Home /News /national /

ఢిల్లీలో కరోనా కేసులు పెరగడంపై కేంద్రం సీరియస్... నేడు కీలక భేటీ

ఢిల్లీలో కరోనా కేసులు పెరగడంపై కేంద్రం సీరియస్... నేడు కీలక భేటీ

అమిత్ షా (File Photo)

అమిత్ షా (File Photo)

శుక్రవారం ఒక్కరోజే ఢిల్లీలో రికార్డ్ స్థాయిలో 2,137 కరోనా కేసులు వెలుగు చూశాయి.

    ఢిల్లీలో కరోనా కేసులు ఎక్కువవుతుండటం కేంద్రానికి ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజల్, సీఎం కేజ్రీవాల్‌తో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌తో పాటు ఎస్‌ఎండీఏ సభ్యులు, ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా, ఇతర సీనియర్ అధికారులు పాల్గొననున్నారు. శుక్రవారం ఒక్కరోజే ఢిల్లీలో రికార్డ్ స్థాయిలో 2,137 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఢిల్లీలో ఒకే రోజు ఈ స్థాయిలో కరోనా కేసులు రావడం ఇదే ప్రథమం. ఇక దేశ రాజధానిలో కరోనా కేసుల సంఖ్య 36 వేలకు చేరుకోగా... ఈ వైరస్ కారణంగా 1,214 మంది చనిపోయారు. దీంతో అప్రమత్తమైన కేంద్రం... ఢిల్లీలో కరోనా పెరుగుదలపై రాష్ట్ర ప్రభుత్వంతో సమావేశం కానుంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Amit Shah, Arvind Kejriwal, Coronavirus, Delhi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు