'టిప్పు ఎక్స్‌ప్రెస్‌'ను 'అనంత ఎక్స్‌ప్రెస్‌'గా మార్చాల్సిందే: హిందూసేన

టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలపై కర్ణాకటలో ఇప్పటికే రచ్చ జరుగుతోంది. కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా వేడుకలు నిర్వహించడంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తోంది.

news18-telugu
Updated: November 12, 2018, 5:00 PM IST
'టిప్పు ఎక్స్‌ప్రెస్‌'ను 'అనంత ఎక్స్‌ప్రెస్‌'గా మార్చాల్సిందే: హిందూసేన
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 'పేర్ల మార్పు' సీజన్ నడుస్తోంది. ఇప్పటికే పలు పట్టణాల పేర్లు మారిపోయాయి. మరికొన్ని నగరాల పేర్లనూ మార్చాలని డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా రైళ్ల పేరు మార్పూ తెరపైకి వచ్చింది. బెంగళూరు-మైసూరు టిప్పు ఎక్స్‌ప్రెస్‌ను అనంతకుమార్ ఎక్స్‌ప్రెస్‌గా మార్చాలని హిందూ సేన డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు రైల్వేశాఖమంత్రి పీయుష్ గోయల్‌కు లేఖ రాసింది.

కేంద్రమంత్రి అనంత్ కుమార్ సోమవారం అర్ధరాత్రి మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనకు నివాళిగా టిప్పు సుల్తాన్ ఎక్స్‌ప్రెస్‌కు అనంతకుమార్ పేరు పెట్టాలని హిందూ సేన రైల్వేశాఖకు విజ్ఞప్తి చేసింది.
ఓ వైపు టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను వ్యతిరేకిస్తూ బీజేపీ ఆందోళనలు చేస్తోంది. కానీ అదే బీజేపీ ప్రభుత్వం కింద పనిచేసే రైల్వేశాఖ మాత్రం టిప్పు సుల్తాన్ పేరు మీద కర్నాటకలో ఎక్స్‌ప్రెస్ రైలు నడుపుతోంది. జాతీయవాద పౌరులు దీన్ని ఎంతమాత్రం సహించరు. టిప్పు సుల్తాన్ హిందువులను ఊచకోత కోశారు. అనంత్‌కుమార్..కర్నాటకకు నిజమైన పుత్రుడు. ఆయన మరణించడం దురదృష్టకరం. అనంత్‌కు నివాళిగా టిప్పు రైలును అనంత్‌కుమార్ ఎక్స్‌ప్రెస్‌గా మార్చాలి.
హిందూ సేన


టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలపై కర్ణాకటలో ఇప్పటికే రచ్చ జరుగుతోంది. కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా వేడుకలు నిర్వహించడంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. టిప్పు జయంతి వేడుకలకు నిరసనగా చాలా చోట్ల బీజేపీ, హిందూ సంఘాల నేతలు ఆందోళనలు చేస్తున్నారు.
హిందూసేన లేఖ
First published: November 12, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...