ముంబై హోలీ సంబరాల్లో ఉగ్రవాది మసూద్ అజర్... డేంజరస్ పబ్జి

హోలి పండుగ రోజు కూడా హోలిక ప్రతిమను దహనం చేస్తారు. దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో కాముని దహనం నిర్వహిస్తారు. అయతే మహారాష్ట్ర ముంబైలో ఈసారి హోలీ వేడుకను వినూత్నంగా నిర్వహిస్తున్నారు.

news18-telugu
Updated: March 21, 2019, 9:43 AM IST
ముంబై హోలీ సంబరాల్లో ఉగ్రవాది మసూద్ అజర్... డేంజరస్ పబ్జి
మసూద్ అజర్, పబ్జి గేమ్ దిష్టిబొమ్మ
news18-telugu
Updated: March 21, 2019, 9:43 AM IST
హోలీ రోజున కాముని దహనం చేస్తారు. హిందూ పురాణాల ప్రకారం భక్త ప్రహ్లాదున్ని చంపడానికి ప్రయత్నం చేసిన హిరణ్యకశ్యపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి దహనానికి సంకేతంగా సంప్రదాయ భోగి మంటలను నిర్వహిస్తారు. ఎలాగంటే విజయదశమి రోజున రావణుడిని ప్రతిమను దహనం చేసినట్లుగా ఈ  కాముని స్థానంలో... జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌తో పాటు పబ్జి గేమ్ దిష్టిబొమ్మల్ని దహనం చేసేందుకు రెడీ అయ్యారు.

జమ్ము-కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలోని సిఆర్పిఎఫ్ కాన్వాయ్‌పై జరిపిన దాడిలో 40మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. అయితే ఈ ఘటనకు కారణమైన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజార్ అని తేల్చారు అధికారులు. అలాంటి రాక్షసుడి దిష్టిబొమ్మను దహనం చేసి హోలీ పండగ చేసుకోవాలని ముంబై వాసులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నగరంలో పలుచోట్ల మసూద్ అజర్ దిష్టిబొమ్మల్ని దహనం చేసేందుకు రెడీ చేశారు. మసూద్ అజర్‌తో పటు డేంజరస్ గేమ్ పబ్జి దిష్టిబొమ్మను కూడా కొంతమంది విద్యార్థులు రూపొందించారు. పబ్జిగేమ్ ఎంతో మంది అమాయకుల ప్రాణాలు తీసిందని ఆరోపించారు. ఈ గేమ్ పిచ్చిలో పడి అనేకమంది చదువుకు దూరమవుతున్నారన్నారు. అందుకే కొన్నిరాష్ట్రాల్లో పబ్జిగేమ్‌పై నిషేధం కూడా విధించారు. అలాంటి గేమ్‌ను దహనం చేయాలని విద్యార్థులు, యువకులు పిలుపునిచ్చారు. ముంబై ప్రాంతానికి చెందిన కొంతమంది విద్యార్థులు పబ్జి దిష్టిబొమ్మను కూడా దహనం చేసేందుకు సిద్దం చేశారు.First published: March 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...