శరీరంపై 15 కత్తిపోట్లు.. ముఖంపై కాల్పులు.. కమ్లేష్ పోస్ట్‌మార్టం రిపోర్ట్

ఘటనా స్థలంలో దొరికిన స్వీట్ బాక్స్ ఆధారంగా కేసును దర్యాప్తు చేసిన పోలీసులు.. హంతకులను గుజరాత్‌లో పట్టుకున్నారు.

news18-telugu
Updated: October 23, 2019, 3:14 PM IST
శరీరంపై 15 కత్తిపోట్లు.. ముఖంపై కాల్పులు.. కమ్లేష్ పోస్ట్‌మార్టం రిపోర్ట్
కమ్లేష్ తివారీ
  • Share this:
యూపీలో హిందూ సమాజ్ పార్టీ నేత కమ్లేష్ తివారీ హత్య దుమారం రేపిన విషయం తెలిసిందే. ఐతే ఆయన హత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కమ్లేష్‌ను 15 సార్లు కత్తితో పొడిచి.. అనంతరం ముఖంపై తుపాకీతో కాల్చి చంపినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. ఛాతీ, గొంతు భాగంలో 15 కత్తి పోట్లు ఉన్నాయి. తల వెనక భాగం నుంచి ఏ.32 బోర్ బుల్లెట్‌ను బయటకు తీశారు. దీన్ని బట్టి చూస్తే కమ్లేష్ ఎంత దారుణంగా హత్యచేశారో అర్థం చేసుకోవచ్చు. ఈ కేసులో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

అక్టోబరు 18న లక్నోలో కమ్లేష్ తివారీపై ఇద్దరు వ్యక్తులు దాడిచేశారు. కత్తులతో పొడిచి దారుణంగా చంపేశారు. కమ్లేష్ హత్య కేసులో గుజరాత్‌కు చెందిన అష్ఫఖ్ షేక్ (34), మొయినుద్దీన్ పఠాన్ (27)ను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్ నుంచి గుజరాత్‌లోకి ప్రవేశిస్తుండగా మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు సూరత్‌లో పలువురు అనుమానితులను పోలీసులు విచారించారు.

ఈ కేసులో యూపీలో కూడా ఇద్దరు అరెస్ట్ అయ్యారు. కమ్లేష్ భార్య కిరణ్ ఫిర్యాదు మేరకు బిజ్నోర్‌కు చెందిన మహ్మద్ ముఫ్తీ నయీమ్ కజ్మి, ఇమామ్ మౌలానా అన్వరుల్ హక్‌ను అదుపులోకి తీసుకున్నారు. కమ్లేష్‌ను చంపిన వారికి రూ. కోటిన్నర రివార్డ్ ఇస్తామని 2016లో వీరిద్దరు ప్రకటించారని కిరణ్ ఆరోపించింది. తన భర్త హత్య కేసులో వీరిద్దరి ప్రమేయం కూడా ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, ఘటనా స్థలంలో దొరికిన స్వీట్ బాక్స్ ఆధారంగా కేసును దర్యాప్తు చేసిన పోలీసులు.. హంతకులను గుజరాత్‌లో పట్టుకున్నారు.First published: October 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు