వాడికి బుద్ధి రాదు...పాక్ మాజీ కెప్టెన్‌పై గంభీర్ గుస్సా

అఫ్రిది చేసిన ఈ వ్యాఖ్యలపై గంభీర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల బుద్ధి ఎప్పటికీ పెరగదని మండిపడ్డారు.

news18-telugu
Updated: August 29, 2019, 3:27 PM IST
వాడికి బుద్ధి రాదు...పాక్ మాజీ కెప్టెన్‌పై గంభీర్ గుస్సా
గౌతమ్ గంభీర్(ఫైల్ ఫోటో)
  • Share this:
క్రికెట్ గ్రౌండ్‌లో మాత్రమే కాదు..బయట కూడా అగ్రెస్సివ్‌గానే ఉంటారు గౌతం గంభీర్. ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న గంభీర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. దేశ రాజకీయాలతో పాటు కశ్మీర్ అంశంపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తపరుస్తారు. అవతల ఎంతటి వారున్న పట్టించుకోరు...తాను చెప్పాల్సింది చెప్పేస్తారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది, గంభీర్ గతంలో చాలాసార్లు ట్విటర్ వార్ జరిగింది. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో మరోసారి వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది.

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్ అవర్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అందులో యువత భాగస్వామ్యం కావాలని అఫ్రిది సూచించాడు. అంతేకాదు శుక్రవారం మధ్యాహ్నం జరిగే ఓ నిరసన కార్యక్రమానికి తాను హాజరవుతానని రెండు రోజుల క్రితం ప్రకటించాడు. సెప్టెంబరు 6న ఓ అమరవీరుడి కుటుంబాన్ని పరామర్శిస్తానని.. ఆ తర్వాత ఎల్‌వోసీలోనూ పర్యటిస్తానని తెలిపాడు. కశ్మీరీ సోదరులకు అండగా ఉండాలని పాకిస్తానీలకు పిలుపునిచ్చాడు. అఫ్రిది చేసిన ఈ వ్యాఖ్యలపై గంభీర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల బుద్ధి ఎప్పటికీ పెరగదని మండిపడ్డారు.

కొంతమంది ఎప్పటికీ ఎదగరు. వాళ్లు క్రికెట్ ఆడుతారు. కానీ వయసు మాత్రం పెరగదు. అఫ్రిది లాంటి వాళ్లకు ఎప్పటికీ బుద్ధి పెర‌గ‌లేద‌ు.
గౌతం గంభీర్


కాగా, ట్విటర్లోనే కాదు క్రికెట్ గ్రౌండ్‌లోనూ వీరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆన్ ఫీల్డ్‌లో పలుమార్లు గొడవకు దిగారు. 2007లో కాన్పూర్‌లో జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్‌లో గంభీర్, అఫ్రిది గొడవ పడ్డారు. ఒకరి మీదకు మరొకరు దూసుకెళ్లడంతో సహచర ఆటగాళ్లు సర్ధిచెప్పారు. ఆ మ్యాచ్‌లో ప్రవర్తనా నియామవళిని ఉల్లంఘించినందుకు వారిపై ఐసీసీ చర్యలు కూడా తీసుకుంది.
First published: August 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>