Home /News /national /

కిస్టమస్ రోజు చర్చికి వెళ్లే హిందువులపై దాడులు చేస్తాం.. భజరంగ్ దళ్ నేత హెచ్చరిక

కిస్టమస్ రోజు చర్చికి వెళ్లే హిందువులపై దాడులు చేస్తాం.. భజరంగ్ దళ్ నేత హెచ్చరిక

వేదికపై మాట్లాడుతున్న మిథు నాథ్

వేదికపై మాట్లాడుతున్న మిథు నాథ్

అస్సోంకు చెందిన భజరంగ్‌ దళ్ నేత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. క్రిస్టమస్ రోజున చర్చిలకు వెళ్లే హిందువులపై దాడులు చేస్తామని, వారిని కొడతామని హెచ్చరించారు.

    అస్సోంకు చెందిన భజరంగ్‌ దళ్ నేత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. క్రిస్టమస్ రోజున చర్చిలకు వెళ్లే హిందువులపై దాడులు చేస్తామని, వారిని కొడతామని హెచ్చరించారు. కాచర్ జిల్లాకు చెందిన భజరంగ్ దళ్ నాయకుడు మిథు నాథ్ ఈ రకమైన కామెంట్స్ చేశాడు. వివరాలు.. కాచర్ జిల్లా సిల్‌చార్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మిథు నాథ్ మాట్లాడారు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో మెజారిటీ సంఖ్యలో ఉన్న క్రిస్టియన్లు హిందు ఆలయాలను మూసివేస్తున్నారని ఆయన ఆరోపించారు. అందువల్లే క్రిస్టమస్ వేడుకల్లో హిందువులు పాల్గొనవద్దని.. అలాచేస్తే వారిపై దాడులకు దిగుతామని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇక, మిథునాథ్ భజరంగ్‌ దళ్ జిల్లా విభాగం జనరల్ సెక్రటరీగా ఉన్నారు.

    "షిల్లాంగ్‌లో వారు దేవాలయాలను లాక్ చేస్తున్నారు. కానీ ఇక్కడ వారితో కలిసి వేడుకలను జరుపుకుంటాం. ఇకపై మేము అందుకు అనుమతించం. మా హిందూ అమ్మాయిలను తాకి వేధింపులకు గురిచేస్తే మేము గుండాలం అవుతాం. అందుకు మేము గర్వపడుతున్నాం. డిసెంబర్ 26న వార్త పత్రికల్లో వచ్చే హెడ్ లైన్ ఏమిటో నాకు తెలుసు.. భజరంగ్‌ దళ్ గుండాలు ఓరియంటల్ స్కూల్‌ను ధ్వంసం చేశారని రాస్తారు. కానీ మేము వాటిని పట్టించుకోం"అని మిథు నాథ్ అన్నారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Assam, Bajrang Dal, Christmas

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు