Amit Shah on News18: వలస కార్మికుల సమస్యపై అమిత్ షా ఏమన్నారంటే...

Home Minister Amit Shah Exclusive Interview: ప్రభుత్వం లాక్ డౌన్‌ విషయంలో తొందరపడిందని చెప్పడం న్యాయం కాదని అన్నారు. ఒక వేళ అదే జరిగితే, తొక్కిసలాట పరిస్థితి వచ్చి ఉండేదన్నారు. సమయంలో టెస్టింగ్, క్వారంటైన్ సదుపాయాలు కూడా సరిగ్గా లేవు. అయితే 2 నెలల వ్యవధిలో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసామన్నారు. అలాగే వలస కార్మికులకు ఆహార వసతి కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు 11 వేల కోట్ల రూపాయలు విడుదల చేశామన్నారు.

news18-telugu
Updated: June 1, 2020, 9:33 PM IST
Amit Shah on News18: వలస కార్మికుల సమస్యపై అమిత్ షా ఏమన్నారంటే...
న్యూస్ 18తో అమిత్ షా ఇంటర్వ్యూ
  • Share this:
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2.0 మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నెట్‌వర్క్ 18 గ్రూప్ ఎడిటర్-ఇన్-చీఫ్ రాహుల్ జోషి దేశ హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు. ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో, దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు, అలాగే అన్‌లాక్ 1.0 సవాళ్లు, కరోనాపై యుద్ధం, లాక్ డౌన్ అనంతరం వలస కార్మికుల పరిస్థితి, సహా పలు సమస్యలపై ఆయన సమాధానం ఇచ్చారు.

ఈ సందర్భంగా వలస కూలీల ప్రశ్నపై హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ...ప్రభుత్వం లాక్ డౌన్‌ విషయంలో తొందరపడిందని చెప్పడం న్యాయం కాదని అన్నారు. ఒక వేళ అదే జరిగితే, తొక్కిసలాట పరిస్థితి వచ్చి ఉండేదన్నారు. సమయంలో టెస్టింగ్, క్వారంటైన్ సదుపాయాలు కూడా సరిగ్గా లేవు. అయితే 2 నెలల వ్యవధిలో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసామన్నారు. అలాగే వలస కార్మికులకు ఆహార వసతి కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు 11 వేల కోట్ల రూపాయలు విడుదల చేశామన్నారు.

అమిత్ షా మాట్లాడుతూ, 1 కోటి 10 లక్ష మంది ప్రజలు తమ ఇళ్లకు చేరుకున్నారని, అనేక నిర్బంధాలను ఎదిరించి వారు తమ కుటుంబాలతో కలిసి జీవించడం ప్రారంభించారన్నారు. పలు రాష్ట్రాలు ప్రజలకు అవగాహన కల్పించాయని, కరోనా తీవ్రతను ప్రజలు క్రమంగా అర్థం చేసుకున్నారు. అలాగే వలసదారుల కోసం చాలా ఏర్పాట్లు చేసామన్నారు, ఇంకా లోపాలను తొలగించాల్సి ఉందని, వాటిని తొలగిస్తామన్నారు. రైతులు, సీనియర్ సిటిజన్లు, వితంతువుల ఖాతాకు మోదీ ప్రభుత్వం నేరుగా డిబిటి ద్వారా డబ్బు పంపించిందని పేర్కొన్నారు.
First published: June 1, 2020, 9:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading