Home /News /national /

HOLI CELEBRATION 2021 WORLD LEADERS PM NARENDRA MODI KAMALA HARRIS AMIT SHAH CONVEY HAPPY HOLI WISHES NK

Holi 2021: ప్రధాని నరేంద్రమోదీ మొదలు కమలాహారిస్ వరకూ ప్రముఖుల హోలీ శుభాకాంక్షలు

ప్రముఖుల హోలీ శుభాకాంక్షలు (File Image)

ప్రముఖుల హోలీ శుభాకాంక్షలు (File Image)

Holi celebrations 2021: రంగుల పండుగతో మన జీవితం రంగుల మయం కావాలని కోరుతూ నేతలు, ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. వారి విషెస్ చూద్దాం.

    Holi 2021: రంగుల పండుగ హోలీ వచ్చేసింది. దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు జరుపుకుంటున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో తక్కువే కానీ... ఉత్తరప్రదేశ్ లాంటి ఉత్తరాది రాష్ట్రాల్లో మనుషులకు బదులు హోలీ రంగులే కనిపిస్తున్నాయి. తెల్లటి బట్టలు కాస్తా రంగులమయం అయిపోయాయి. కరోనా జాగ్రత్తలు పాటిస్తూనే... హోలీ హోలీ అంటూ వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా, అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతి మహిళ కమలా హారిస్ ఇలా చాలా మంది శుభాకాంక్షలు చెబుతున్నారు.

    దేశ ప్రజలకు విషెస్ చెబుతూ... రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్... "దేశ ప్రజలందరికీ ఆనంద హోలీ. రంగుల పండుగైన హోలీని అందరూ ఆనందంగా, సంతోషంగా కలిసిమెలిసి జరుపుకోపాలి. మీ జీవితాల్లో ఆనందం నిండాలి. మన సంస్కృతిలో భాగమైన ఈ పండుగతో... దేశంలో ఐక్యత మరింత పెరగాలి" అని కోరుతూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన... దాన్ని లెక్క చేయకుండా విషెస్ చెప్పారు.


    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ పండుగ వచ్చినా దేశ ప్రజలకు విషెస్ చెబుతారు. హోలీకీ చెప్పారు. అందరికీ హ్యాపీ హోలీ అన్న ఆయన... ఈ పండుగ మనలో కొత్త ఎనర్జీ తేవాలని అన్నారు. ప్రతి ఒక్కరికీ ఇది సంతోషం కలిగించాలన్నారు.


    కేంద్ర హోంమంత్రి అమిత్ షా... ప్రత్యేక ఫొటోతో విషెస్ చెప్పారు. సంతోషం, ఐక్యత, కలిసిమెలిసి జరుపుకునే ఈ పండుగ అందరిలోనూ ఆనందం, శాంతిని తేవాలని కోరారు.


    అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా తనదైన శైలిలో శుభాకాంక్షలు చెప్పారు. హోలీ నాడు అందరూ విబేధాలను పక్కనపెట్టి... కలిసి మెలిసి జరుపుకోవాలని కోరారు. ఈ కరోనా కాలంలో ఒకరికి ఒకరు తోడుగా ఉంటామనే సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలని కోరారు.



    ఇది కూడా చదవండి: Business Ideas: లాభసాటి వ్యవసాయం... 4 నెలల్లో రూ.8 లక్షల ఆదాయం

    ఈ సంవత్సరం కరోనా ఉంది కాబట్టి... గుంపులుగా పెద్ద సంఖ్యలో హోలీ జరుపుకోవడానికి వీల్లేదని అన్ని రాష్ట్రాలూ ఆంక్షలు విధించాయి. వాటిని పాటిస్తూ ప్రజలు... ప్రశాంతంగా హోలీ చేసుకుంటున్నారు.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Holi 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు