హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Hizab Row : ముదురుతున్న హిజాబ్ వివాదం..కాషాయ కండువాలతో కాలేజీల్లో విద్యార్థుల ఆందోళన

Hizab Row : ముదురుతున్న హిజాబ్ వివాదం..కాషాయ కండువాలతో కాలేజీల్లో విద్యార్థుల ఆందోళన

Hizab protests

Hizab protests

Karnataka Hizab Row :  కర్ణాటకలో హిజాబ్ (ముస్లిం మహిళలు ధరించే బుర్కాలు) వివాదం ముదురుతోంది. విద్యాసంస్థల్లో ముస్లిం విద్యార్థినులు బుర్కాలు వేసుకుని వస్తే..తాము కాషాయం కండువాలు వేసుకుని నుదిటి మీద సింధూరం పెట్టుకుని కాలేజ్ లోకి

Karnataka Hizab Row :  కర్ణాటకలో హిజాబ్ (ముస్లిం మహిళలు ధరించే బుర్కాలు) వివాదం ముదురుతోంది. విద్యాసంస్థల్లో ముస్లిం విద్యార్థినులు బుర్కాలు వేసుకుని వస్తే..తాము కాషాయం కండువాలు వేసుకుని నుదిటి మీద సింధూరం పెట్టుకుని కాలేజ్ లోకి వస్తామని హిందులు పట్టుబడుతున్నారు. ఉడిపి జిల్లాలో ప్ర‌స్తుతం ప‌రిస్థితులు ఆందోళ‌న‌క‌రంగా మారుతున్నాయి. హిజ‌బ్ వేసుకుని అమ్మాయిలు కాలేజీల‌కు వస్తున్న నేప‌థ్యంలో.. అక్క‌డి మరో వర్గం విద్యార్థులు నిర‌స‌న‌గా కాషాయ కండువాల‌తో ఆందోళ‌న చేప‌ట్టారు. ఉడిపిలోని మ‌హాత్మా గాంధీ మెమోరియ‌ల్ కాలేజీలో ఇవాళ..హిజ‌బ్‌ తో ముస్లిం మ‌హిళ‌లు కాలేజీకి రాగా వాళ్ల‌కు ఎదురుగా పలువురు విద్యార్థులు కాషాయ కండువాలు వేసుకుని,నెత్తికి టర్బన్ లు పెట్టుకుని నినాదాలు చేస్తూ వెళ్లారు. కాలేజీ క్యాంప‌స్‌ లో చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న ఉద్రిక్తంగా మారింది. నిరసన కారణంగా మహాత్మాగాంధీ మెమోరియల్ కళాశాల ప్రవేశ ద్వారాలను కొద్దిసేపు మూసివేశారు. కళాశాల వెలుపల జై శ్రీ రామ్ మరియు వందేమాతరం నినాదాలు చేశారు విద్యార్థులు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం కళాశాల ఆవరణలో భారీగా పోలీసులు మోహరించారు.


మరోవైపు,హిజాబ్ వివాదంపై ఇవాళ కర్ణాటక హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఇక, రాష్ట్రంలోని పలు కాలేజీల్లో కూడా ఇలాంటి ఘ‌ట‌న‌లే జ‌రుగుతున్నాయి. ఉడుపి హిజాబ్ వివాదంపై స్పందించిన సీఎం బసవరాజ్ బొమ్మై.. సంబంధిత ప్రజలందరూ శాంతిని పాటించాలని మరియు పిల్లలను చదువుకోవడానికి అనుమతించాలని అన్నారు. ఈరోజు ఈ కేసు హైకోర్టులో విచారణకు రానుందని,కోర్టు తీర్పు కోసం వేచి చూడాలని అన్నారు.

ALSO READ Hizab Row : ముస్లింలకు హిజాబ్..హిందువులకు మంగళసూత్ర..ఎంపీ కామెంట్స్

ఇక,రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వం నిర్దేశించిన యూనిఫామ్ డ్రెస్​ కోడ్​ను తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఆయా పాఠశాలలు నిర్ణయించిన డ్రెస్ కోడ్​ను తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. డ్రెస్ కోడ్​ లేని కళాశాలల్లో సమానత్వం, సమగ్రత, శాంతి భద్రతలపై ప్రభావం చూపని దుస్తులు ధరించాలని స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వ పాఠశాలలు, కాలేజ్ లో విద్యార్థులు అందరిని సమానంగా చూస్తామని, ఇప్పటికే అధికారులకు స్పష్టం చేశామని కర్ణాటక విద్యశాఖా మంత్రి నాగేష్ మీడియాకు చెప్పారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Hindu community leaders, Karnataka, Muslim Minorities

ఉత్తమ కథలు