హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Amit Shah: NIA దాడులపై అమిత్ షా అత్యున్నత స్థాయి సమావేశం.. PFIపై నిషేధం..?

Amit Shah: NIA దాడులపై అమిత్ షా అత్యున్నత స్థాయి సమావేశం.. PFIపై నిషేధం..?

అమిత్ షా

అమిత్ షా

NIA Raids: ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, అసోంలో రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. తనిఖీల అనంతరం 106 మంది కార్యకర్తలను అరెస్ట్ చేసినట్లు సమాచారం

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

దేశవ్యాప్తంగా NIA సోదాలు జరుగుతున్నాయి. అర్ధరాత్రి నుంచి మెరుపులు దాడులు చేస్తున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమీకరిస్తున్నారని, యువతకు ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నారన్న ఆరోపణలతో... పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) ఆఫీసులు, కార్యకర్తల ఇళ్లల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వంద మందికి పైగా కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షా (Amit Shah) అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. జాతీయ భద్రతా సలహారు (NSA) అజిత్ దోబాల్, హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా, ఎన్ఐఏ డీజీ దినకర్ గుప్తా, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ దీకా ఈ సమావేశానికి హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఒకేసారి పెద్ద మొత్తంలో ఎన్ఐఏ దాడులు జరగడం, హోంమంత్రి అమిత్ షా సమీక్ష సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో... పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థపై నిషేధం విధిస్తారన్న ప్రచారం జరుగుతోంది.

NIA Raids: ఎన్ఐఏ సోదాలపై దుమారం.. రోడ్లపై బైఠాయించి PFI కార్యకర్తల ఆందోళన

ఇవాళ ఏపీ, తెలంగాణ , కర్నాటక, తమిళనాడు , కేరళ , ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ , అసోంలో రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. పలు చోట్ల ఎన్ఐఏతో పాటు ఈడీ దాడులు కూడా జరుగుతున్నాయి. సోదాల అనంతరం 106 మంది కార్యకర్తలను అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఆఫీసుల నుంచి మ్యాగజైన్లు, ఇతర పత్రాలు,హార్డ్ డిస్క్‌లు, పెన్ డ్రైవ్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఐతే తమిళనాడు, కేరళ, అసోం, ఏపీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులకు వ్యతిరేకంగా.. పీఎఫ్ఐ కార్యకర్తలు ఆందోళనలు చేశారు. ఎన్ఐఏ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. ఎన్ఏఐ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. సీఆర్‌పీఎఫ్ ఇతర కేంద్ర బలగాల బందోబస్తు మధ్య పీఎఫ్ఐ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు.

హైదరాబాద్‌ (Hyderabad)లోని చాంద్రాయణ గుట్టలోని పీఎఫ్ఐ కార్యాలయాన్ని ఎన్ఐఏ అధికారులు సీజ్ చేశారు. హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్స్, పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఉప్పల్, ఘట్‌కేసర్‌లోనూ తనిఖీలు నిర్వహించారు. కరీంనగర్‌, నిజామాబాద్‌ల పలు చోట్ల సోదాలు చేపట్టారు. అటు ఏపీలోనూ ఎన్ఐఏ రైడ్స్ జరుగుతున్నాయి. కర్నూలు , గుంటూరులోని పలువురు పీఎఫ్ఐ కార్యాకర్తల ఇళ్లల్లో సోదాలు చేసి.. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఐతే ఎన్ఐఏ దాడులను పీఎఫ్ఐ ఖండించింది. తాము ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని.. తమ ఆఫీసులపై దాడులు చేసి.. భయానక వాతావరణం సృష్టిస్తోంది ఎన్ఐఏ మండిపడింది. ఇలాంటి చర్యలను చూసి.. పీఎఫ్ఏ తలొగ్గదని స్పష్టం చేసింది.

First published:

Tags: Amit Shah, Hyderabad, NIA, PFI

ఉత్తమ కథలు