పుల్వామాలో భారత జాతీయ జెండా ఎగరేసిన ఉగ్రవాది తండ్రి

పుల్వామాలో భారత జాతీయ జెండా ఎగరేసిన ఉగ్రవాది తండ్రి

భారత్‌లో ఉన్నవారంతా... జాతీయ జెండాకు వందనం చేస్తారు. అదే ఉగ్రవాదులు భారత్‌లో ఉంటే... వాళ్లు వందనం చెయ్యరు. కానీ ఆ ఉగ్రవాది తండ్రి జెండా ఎగరేశాడు. తాను ఉగ్రవాది కాదు అని చాటి చెప్పాడు.

 • Share this:
  జమ్మూకాశ్మీర్‌లో పుట్టి, పెరిగి.. ఉగ్రవాద భావ జాలానికి ఆకర్షితుడైన బుర్హాన్ వని (Burhan Wani) ఉగ్రవాదంలోకి వెళ్లినా... అతని తండ్రి ముజఫర్ వని (Muzaffar Wani) మాత్రం ఉగ్రవాదానికి చెక్ పెడుతూ... పుల్వామాలో జాతీయ జెండా ఎగరేశారు. వృత్తి రీత్యా టీచరైన ముజఫర్ వని... త్రాల్‌లోని ప్రభుత్వ బాలిక ఉన్నత సెకండరీ స్కూల్‌లో నిన్న ఆగస్ట్ 15 సందర్భంగా జెండా ఎగరేసి వందనం చేశారు. ఈ విషయాన్ని అధికారులు స్పష్టం చేశారు.

  బుర్హాన్ వని... ఇంట్లోంచీ పారిపోయి... హిజ్బుల్ ముజాహిదీన్‌ (Hizbul Mujahideen) ఉగ్రవాద సంస్థలో చేరాడు. పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉగ్రవాద శిక్షణ పొందాడు. భారత్‌పై గన్ గురిపెట్టాడు. 2016 జులైలో దక్షిణ కాశ్మీర్‌లో భద్రతా దళాలపై కాల్పులు జరిపాడు. దాంతో అలర్టైన ఫోర్స్... ఎన్‌కౌంటర్ చెయ్యడంతో... బుర్హాన్ వని చనిపోయాడు.

  బుర్హాన్ వని ఉగ్రవాదిగా మారిపోయాడనీ... అతను భారతీయ మూలాలను మర్చిపోయాడని సైనికులు గ్రహించారు గానీ.. స్థానిక యువత గ్రహించలేదు. భద్రతా దళాలు... తమ వాణ్ని చంపేశాయంటూ... స్థానిక యువత ఏకంగా 5 నెలలపాటూ... ఆందోళనలు చేశారు. ఈ ఆందోళనల్లో 100 మందికి పైగా చనిపోగా... వేల మంది గాయపడ్డారు.

  అప్పట్లో తన కొడుకును సైన్యం చంపడాన్ని ముజఫర్ వని తప్పుపట్టలేదు. ఉగ్రవాదంలోకి వెళ్లడం తప్పే అని కొడుకును తప్పుపట్టారు. ఉగ్రవాదాన్ని తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాననీ, స్థానిక యువత ఆ ఉచ్చులోకి దిగవద్దని కోరారు.

  ఇది కూడా చదవండి: జెండా ఎగరేసి సెల్యూట్ చేస్తూ కాంగ్రెస్ నేత మరణం.. షాక్‌లో కార్యకర్తలు

  ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా... స్వాతంత్ర్య దినోత్సవం నాడు అన్ని స్కూళ్లు, ప్రభుత్వ ఆఫీసుల్లో తప్పనిసరిగా జెండా వందన కార్యక్రమం జరగాలని... కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆ క్రమంలో జమ్మూకాశ్మీర్ అంతటా... ఈ కార్యక్రమం జరిగింది.
  Published by:Krishna Kumar N
  First published: