Home /News /national /

HOME LOAN EMI ARE YOU UNABLE TO PAY HOME LOAN AMID COVID HERE IS WHAT YOU CAN DO GH SK

Home Loan: కరోనా వేళ హోమ్​ లోన్ ఈఎంఐ చెల్లించడం కష్టంగా ఉందా? ఇలా చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సకాలంలో నెలవారీ వాయిదాల (EMI)లు చెల్లించకపోతే ఆయా బ్యాంకులు లేదా ఫైనాన్షియల్​ సంస్థలు మిమ్మల్ని డిఫాల్టర్​గా పరిగణిస్తాయి. మీరు తనఖా పెట్టిన ఆస్తిని జప్తు చేస్తాయి. అందువల్ల, ఈ సమస్య నుంచి బయటపడేందుకు ప్రత్నామ్నాయ మార్గాలను అన్వేషించాలి.

ఇంకా చదవండి ...
కరోనా వైరస్ కారణంగా చాలా మంది ఉపాధి కోల్పోయారు. మరికొందరికి ఉద్యోగ భద్రతపై భయాందోనళలు నెలకొన్నాయి. లాక్​డౌన్​ కారణంగా వ్యాపారాల నిర్వహణ సరిగ్గా జరగట్లేదు. అందువల్ల ఖర్చులు తగ్గించుకోవడానికి ఉద్యోగులు, కార్మికులను తొలగిస్తున్నాయి అనేక కంపెనీలు. దీంతో ఉద్యోగం ఉందన్న ధీమాతో గతంలో తీసుకున్న లోన్లను ఇప్పుడు చెల్లించలేక సతమతమవుతున్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో గృహ రుణ డిఫాల్ట్​లు పెరిగిపోవడమే ఇందుకు నిదర్శనం. అయితే, సకాలంలో నెలవారీ వాయిదాల (EMI)లు చెల్లించకపోతే ఆయా బ్యాంకులు లేదా ఫైనాన్షియల్​ సంస్థలు మిమ్మల్ని డిఫాల్టర్​గా పరిగణిస్తాయి. మీరు తనఖా పెట్టిన ఆస్తిని జప్తు చేస్తాయి. అందువల్ల, ఈ సమస్య నుంచి బయటపడేందుకు ప్రత్నామ్నాయ మార్గాలను అన్వేషించాలి. కరోనావైరస్ కారణంగా మీ నెలవారీ ఈఎంఐలను చెల్లించడంలో ఇబ్బందులు ఎదురైతే ఈ క్రింది పద్ధతులను అనుసరించండి.

మారిటోరియం ఎంచుకోండి
కరోనా మహమ్మారి కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మారిటోరియంను ప్రకటించింది. తద్వారా, మూడు నెలల పాటు ఈఎంఐని వాయిదా వేసుకునే వెసులుబాటు కల్పించింది. గృహ రుణాలతో పాటు అన్ని రకాల రుణాలకు ఈ తాత్కాలిక నిషేధం వర్తిస్తుంది. అంటే ఈ వ్యవధిలో మీ ఈఎంఐలను చెల్లించకపోయినా సరే మీ నుంచి ఎంటువంటి అదనపు వడ్డీ వసూలు చేయరు. అంతేకాక, డిఫాలర్టర్​గా పరిగణిస్తూ నోటీసులు పంపించరు. ఈ విపత్కర సమయంలో ఇది పెద్ద ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు.

ఉద్యోగం కోల్పోగా వచ్చిన డబ్బు
చాలా సంస్థలు తమ ఉద్యోగులను తొలగించేటప్పుడు వారి నోటీసు పీరియడ్​కి సమానమైన వేతనాన్ని చెల్లిస్తాయి. మీరు కూడా మీ ఉద్యోగాన్ని కోల్పోయే క్రమంలో ఇలా వేతనాన్ని అందుకుంటే, దాన్ని అనవసరపు ఖర్చులకు ఉపయోగించకండి. ఈ మొత్తాన్ని EMI లను చెల్లించడానికి ఉపయోగించుకోండి. తద్వారా, జరిమానా భారం నుండి ఉపశమనం పొందుతారు.

పీఎఫ్​ విత్​డ్రా చేసుకోండి
మీ నెలవారీ జీతంలో కొంత భాగం మీ ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) ఖాతాలో జమ అవుతుంది. ఒకవేళ మీరు ఉద్యోగం కోల్పోయిన క్రమంలో ఈ పీఎఫ్​ను విత్​డ్రా చేసుకొని ఈఎంఐలను చెల్లించండి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మీ పిఎఫ్ బ్యాలెన్స్​లో నుంచి 75 శాతం ఉపసంహరించుకోవచ్చు. దరఖాస్తు చేసిన మూడు రోజుల్లోపు మీ ఖాతాలోని డబ్బు బ్యాంక్​ అకౌంట్​లో జమ అవుతుంది. తద్వారా, కొంత కాలం పాటు మీ ఈఎంఐని సులభంగా చెల్లించవచ్చు. మీరు కొత్త ఉద్యోగంలో చేరే వరకు ఈ పిఎఫ్​ అమౌంట్​ను ఉపయోగించుకోండి.

స్నేహితుల నుంచి అప్పు తీసుకోండి
ఉద్యోగం కోల్పోయి రుణాలు చెల్లించలేకపోతే.. మీరు మీ స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి అప్పు తీసుకోవడం బెస్ట్​ ఆప్షన్​గా చెప్పవచ్చు. ఎందుకంటే, స్నేహితులు, బంధువుల నుంచి చిన్న మొత్తంలో అప్పులు సాధారణంగా వడ్డీ రహితంగానే ఉంటాయి. మీ పరిస్థితి వివరించి, వారిని సహాయం చేయమని కోరండి.

మీ పెట్టుబడులను విత్​డ్రా చేసుకోండి
మీ సేవింగ్స్​, ఫిక్స్​ డిపాజిట్లను తనిఖీ చేయండి. వాటిలో కొంత భాగాన్ని విత్​డ్రా చేయడం ద్వారా మీ ఈఎంఐలు సులభంగా చెల్లించవచ్చు. మీరు మరో ఉద్యోగం పొందే వరకు ఎంత అవసరం ఉంటుందో లెక్కగట్టుకొని అంత మొత్తం విత్​డ్రా చేసుకోండి.

బీమా పాలసీ నుంచి రుణం తీసుకోండి
మీకు బీమా పాలసీ ఉన్నట్లైతే, దాని నుంచి కూడా రుణం తీసుకోవచ్చు. వీటి వడ్డీ రేట్లు కూడా ఇతర వ్యక్తిగత రుణాల కంటే తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా, మీరు పాత కస్టమర్​ కాబట్టి, మీ లోన్​ కూడా త్వరగా అప్రూవ్​ అవుతుంది. ఈ డబ్బును మీ హోమ్​లోన్ ఈఎంఐ చెల్లించేందుకు ఉపయోగించుకోండి.
మ్యూచువల్ ఫండ్లను రీడీమ్ చేయండి

మీరు ఇది వరకు మ్యూచువల్​ ఫండ్లలో పెట్టుబడి పెట్టి మెచ్యూరిటీ వ్యవధి పూర్తయి ఉంటే.. వెంటనే దాన్ని రీడీమ్​ చేసుకోండి. ఈ డబ్బును హోమ్​లోన్​ ఈఎంఐ కోసం వెచ్చించండి. ఎందుకంటే సకాలంలో ఈఎంఐ చెల్లించకపోతే మీ క్రెడిట్ స్కోర్‌ ప్రభావితమవుతుందని గమనించండి. ఫలితంగా భవిష్యత్తులో మీరు రుణాలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Business, EMI, Home loan, House loan

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు