్కడి దాకా తీసుకొచ్చిన ఆ టక్కులాడి... పైకి ప్రేమ నటిస్తూ... తెరవెనక అసలు కథ మొదలు పెట్టిందనీ, జమ్మూలో జరిగిన పుల్వామా ఉగ్రదాడి వెనక పాకిస్థాన్‌కి చెందిన ఆ యువతి పాత్ర ఉందనీ... మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, కేంద్ర నిఘా సంస్థల ఎంక్వైరీలో తేలింది. మన ఆర్మీ జవాన్ల కదలికలు ఇతర సమాచారాన్ని పాకిస్థాన్‌కు ఇచ్చిన ఇండియన్ జవాన్ అవినాష్ కుమార్ (25)ని మధ్యప్రదేశ్ ఏటీఎస్ అధికారులు అరెస్టు చేశారు. ఇలా ఎందుకు చేశావని ప్రశ్నిస్తే... అతను చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోవడం అధికారుల వంతైంది.

virtual sim,pulwama terror attack,pulwama attack,terror attack,pulwama terror attacks,pulwama,pulwama terrorist attack,pulwama terror strike,kashmir terror attack,terror attack i,pulwama crpf convoy attack,pakistan terror attack,pulwama attack news,kashmir attack,jammu kashmir terror attack,pulwama crpf camp attack,pulwama attack today,pulwama aatanki hamla,terror attack live,kashmir pulwama attack,pulwama encounter,పుల్వామా ఉగ్ర దాడి,ఉగ్రవాదులు,వర్చువల్ సిమ్,జమ్మూ కాశ్మీర్,
పుల్వామా ఉగ్రదాడి (File)


అవినాష్ కుమార్ ఆ పాకిస్థానీ అమ్మాయితో వాట్సాప్ స్నూఫింగ్ ద్వారా ఛాటింగ్ చేశాడు. ఇలాంటి చాటింగ్ చెయ్యడం వల్ల... చేసేవాళ్లకు తప్ప ఇంకెవరికీ ఈ విషయం తెలియదు. ఈ చాటింగ్ ద్వారా... ఎప్పటికప్పుడు భారత బలగాల కదలికలపై సమాచారం తెలుసుకున్న ఆ అమ్మాయి... పుల్వామాలో ఉగ్రదాడి జరిగేందుకు వీలు కల్పించిందని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల దర్యాప్తులో వెల్లడైంది. సీఆర్‌పీఎఫ్ బలగాల కదలికల సమాచారాన్ని ఆ యువతి ద్వారా అవినాష్ పాకిస్థాన్‌కు అందజేశాడు. ఫలితంగా పుల్వామాలో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేయించి 40 మంది సైనికుల్ని చంపేశారు.

మధ్యప్రదేశ్... ఇండోర్ దగ్గర్లోని మోహో పట్టణంలోని బీహార్ రెజిమెంట్‌లో నాయక్ క్లర్కుగా అవినాష్ కుమార్ పనిచేశారు. 2018లో అతన్ని అసోంకి బదిలీ చేశారు. అవినాష్ తండ్రి కూడా ఆర్మీ జవానే. అవినాష్‌తో ప్రేమ ఒలకబోసిన ఆ కన్నింగ్ లేడీ... సరదాగా మాట్లాడుతూ... ఏయే జవాన్లు ఎక్కడెక్కడ మోహరిస్తున్నారో, ఎప్పుడెప్పుడు ఎటు వెళ్తున్నారో గోముగా అడిగేది. ఆమె మాటలకు ఫ్లాటైన అవినాష్... వాళ్లు అటు వెళ్తున్నారు, వీళ్లు ఇటు వెళ్తున్నారు అంటూ... అన్నీ వివరంగా చెప్పేవాడు. అలా అతన్ని కవ్విస్తూ... తనకు కావాల్సిన సమాచారం లాగేసుకుంది ఆ కిలేడీ.

పుల్వామా దాడికి కొన్ని రోజుల ముందు నుంచీ చాటింగ్ శృతి మించిందని తెలిసింది. సెక్స్ చాట్ కూడా చేసుకున్నారని తేలింది. అతని అకౌంట్‌లోకి పాకిస్థాన్ నుంచీ రూ.50 వేలు వచ్చినట్లు తెలిసింది. అందుకు సంబంధించి కూపీ లాగుతున్నారు. అవినాష్ కుమార్‌ను అరెస్టు చేసి భోపాల్‌లోని స్పెషల్ జిల్లా కోర్టుకు తీసుకెళ్లి... తర్వాత రిమాండుకు తరలించారు. ప్రస్తుతం అవినాష్ ఇంట్లో తనిఖీలు జరుగుతున్నాయి.

 

ఇవి కూడా చదవండి :ఎల్ఈడీ బల్బులతో ప్రమాదం... కళ్లుపోతాయ్..!!

బెంగాల్‌లో బీజేపీ వ్యూహం ఫలిస్తోందా... మమతాబెనర్జీకి షాక్ తప్పదా..?

100+18 ఇదీ వైసీపీ లెక్క... జగన్ చేయించిన 5 సర్వేల్లో తేలిందేంటి..?

జనసేన పోటీ వెనక చంద్రబాబు వ్యూహం..? పక్కా ప్లాన్‌తో అంతా జరుగుతోందా..?
First published: May 17, 2019, 9:10 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading